JOBS IN TELANGANA CONTRACT JOBS IN KENDRIYA VIDYALAYA SALARY RS 27500 PER MONTH KNOW DETAILS EVK
Jobs in Telangana: కేంద్రీయ విద్యాలయంలో కాంట్రాక్టు ఉద్యోగాలు.. వేతనం రూ.27,500
(ప్రతీకాత్మక చిత్రం)
Jobs in Telangana | సికింద్రాబాద్ (Secunderabad) లోని భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని కేంద్రీయ విద్యాలయం బొల్లారంలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా పీజీటీ జియోగ్రఫీ, హిస్టరీ (పోస్టులను భర్తీ చేస్తున్నారు.
సికింద్రాబాద్ (Secunderabad) లోని భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని కేంద్రీయ విద్యాలయం బొల్లారంలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా పీజీటీ జియోగ్రఫీ, హిస్టరీ (పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఎటువంటి పరీక్ష లేకుండా నేరుగా వాక్ ఇన్ ఇంటర్వ్యూ (Walk in Interviews) లు నిర్వహిస్తున్నారు. ఎంపికైన అభ్యర్థులకు కాంట్రాక్ట్ ప్రాతిపదికన పోస్టింగ్ ఇచ్చి నెలకు రూ.27,000 వేతనం చెల్లిస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు నోటిఫికేషన్, అర్హతల వివరాల కోసం అధికారిక వెబ్సైట్ https://bolarum.kvs.ac.in/ ను సందర్శించాల్సి ఉంటుంది. వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేదీ ఏప్రిల్ 11, 2022.
పోస్టుల వివరాలు..
పోస్టు
అర్హతలు
వేతనం
పీజీటీ జియోగ్రఫీ
గుర్తింపు పొందిన యూనివర్సిటీలో 50శాతం మార్కులతో మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలి. సంబంధిత సబ్జెక్టుల్లో బీఈడీ చేసి ఉండాలి. ఇంగ్లీష్, హిందీ భాషలో పట్టు ఉండాలి.
రూ. 27,500
పీజీటీ హిస్టరీ
గుర్తింపు పొందిన యూనివర్సిటీలో 50శాతం మార్కులతో మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలి. సంబంధిత సబ్జెక్టుల్లో బీఈడీ చేసి ఉండాలి. ఇంగ్లీష్, హిందీ భాషలో పట్టు ఉండాలి.
రూ. 27,500
ఎంపిక విధానం..
- ఎటువంటి దరఖాస్తు అక్కర్లేదు
- నేనుగా అర్హతలు ఉన్న వారు ఇంటర్వ్యూకి హాజరు అయితే మెరిట్ ఆధారంగా ఎంపిక నిర్వహిస్తారు.
Jobs in AP: నెల్లూరు జీఎంసీలో కాంట్రాక్టు ఉద్యోగాలు.. వేతనం నెలకు రూ. 17,500.. అర్హతలు, అప్లికేషన్ విధానం
భారత ప్రభుత్వం, తెలంగాణ (Telangana)రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిస్తున్న ప్రభుత్వ సంస్థ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్. ఈ సంస్థ కొత్తగూడంలో ఉంది. ఇందులో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ (Notification) ద్వారా వివిధ పోస్టులను పరీక్ష లేకుండా నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయనున్నారు. ఇంటర్వ్యూకు హాజరయ్యే అర్హులైన అభ్యర్థుల గరిష్ట వయసు 45 ఏళ్లు మించి ఉండకూడదు. వాక్ ఇన్ ఇంటర్వ్యూల సమాచారం, నోటిఫికేషన్ వివరాల కోసం అధికారకి వెబ్సైట్ https://scclmines.com/012022/ ను సందర్శించాల్సి ఉంటుంది. వాక్ ఇన్ ఇంటర్వ్యూలు ఏప్రిల్ 21, 22, 23న నిర్వహిస్తారు. (మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి)
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.