JOBS IN TELANGANA 113 JOBS IN RANGAREDDY DISTRICT ELIGIBILITY APPLICATION PROCESS EVK
Jobs in Telangana: రంగారెడ్డి జిల్లాలో 113 ఉద్యోగాలు.. పరీక్ష లేదు.. నేరుగా వాక్ ఇన్ ఇంటర్వ్యూలు
రంగారెడ్డి జిల్లాలో ఉద్యోగాలు
Jobs in Telangana | తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్. రంగారెడ్డి (Ranga Reddy) జిల్లా గచ్చిబౌలిలోని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్‌లో పలు పోస్టులు భర్తీ చేస్తున్నారు. అయితే ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండా నేరుగా వాక్ ఇన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ తేదీలు జనవరి 27, 2022 నుంచి జనవరి 29, 2022 మధ్య ఉంటాయి.
తెలంగాణ (Telangana) నిరుద్యోగులకు గుడ్ న్యూస్. రంగారెడ్డి (Ranga Reddy) జిల్లా గచ్చిబౌలిలోని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ (Telangana Institute of Medical Sciences and Research) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. కాంట్రాక్టు పద్ధతిలో వివిధ విభాగాల్లో కలిపి 113 పోస్టులను భర్తీ చేస్తున్నట్టు నోటిఫికేషన్ (Notification)లో తెలిపారు. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, మెడికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్, దరఖాస్తు విధానం అధికారిక వెబ్సైట్ https://dme.telangana.gov.in/ ను సందర్శించాల్సి ఉంటుంది. ఈ పోస్టులను వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వాక్ ఇన్ ఇంటర్వ్యూలు జనవరి 27, 2022 నుంచి జనవరి 29, 2022 మధ్య ఉంటాయి.
అర్హత :- పోస్టులను అనుసరించి ఎంబీబీఎస్, సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ చేసి ఉండాలి. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రిజిస్టర్ అయి ఉండాలి. దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల వయసు 18 ఏళ్ల నుంచి 34 మధ్య ఉండాలి.
ఎంపిక విధానం..
- అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
- అభ్యర్థి అకాడమిక్ మెరిట్, పని అనుభవం పరిశీలిస్తారు.
- ఎంపికలో రిజర్వేషన్ విధానం పాటిస్తారు.
Step 1 :- ముఖ్యంగా 1 నుంచి 7 తరగతి స్టడీ సర్టిఫికెట్లను ఇంటర్వ్యూకి తీసుకెళ్లాలి.
Step 1 :- ఇంటర్వ్యూలకు వెళ్లాల్సిన తేదీలు జనవరి 27, 2022 నుంచి జనవరి 29, 2022 మధ్య ఉంటాయి.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.