Home /News /jobs /

JOBS IN TELANGANA CONTRACT JOBS IN RANGAREDDY DMHO ONLY FOUR DAYS FOR APPLICATION EVK

Jobs in Telangana: రంగారెడ్డి డీఎంహెచ్ఓలో కాంట్రాక్టు ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తుకు నాలుగు రోజులే చాన్స్‌!

రంగారెడ్డి జిల్లాలో ఉద్యోగాలు

రంగారెడ్డి జిల్లాలో ఉద్యోగాలు

    తెలంగాణ ప్ర‌భుత్వానికి చెందిన రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాల‌యంలో (డీఎంహెచ్ఓ) నేష‌న‌ల్ హెల్త్ మిష‌న్ (ఎన్‌హెచ్ఎం) ప్రొగ్రాం ద్వారా కాంట్రాక్టు ప‌ద్ధ‌తిలో ప‌లు పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. మెడిక‌ల్ ఆఫీస‌ర్ తదితర విభాగంలో 13 పోస్టుల‌కు అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్ ప‌ద్ధ‌తిలో ఉంటుంది. నోటిఫికేష‌న్‌, అప్లికేష‌న్ వివ‌రాలు తెలుసుకోవ‌డానికి అధికారిక వెబ్‌సైట్ https://khammam.telangana.gov.in/ ను సంద‌ర్శించాల్సి ఉంటుంది. ద‌ర‌ఖాస్తుకు మే 9, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

    TSPSC Group-1: గ్రూప్-1 అభ్య‌ర్థుల‌కు అల‌ర్ట్‌.. ప్ర‌త్యేకంగా లైవ్‌లో పాఠాలు.. స‌మ‌యం, వివ‌రాలు

    పోస్టుల వివరాలు..



































    పోస్టుఖాళీలు
    మెడికల్  ఆఫీసర్లు06
    సైకాలజిస్ట్01
    డీఈఐసీ మేనేజ‌ర్‌01
    స్టాఫ్ న‌ర్స్‌01
    ల్యాబ్ టెక్నీషియ‌న్‌01
    ఫార్మ‌సిస్ట్02
    సోష‌ల్ వ‌ర్క‌ర్‌01

    అర్హతలు..

    పోస్టుల‌ను అనుస‌రించి ఇంట‌ర్మీడియ‌ట్, సంబ‌ధిత కోర్సుల్లో డిప్లొమా, జీఎన్ఎం, మాస్ట‌ర్స్ డిగ్రీ, ఎంబీబీఎస్ ఉత్తీర్ణ‌త‌, టీఎస్ మెడిక‌ల్ కౌన్సిల్‌లో రిజిస్ట‌ర్ అయి ఉండాలి.

    TCS Recruitment 2022: టీసీఎస్‌లో జాబ్ ఓపెనింగ్స్‌.. అర్హ‌త‌లు.. అప్లికేష‌న్ ప్రాసెస్ వివ‌రాలు

    దరఖాస్తు విధానం..

    Step 1  - దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్, ఆఫ్లైన్ పద్ధతిలో ఉంటుంది.



    Step 2 - ముందుగా అధికారిక వెబ్‌సైట్  https://rangareddy.telangana.gov.in/ ను సంద‌ర్శించాలి.

    Step 3 - అనంత‌రం నోటిఫికేష‌న్‌ను పూర్తిగా చ‌ద‌వాలి.

    Step 4 - నోటిఫికేషన్ చివరన దరఖాస్తు ఫాం ఉంటుంది.

    Step 5 - దరఖాస్తును డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ ఫాంను తప్పులు లేకుండా నింాలి.

    Step 6 - అప్లికేష‌న్‌ను నోటిఫికేష‌న్‌లో పేర్కొన్న అడ్ర‌స్‌కు పంపాలి.

    Step 7 - ద‌ర‌ఖాస్తుకు మే 9, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

    Postal Department Jobs: నిరుద్యోగుల‌కు అల‌ర్ట్‌.. తెలంగాణ. ఆంధ్రప్ర‌దేశ్ పోస్ట‌ల్ స‌ర్కిల్‌లో 2,942 ఉద్యోగాలు

    16,027 కానిస్టేబుల్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తులు ప్రారంభం..

    తెలంగాణలోని లక్షలాది మంది నిరుద్యోగులు ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఉద్యోగాలకు (TSLPRB) సంబంధించిన ఉద్యోగాల ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం అయ్యింది. ఈ నేప‌థ్యంలో 16,027 కానిస్టేబుల్ పోస్టుల‌కు ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలో తెలుసుకోండి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 2022 మే 2న ప్రారంభ‌మైజ‌.. 2022 మే 22 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

    కానిస్టేబుల్ పోస్టుల‌కు సంబంధించి ఫిజిక‌ల్ మెజ‌ర‌మెంట్స్‌

    - పోస్టు కోడ్ 21 నుంచి 27 వ‌ర‌కు (పురుషుల‌కు ) ఎత్తు 167.6సెం.మీ ఉండాలి. మ‌హిళ‌ల‌కు పోస్టు కోడ్ 21,22, 28లో ఎత్తు 152.5 సెం.మీ ఉండాలి.

    - ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే వారికి పోస్టు కోడ్ 21 నుంచి 27 వ‌ర‌కు (పురుషుల‌కు ) ఎత్తు 160 సెం.మీ ఉండాలి. మ‌హిళ‌ల‌కు పోస్టు కోడ్ 21,22, 28లో ఎత్తు 150 సెం.మీ ఉండాలి.

    - లాంగ్ జంప్ ఈవెంట్‌లో పురుషులు (జనరల్) 4 మీటర్లు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు 3.5, షాట్‌పుట్ ఈవెంట్‌‌లో ఇద్దరికీ 6 మీటర్ల క్వాలిఫయింగ్ డిస్టెన్స్ ఉంటుంది. మహిళ అభ్యర్థులకు లాంగ్ జంప్ 2.50 మీటర్లు, షాట్ పుట్ 4 మీటర్ల క్వాలిఫయింగ్ డిస్టెన్స్ ఉంటుంది.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Jobs in telangana, Rangareddy, Ts jobs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు