Home /News /jobs /

JOBS IN NTPC 177 POSTS IN VARIOUS DEPARTMENT KNOW QUALIFICATION AND APPLICATION PROCESS EVK

Jobs in NTPC: ఎన్‌టీపీసీలో 177 ఉద్యోగాలు.. అర్హ‌త‌లు, అప్లికేష‌న్ ప్రాసెస్‌

ఎన్‌టీపీసీ లోగో

ఎన్‌టీపీసీ లోగో

Jobs in NTPC | భార‌త ప్ర‌భుత్వానికి చెందిన నేష‌న‌ల్ థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ కార్పొరేష‌న్ లిమిటెడ్‌లో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ (Notification) విడుదల అయ్యింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా వేర్వేరు విభాగాల్లో 177 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ పోస్టుల ద‌ర‌ఖాస్తుకు మార్చ్ 15, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

ఇంకా చదవండి ...
    భార‌త ప్ర‌భుత్వానికి చెందిన నేష‌న‌ల్ థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ కార్పొరేష‌న్ లిమిటెడ్ (National Thermal Power Corporation Limited)లో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ (Notification) విడుదల అయ్యింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా వేర్వేరు విభాగాల్లో 177 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఎంపికైన అభ్య‌ర్థులు జార్ఖండ్‌ (Jharkhand) లోని మైనింగ్ హెడ్ క్వార్ట‌ర్‌లో కాంట్రాక్ట్ ప్రాతిప‌దిక‌న విధులు నిర్వ‌ర్తించాల్సి ఉంటుంది. ఈ పోస్టుల ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ఆన్‌లైన్‌ (Online)లో ఉంటుంది. అభ్య‌ర్థుల‌ను రాత ప‌రీక్ష‌, స్కిల్ టెస్ట్‌ల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి మార్చ్ 15, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది. నోటిఫికేష‌న్‌, ద‌ర‌ఖాస్తు విధానం తెలుసుకోవ‌డాన‌కి అధికారిక వెబ్‌సైట్ https://careers.ntpc.co.in/ ను సంద‌ర్శించాల్సి ఉంటుంది.

    Jobs in Andhra Pradesh: 730 డిగ్రీ అర్హ‌త ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు గ‌డువు పొడ‌గింపు.. అప్లికేష‌న్ ప్రాసెస్ వివరాలు

    పోస్టుల వివ‌రాలు అర్హ‌త‌లు..


















    పోస్టు పేరుఖాళీలుఅర్హ‌త‌లు
    మైనింగ్ ఓవ‌ర్‌మెన్‌74గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీలో మైనింగ్‌లో ఇంజనీరింగ్ డిప్లమా చేసి ఉండాలి. డీజీఎంఎస్ జారీ చేసిన ఓవ‌ర్ మెన్ స‌ర్టిఫికెట్ ఉండాలి. సంబంధిత ప‌నిలో అవ‌స‌ర‌మైన అర్హ‌త ఉండాలి.
    మైనింగ్ సిర్దార్‌103గుర్తింపు పొందిన బోర్డులో ప‌దోత‌ర‌గ‌తి, త‌త్స‌మ ఉత్తీర్ణ‌త సాధించి ఉండాలి. డీజీఎంఎస్ జారీ చేసిన వాలిడ్ సిర్దార్ స‌ర్టిఫికెట్ ఉండాలి. సంబంధిత ప‌నిలో క‌నీసం ఏడాది అనుభ‌వం ఉండాలి.

    SSC CHSL 2022: త్వ‌ర‌లో ఎస్ఎస్‌సీ సీహెచ్ఎల్ నోటిఫికేష‌న్‌.. ఎన్ని పోస్టులు ఉండొచ్చంటే!


    ఎంపిక విధానం..
    - ముందుగా అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తారు.
    - అభ్య‌ర్థుల‌కు రాత ప‌రీక్ష నిర్వ‌హిస్తారు.
    - రాత ప‌రీక్ష‌లో ఉత్తీర్ణ‌త సాధించిన వారికి స్కిల్ టెస్ట్ నిర్వ‌హిస్తారు.
    - స్కిల్ టెస్ట్‌లో ఉత్తీర్ణ‌త సాధించిన వారిలో మెరిట్ ఆధారంగా ఎంపిక నిర్వ‌హిస్తారు.

    ద‌ర‌ఖాస్తు విధానం.

    Step 1:- ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లోనే ఉంటుంది.

    Step 2:-  ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://careers.ntpc.co.in/ ను సంద‌ర్శించాలి.

    Step 3:- త‌రువాత నోటిఫికేష‌న్‌ను పూర్తిగా చ‌ద‌వాలి (నోటిఫికేష‌న్ కోసం క్లిక్ చేయాలి)

    Step 4:-  అర్హ‌త‌లు చూసుకొన్న త‌రువాత Click here to apply ఆప్ష‌న్‌ను క్లిక్ చేయాలి.

    Step 5:- ప్ర‌త్యేక అప్లికేష‌న్ పేజీ ఓపెన్ అవుతుంది.

    Jobs in Andhra Pradesh: క‌డ‌ప జిల్లాలో ఉద్యోగాలు.. వేత‌నం రూ.15,000, అర్హ‌త‌లు అప్లికేష‌న్ ప్రాసెస్‌

    Step 6:- అందులో Click here to apply క్లిక్ చేస్తే.. ద‌ర‌ఖాస్తు ఫాం ఓపెన్ అవుతుంది.

    Step 7:- ద‌ర‌ఖాస్తును పూర్తి చేయాలి. త‌రువాత Online Payment ఆప్ష‌న్ క్లిక్ చేసి ఫీజు చెల్లించాలి.



    Step 8:- ద‌ర‌ఖాస్తు రుసం రూ.300 చెల్లించాలి. మ‌హిళ‌లు, ఎస్సీ,ఎస్టీ, పీడ‌బ్ల్యూడీ, ఎక్స్ఎస్ఎమ్ ద‌ర‌ఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు.

    Step 9:- ద‌ర‌ఖాస్తు పూర్త‌యిన త‌రువాత అప్లికేష‌న్ ఫాం ప్రింట్ ఆప్ష‌న్‌లోకి వెళ్లి ప్రింట్ తీసుకొని భ‌విష్య‌త్ అవ‌స‌రాల కోసం దాచుకోవాలి.

    Step 10:- పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి మార్చ్ 15, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Central Government Jobs, Govt Jobs 2022, Job notification, JOBS, NTPC

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు