Home /News /jobs /

JOBS IN TELANGANA JOB OPPORTUNITIES IN NALGONDA DISTRICT SALARY RS 52000 DIRECT INTERVIEW WITHOUT EXAMINATION EVK

Jobs in Telangana: న‌ల్గొండ జిల్లాలో ఉద్యోగ అవ‌కాశాలు.. వేత‌నం రూ.52,000.. ప‌రీక్ష లేకుండా నేరుగా ఇంట‌ర్వ్యూ

నల్గొండ జిల్లాలో ఉద్యోగాలు

నల్గొండ జిల్లాలో ఉద్యోగాలు

Jobs in Telangana | తెలంగాణ ప్ర‌భుత్వానికి చెందిన న‌ల్గొండలోని ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల ప్రిన్సిప‌ల్ కార్యాల‌యంలో ప‌లు కాంట్రాక్టు ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల అయ్యింది. ఎటువంటి ప‌రీక్ష లేకుండా అభ్య‌ర్థుల‌ను నేరుగా వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూల‌కు ఆహ్వానించ‌నున్నారు.

ఇంకా చదవండి ...
    తెలంగాణ ప్ర‌భుత్వానికి చెందిన న‌ల్గొండలోని ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల ప్రిన్సిప‌ల్ కార్యాల‌యంలో ప‌లు కాంట్రాక్టు ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల అయ్యింది. ఎటువంటి ప‌రీక్ష లేకుండా అభ్య‌ర్థుల‌ను నేరుగా వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ (Walk in Interview) ల‌కు ఆహ్వానించ‌నున్నారు. వివిధ‌ విభాగంలో క‌లిపి 23 ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకొనే అభ్య‌ర్థుల గ‌రిష్ట వ‌య‌సు 44 ఏళ్లు మించి ఉండ‌కూడ‌దు. పోస్టుల ఆధార‌గా ఎంపికైన అభ్య‌ర్థుల‌కు నెల‌కు రూ.52,000 నుంచి రూ.1,25,000 వ‌ర‌కు వేత‌నం చెల్లిస్తారు. అర్హ‌త‌లు, ఇత‌ర వివ‌రాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://dme.telangana.gov.in/ ను సంద‌ర్శించాల్సి ఉంటుంది. వాన్ ఇన్ ఇంట‌ర్వ్యూని ఏప్రిల్ 27, 2022న నిర్వ‌హిస్తారు.

    AP Job News: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌ముఖ కంపెనీలో ఉద్యోగాలు.. రిజిస్ట‌ర్ చేసుకొంటే నేరుగా ఇంట‌ర్వ్యూలు

    పోస్టుల వివరాలు..































     పోస్టులు (అసిస్టెంట్ ప్రొఫెసర్)ఖాళీలు
    జనరల్ మెడిసిన్03
    జనరల్ సర్జరీ02
    ఓబీజీ04
    పెడియాట్రిక్స్04
    అనస్తిసియా02
    సివిల్ అసిస్టెంట్ సర్జరీ08



    అర్హతలు..
    సంబంధిత రంగాల్లో స్పెషలైజేషన్లలో మెడికల్ పీజీ డిగ్రీ (ఎండీ/ఎంఎస్/ డీఎన్‌బీ)లో ఉత్తీర్ణ‌త సాధించాలి. ఏడాది సీనియ‌ర్ రెసిడెన్సీ చేసి ఉండాలి. సివిల్ అసిస్టెంట్ స‌ర్జ‌న్ల‌కు ఎంబీబీఎస్ ఉత్తీర్ణ‌త సాధించి ఉండాలి. తెలంగాణ మెడిక‌ల్ కౌన్సిల్‌లో రిజిస్ట‌ర్ అయి ఉండాలి.

    Career and Courses: ఐఐఎంలో ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజ‌న్స్‌పై కొత్త కోర్సు.. అప్లికేష‌న్ వివ‌రాలు


    ముఖ్య‌మైన సమాచారం..

    - అభ్య‌ర్థులు అవ‌స‌ర‌మైన ద‌ర‌ఖాస్తుల‌ను నోటిఫికేష‌న్‌లో పేర్కొన్న విధంగా తెచ్చుకోవాలి.

    - వాక్ ఇంట‌ర్వ్యూకి వ‌చ్చే అభ్య‌ర్థుల వ‌య‌సు 44 ఏళ్లు మించి ఉండ‌కూడ‌దు.

    - ఇంట‌ర్వ్యూ వేదిక - గ్రీవెన్స్ హాల్‌, గ్రౌండ్ ఫ్లోర్‌, క‌లెక్ట‌ర్ కార్యాల‌యం, న‌ల్గొండ‌, తెలంగాణ‌

    - ఇంట‌ర్వ్యూ తేదీ - ఏప్రిల్ 27, 2022

    గ్రూప్‌-1 నోటిఫికేష‌న్‌కి స‌ర్వం సిద్ధం.. సెల‌బ‌స్ వివ‌రాలు

    తెలంగాణలో గ్రూప్ 1కు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ (TSPSC Group 1) విడుదలయ్యే అవకాశం ఉంది. ఇటీవల గ్రూప్ 1కు సంబంధించి ఇంటర్వ్యూలను సైతం తెలంగాణ సర్కార్ రద్దు చేసింది. దీంతో పరీక్ష (Group 1 Exam) విధానం మరింత పారదర్శకంగా ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. అయితే.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగిన నాటి నుంచి గ్రూప్ 1 కు సంబంధించిన నోటిఫికేషన్ (TSPSC Notification) విడుదల కాలేదు. దీంతో ఈ సారి జరిగే గ్రూప్ 1 పరీక్షకు భారీగా పోటీ ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఏళ్లుగా లక్షలాది మంది అభ్యర్థులు గ్రూప్ 1 కొలువే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్నారు. ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసిన నాటి నుంచి వారు ప్రిపరేషన్ లో మరింత వేగం పెంచారు. మరికొంత మంది అభ్యర్థులు ప్రిపరేషన్ ను ప్రారంభించారు.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Health department jobs, Telangana, Ts jobs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు