JOBS IN TCS GOOD NEWS FOR FRESHERS BPS POSTS IN TCS KNOW APPLICATION PROCESS AND SELECTION PROCESS EVK
Jobs in TCS: ఫ్రెషర్స్‌కు గుడ్ న్యూస్.. టీసీఎస్‌లో ఉద్యోగాలు.. అప్లికేషన్ ప్రాసెస్
(ప్రతీకాత్మక చిత్రం)
Jobs in TCS: భారతీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (Tata Consultancy Services) తాజా నియామకాల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఆర్ట్స్, కామర్స్ విద్యార్థుల కోసం బిజినెస్ ప్రాసెస్ సర్వీసెస్ (BPS) పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టుల దరఖాస్తుకు జనవరి 7, 2021 వరకు అవకాశం ఉంది.
భారతీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (Tata Consultancy Services) తాజా నియామకాల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఆర్ట్స్, కామర్స్ విద్యార్థుల కోసం బిజినెస్ ప్రాసెస్ సర్వీసెస్ (BPS) పోస్టులను భర్తీ చేయనుంది. BCom, BA, BBI, BAF, BBA, BMS, BBM, BCA, BCS అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కోర్సుల్లో 2022లో ఉత్తీర్ణులైన వారు కూడా దరఖాస్తు చేసుకొనే అవకాశం ఇచ్చారు. ఆసక్తిగల అభ్యర్థులు జనవరి 7, 2021వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు కోసం అధికారిక వెబ్సైట్ tcs.com/careers ను సందర్శించాలి. ఎంపికైన అభ్యర్థులు చేరే స్థానం ఇంటర్వ్యూ సమయంలో.. ప్రాధాన్యతలకు అవకాశం ఇస్తారు. అయితే తుది నిర్ణయం TCS తీసుకుంటుంది. ఎంపిక తయారీకి సంబంధించిన మాక్ టెస్ట్ (Mock Test) పేపర్లను TCS అధికారిక వెబ్సైట్ నుంచి ఆన్లైన్ (Online) లో డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఎంపిక విధానం..
Step 1 : ఈ ఉద్యోగాలకు ఎంపిక కావడానికి, అభ్యర్థులు వ్యక్తిగత ఇంటర్వ్యూ (Interview)తో పాటు ఎంపిక పరీక్షను క్లియర్ చేయాలి.
Step 2 : జనవరి 26న నిర్వహించే ఎంపిక పరీక్ష (Exams)లో న్యూమరికల్తో సహా మూడు విభాగాలు ఉంటాయి.
Step 3 : న్యూమెరికల్ ఎబిలిటీ, వర్బల్ ఎబిలిటీ, రీజనింగ్ పరీక్ష ఉంటుంది.
Step 8 : రెండు సంవత్సరాలకు మించి.. ఎడ్యుకేషన్ గ్యాప్ ఉండకూడదు.
Step 9 : ఎంపిక సమయంలో రిక్రూట్మెంట్ డ్రైవ్ కోసం అభ్యర్థి పేర్కొన్న ఒరిజినల్ డాక్యుమెంట్లను కలిగి ఉండాలి.
Step 10 : ఎంపికైన అభ్యర్థులు యాపార కార్యకలాపాలు (CBO), బ్యాంకింగ్ మరియు ఆర్థిక సేవలు మరియు బీమా (BFSI), విభాగాల్లో పని చేయాల్సి ఉంటుంది.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.