తెలంగాణ (Telangana) లో పలు జిల్లాల్లో ఇప్పటికే మెడికల్ డిపార్ట్మెంట్లో పలు పోస్టుల భర్తీ ప్రారంభమైంది. తాజాగా సూర్యపేట జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల/ జనరల్ ఆస్పత్రిలో పలు విభాగాల్లో టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందుకోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ (Notification) ద్వారా సూర్యపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో పలు విభాగాల్లో 27 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల ఆధారంగా ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.55,000 నుంచి రూ.1,90,000 వరకు వేతనం అందిస్తారు. దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ https://dme.telangana.gov.in/ ను సందర్శించాల్సి ఉంటుంది. దరఖాస్తుకు జూన్ 8, 2022 వరకు అవకాశం ఉంది. అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా నేరుగా ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ తేదీ జూన్ 14, 2022గా నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
ఎండీ/ఎంఎస్‌లలో పోస్టు గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. సంబంధిత విభాగాల్లో స్పెషలైజేషన్ చేసి ఉండాలి.
01
రూ.1,90,000
అసోసియేట్ ప్రొఫెసర్
ఎండీ/ఎంఎస్‌లలో పోస్టు గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. సంబంధిత విభాగాల్లో స్పెషలైజేషన్ చేసి ఉండాలి.
11
రూ.1,50,000
అసిస్టెంట్ ప్రొఫెసర్
ఎండీ/ఎంఎస్‌లలో పోస్టు గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. సంబంధిత విభాగాల్లో స్పెషలైజేషన్ చేసి ఉండాలి.
06
రూ.1,25,000
ట్యూటర్
ఎంబీబీఎస్ చేసి ఉండాలి.
09
రూ.55,000
ఎంపిక విధానం..
- దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థులను వారి అర్హతలను పరిశీలించి ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తారు.
- ఇంటర్వ్యూలో మెరిట్ ద్వారా ఉత్తీర్ణులైన అభ్యర్థులకు పోస్టింగ్ ఇస్తారు.
దరఖాస్తు విధానం..
Step 1 - దరఖాస్తు ప్రక్రియ ఆఫ్‌లైన్ పద్ధతిలో ఉంటుంది.
Step 3 - నోటిఫికేషన్ వివరాలు పూర్తిగా చదవాలి. (నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి)
- వెబ్సైట్లో అప్లికేషన్ నమూననాను డౌన్లోడ్ చేసుకొని తప్పులు లేకుండా నింపాలి.
Step 4 - మీ విద్యార్హతలు, అనుభవం సర్టిఫికెట్ల జిరాక్స్‌లను దరఖాస్తుకు జత చేయాలి.
Step 5 - అనంతర దరఖాస్తును
ప్రిన్సిపాల్,
ప్రభుత్వ వైద్య కళాశాల,
అమర్వాడి నగర్, సూర్యపేట, తెలంగాణ, అడ్రస్‌కు పంపాలి.
Step 6 - దరఖాస్తులు పంపడానికి జూన్ 8, 2022 వరకు అవకాశం ఉంది.
Step 7 - వాక్ ఇన్ ఇంటర్వ్యూ జూన్ 14,2022న నిర్వహిస్తారు.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.