JOBS IN TELANGANA 71 CONTRACT JOBS IN KHAMMAM DISTRICT KNOW ELIGIBILITY AND APPLICATION PROCESS EVK
Jobs in Telangana: ఖమ్మం జిల్లాలో 71 కాంట్రాక్టు ఉద్యోగాలు.. అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్
ఖమ్మం జిల్లాలో ఉద్యోగాలు
Jobs in Telangana | తెలంగాణ ప్రభుత్వానికి చెందిన ఖమ్మం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో (డీఎంహెచ్ఓ) నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) ప్రొగ్రాం ద్వారా కాంట్రాక్టు పద్ధతిలో పలు పోస్టులను భర్తీ చేయనున్నారు.
తెలంగాణ ప్రభుత్వానికి చెందిన ఖమ్మం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో (డీఎంహెచ్ఓ) నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) ప్రొగ్రాం ద్వారా కాంట్రాక్టు పద్ధతిలో పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. మెడికల్ ఆఫీసర్ విభాగంలో 71 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్, ఆఫ్‌లైన్ పద్ధతిలో ఉంటుంది. నోటిఫికేషన్, అప్లికేషన్ వివరాలు తెలుసుకోవడానికి అధికారిక వెబ్సైట్ https://khammam.telangana.gov.in/ ను సందర్శించాల్సి ఉంటుంది. దరఖాస్తుకు ఏప్రిల్ 29, 2022 వరకు అవకాశం ఉంది.
పోస్టుల వివరాలు..
పోస్టు
ఖాళీలు
అర్హతలు
మెడికల్ ఆఫీసర్లు
71
గుర్తింపు పొందని యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చేసి ఉండాలి.
దరఖాస్తు విధానం..
Step 1 - దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్, ఆఫ్‌లైన్ పద్ధతిలో ఉంటుంది.
Step 3 - అనంతరం నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవాలి.
Step 4 - Online application for Medical Officer posts పై క్లిక్ చేసి దరఖాస్తును సమర్పించాలి.
Step 5 - ఆన్లైన్ వీలు కానప్పుడు.. Offline application for Medical Officer posts పై క్లిక్ చేయాలి.
Step 6 - అప్లికేషన్‌ను నోటిఫికేషన్లో పేర్కొన్న అడ్రస్‌కు పంపాలి.
Step 7 - దరఖాస్తుకు ఏప్రిల్ 29, 2022 వరకు అవకాశం ఉంది.
ఎస్సై ఉద్యోగాల భర్తీ..
తెలంగాణలోని నిరుద్యోగులు ఎదురుచూస్తున్న పోలీస్ శాఖకు సంబంధించి 16, 614 పోలీస్ కొలువులకు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ సోమవారం నోటిఫికేషన్విడుదల చేసింది. వివిధ విభాగాల్లో ఎస్ఐ పోస్టులు 587 ఉండగా.. కానిస్టేబుల్పోస్టులు 16,027 ఉన్నాయి. మే 2 నుంచి 20 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చని ప్రకటించారు. దరఖాస్తు ప్రక్రియ 2022 మే 2న ప్రారంభం కానుంది. 2022 మే 22 లోగా దరఖాస్తు చేయొచ్చు. ఈ నోటిఫికేషన్లో కానిస్టేబుల్ పోస్టులు 16,027, ఎస్ఐ పోస్టులు 587 ఉన్నాయి.
ఎస్ఐ ఉద్యోగానికి అప్లై చేసే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ కావాలి. 2022 జూలై 1 నాటి అర్హతలు ఉండాలి. 31వ నెంబర్ పోస్టుకు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజీరింగ్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లేదా కంప్యూటర్ ఇంజనీరింగ్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బీఈ లేదా బీటెక్ పాస్ కావాలి. 32వ నెంబర్ పోస్టుకు డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ పాస్ కావాలి. 33వ నెంబర్ పోస్టుకు కంప్యూటర్ సైన్స్ లేదా కంప్యూటర్ అప్లికేషన్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డిగ్రీ పాస్ కావాలి.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.