భారత అణుశక్తి విభాగానికి చెందిన గుజరాత్ గాంధీనగర్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా రీసెర్చ్ (Institute for Plasma Research) లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ (Notification) ద్వారా వివిధ విభాగాల్లో 81 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్ (Online) పద్ధతిలో ఉంటుంది. దరఖాస్తు చేసుకొనే అభ్యర్థి గరిష్ట వయసు 35 ఏళ్లకు మించి ఉండకూడదు. ఎంపికైన అభ్యర్థికి నెలకు రూ.20,000 వేతనం ఇస్తారు. పోస్టుల వివరాలు, దరఖాస్తు ప్రక్రియ (Application Process) కోసం అధికారిక వెబ్‌సైట్ https://www.ipr.res.in/documents/jobs_career.html ను సందర్శించాల్సి ఉంటుంది. దరఖాస్తుకు జనవరి 17, 2022 వరకు అవకాశం ఉందని నోటిఫికేషన్‌లో తెలిపారు.
పోస్టుల వివరాలు.. అర్హతలు
బ్రాంచ్ | పోస్టుల సంఖ్య | అర్హతలు |
కంప్యూటర్ అప్లికేషన్ | 04 | కంప్యూటర్ అప్లికేషన్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ (BCA) |
ఎలక్ట్రికల్ /ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ | 18 | ఎలక్ట్రికల్ / ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా |
ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్/ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్ | 10 | డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ |
ఇన్‌స్ట్రుమెంటేషన్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ & కంట్రోల్ | 05 | డిప్లొమా ఇన్ ఇన్‌స్ట్రుమెంటేషన్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ & కంట్రోల్ ఇంజనీరింగ్ |
మెకానికల్ | 28 | మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా |
భౌతికశాస్త్రం | 16 | సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ (భౌతికశాస్త్రం) |
ఎంపిక విధానం..
- ముందుగా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు.
- అర్హులకు రాత పరీక్ష నిర్వహిస్తారు.
- ఎంపికైన వారికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
- అనంతరం సర్టిఫికెట్లు పరిశీలించి అభ్యర్థులకు తుది ఎంపిక చేస్తారు.
RRB Group D Exam: రైల్వే గ్రూప్-డీ ప్రిపేర్ అవుతున్నారా.. సెలబస్ అండ్ స్టడీ ప్లాన్ వివరాలు!
దరఖాస్తు విధానం..
Step 1 : దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో ఉంటుంది.
Step 2 : ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://www.ipr.res.in/documents/jobs_career.html ను సందర్శించాలి.
Step 3 : నోటిఫికేషన్ పూర్తిగా చదవాలి. (నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి)
Step 4 : అర్హతలు ఉన్న పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి Apply online ఆన్‌లైన్ లింక్‌పై క్లిక్‌చేయాలి.
Step 5 : ఈమెయిల్ ఐడీ , పేరుతో రిజిస్టర్ చేసుకోవాలి.
Step 6 : తరువాత అప్లికేషన్ ఫాంను తప్పులు లేకుండా నింపాలి.
Step 7 : అనంతరం రూ.200 పరీక్ష ఫీజు చెల్లించాలి.
Step 8 : అప్లికేషన్ పూర్తయిన తరువాత సబ్‌మిట్ కొట్టి.. దరఖాస్తును ఒక కాపీ ప్రింట్ తీసుకొని దాచుకోవాలి.
Step 9 : దరఖాస్తుకు జనవరి 17, 2022 వరకు అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Govt Jobs 2021, Job notification, JOBS