JOBS in Power Grid: పవ‌ర్ గ్రిడ్‌లో 137 ఉద్యోగాలు

(ప్రతీకాత్మక చిత్రం)

దేశంలోని మ‌హార‌త్న‌ల్లో ఒక్క‌టైన ప‌వ‌ర్ గ్రిడ్ కార్పొరేష‌న్‌లో కాంట్రాక్ట్ జాబ్‌ల‌కు నోటిఫికేష‌న్ విడుద‌లైంది. వివిధ విభాగాల్లో క‌లిపి 137 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

  • Share this:
    దేశంలోని మ‌హార‌త్న‌ల్లో ఒక్క‌టైన ప‌వ‌ర్ గ్రిడ్ కార్పొరేష‌న్‌లో కాంట్రాక్ట్ జాబ్‌ల‌కు నోటిఫికేష‌న్ విడుద‌లైంది. వివిధ విభాగాల్లో క‌లిపి 137 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.రాత ప‌రీక్ష ఇంట‌ర్వ్యూ ఆధారంగా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేయ‌నున్నారు. ఫీల్డ్‌ ఇంజనీర్లకు నెలకు రూ.30,000 నుంచి రూ.1,20,000, ఫీల్డ్‌ సూపర్‌వైజర్లకు నెలకు రూ.23,000 నుంచి రూ.1,05,000లతో పాటు ఇతర అలవెన్సులు చెల్లిస్తారు.
    పోస్టుల వివ‌రాలు..
    మొత్తం పోస్టులు 137
    ఫీల్డ్‌ ఇంజనీర్‌(ఎలక్ట్రికల్‌)–48,
    ఫీల్డ్‌ ఇంజనీర్‌(సివిల్‌)–17,
    ఫీల్డ్‌ సూపర్‌వైజర్‌(ఎలక్ట్రికల్‌)–50,
    ఫీల్డ్‌ సూపర్‌వైజర్‌(సివిల్‌)–22.
    అర్హతలు..
    వ‌య‌సు - ఆగ‌స్టు 28, 2021 నాటికి 29 ఏళ్లు మించ‌కూడ‌దు
    ఫీల్డ్‌ ఇంజనీర్‌- బీఈ/బీటెక్‌/బీఎస్సీ(ఇంజనీరింగ్‌)/బీఈ(పవర్‌ ఇంజనీరింగ్‌)లో 55శాతం మార్కుల‌తో ఉత్తీర్ణ‌త క‌లిగి ఉండాలి.
    ఫీల్డ్‌ సూపర్‌వైజర్ - మూడేళ్ల ఇంజనీరింగ్ డిప్ల‌మాలో 55 శాతం మార్కుల‌తో ఉత్తీర‌ణ‌త‌తోపాటు సంబంధిత విభాగంలో అనుభ‌వం ఉండాలి.
    ఎంపిక విధానం..
    ద‌ర‌ఖాస్తు చేసుకొన్న అభ్య‌ర్థుల‌కు స్క్రీనింగ్‌ టెస్ట్‌(టెక్నికల్‌ నాలెడ్జ్‌ టెస్ట్, అప్టిట్యూడ్‌ టెస్ట్‌), నిర్వ‌హిస్తారు. అందుల ఉత్తీర్థులైన వారికి ఇంట‌ర్వ్యూలు నిర్వ‌హిస్తారు. ఇంట‌ర్వ్యూలో సాధించిన మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఆస‌క్తిగ‌ల అభ్య‌ర్థులు ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

    ద‌ర‌ఖాస్తుకు ఆఖ‌రు తేదీ - ఆగ‌స్టు 27, 2021

    వెబ్‌సైట్ కోసం క్లిక్ చేయండి
    Published by:Sharath Chandra
    First published: