హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Jobs in Telangana: డిగ్రీ విద్యార్హతతో కాంట్రాక్ట్ జాబ్స్.. వేతనం, అర్హతలు, అప్లికేషన్ వివరాలు

Jobs in Telangana: డిగ్రీ విద్యార్హతతో కాంట్రాక్ట్ జాబ్స్.. వేతనం, అర్హతలు, అప్లికేషన్ వివరాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Jobs in Telangana | తెలంగాణ‌లో టీఎస్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (TS AIDS Control Society) నేష‌న‌ల్ ఎయిడ్స్ అండ్ ఎస్‌టీడీ కంట్రోల్ ప్రొగ్రాం ఆధ్వ‌ర్యంలో న‌డుస్తోంది. ఇప్పటికే టీఎస్ఏసీఎస్‌లో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ (Notification) విడుద‌ల చేసి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ అప్లికేష‌న్‌ల‌కు మార్చ్ 31, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

ఇంకా చదవండి ...

తెలంగాణ‌లో టీఎస్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (TS AIDS Control Society) నేష‌న‌ల్ ఎయిడ్స్ అండ్ ఎస్‌టీడీ కంట్రోల్ ప్రొగ్రాం ఆధ్వ‌ర్యంలో న‌డుస్తోంది.  ఇప్పటికే టీఎస్ఏసీఎస్‌లో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ (Notification) విడుద‌ల చేసి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.  ఈ నోటిఫికేష‌న్ ద్వారా ఐసీటీసీ కౌన్సిల‌ర్‌, డీఎస్ఆర్‌సీ కౌన్సిల‌ర్‌, ఐసీటీసీ ల్యాబ్ టెక్నిషియ‌న్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి గ‌రిష్ట వ‌య‌సు 60 ఏళ్లుగా నోటిఫికేష‌న్‌లో పేర్కొన్నారు. ఈ పోస్టుల‌కు అభ్య‌ర్థుల‌ను కాంట్రాక్ట్ ప్రాతిప‌దిక నియ‌మిస్తారు. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆఫ్‌లైన్ ప‌ద్ధ‌తిలో ఉంటుంది. నోటిఫికేష‌న్ స‌మాచారం, ద‌ర‌ఖాస్తు విధానం కోసం అధికారిక వెబ్‌సైట్ https://tsacs.telangana.gov.in/ ను సంద‌ర్శించాలి. ద‌ర‌ఖాస్తుకు మార్చ్ 31, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

Jobs in AP: ఒంగోలులో ఉద్యోగ అవ‌కాశాలు.. వేత‌నం రూ.28,000.. అర్హ‌త‌లు, అప్లికేష‌న్ విధానం

పోస్టుల వివరాలు..

పోస్టు పేరుఅర్హతలువేతనంఖాళీలు
ఐసీటీసీ కౌన్సిల‌ర్‌,సంబంధిత సబ్జెక్టుల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణ‌త సాధించాలి. అంతే కాకుండా సంబంధిత ప‌నిలో ఏడాది అనుభ‌వం ఉండాలి. కంప్యూట‌ర్ నాలెడ్జ్ అవ‌స‌రం.రూ. 13,00016
డీఎస్ఆర్‌సీ కౌన్సిల‌ర్‌సంబంధిత సబ్జెక్టుల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణ‌త సాధించాలి. అంతే కాకుండా సంబంధిత ప‌నిలో ఏడాది అనుభ‌వం ఉండాలి. కంప్యూట‌ర్ నాలెడ్జ్ అవ‌స‌రం.రూ. 13,00010
ఐసీటీసీ ల్యాబ్ టెక్నిషియ‌న్బీఎస్సీ (మెడిక‌ల్ ల్యాబ్ టెక్నిషియ‌న్‌)లో ఉత్తీర్ణ‌త సాధించాలి. సంబంధిత ప‌నిలో అనుభ‌వంతోపాటు కంప్యూట‌ర్ నాలెడ్జ్ ఉండాలి.రూ. 13,00008

 

ఎంపిక విధానం..

- ముందుగా అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తారు.

- రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ, స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్‌ ద్వారా అభ్య‌ర్థుల‌ను షార్ట్ లిస్ట్ చేస్తారు.

Aviation Career: పైల‌ట్ అవ్వాల‌నుకొంటున్న వారికి సూప‌ర్ చాన్స్‌.. స్కాల‌ర్‌షిప్ అవ‌కాశం కూడా..

ద‌ర‌ఖాస్తు విధానం..

Step 1 - ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆఫ్‌లైన్ ప‌ద్ధ‌తిలో ఉంటుంది.

Step 2 - ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://tsacs.telangana.gov.in/ ను సంద‌ర్శించాలి.

Step 3 - అనంత‌రం నోటిఫికేష‌న్ పూర్తిగా చ‌ద‌వాలి.

Step 4 - ఆస‌క్తిగ‌ల వారు నోటిఫికేష‌న్ చివ‌ర‌న ఉన్న ద‌ర‌ఖాస్తు ఫాం డౌన్‌లోడ్ చేసుకోవాలి.

Step 5 - త‌ప్పులు లేకుండా ద‌ర‌ఖాస్తు ఫాం నింపాలి.

Step 5 - అవ‌స‌ర‌మైన డాక్యుమెంట్లు జ‌త చేసి నోటిఫికేష‌న్‌లో రిజ‌య‌న్ వారీగా పేర్కొన్న అడ్ర‌స్‌ల‌లో ద‌ర‌ఖాస్తుల‌ను స‌బ్‌మిట్ చేయాలి.

Ste[ 6 - కార్యాల‌యాల్లో ద‌ర‌ఖాస్తులు అందించేందుకు మార్చ్ 31, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

First published:

Tags: Govt Jobs 2022, Job notification, Jobs in telangana, Ts jobs

ఉత్తమ కథలు