హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Job Opportunity: వచ్చే ఏడాది లక్ష ఉద్యోగాలు.. వార్షిక ప్యాకేజీ రూ.10లక్షలకు పైగా..

Job Opportunity: వచ్చే ఏడాది లక్ష ఉద్యోగాలు.. వార్షిక ప్యాకేజీ రూ.10లక్షలకు పైగా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Job Opportunity ఇంటర్నెట్ అనేది మన దైనందిన జీవితంలో అంతర్భాగమైపోయింది. నేటి సమాచార , సాంకేతిక యుగంలో స్మార్ట్‌ఫోన్‌లు , డేటా కనెక్టివిటీ చాలా ఉపయోగకరంగా మారుతున్నాయి. ఈ రెండు లేకుండా మన ఫాస్ట్ ఫార్వార్డ్ రోజువారీ జీవితాన్ని మనం ఊహించలేము.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

ఇంటర్నెట్(Internet) అనేది మన దైనందిన జీవితంలో అంతర్భాగమైపోయింది. నేటి సమాచార, సాంకేతిక యుగంలో స్మార్ట్‌ఫోన్‌లు(Smartphones), డేటా కనెక్టివిటీ(Data Connectivity) చాలా ఉపయోగకరంగా మారుతున్నాయి. ఈ రెండు లేకుండా మన ఫాస్ట్ ఫార్వార్డ్ రోజువారీ జీవితాన్ని మనం ఊహించలేము. మరికొందరు రోజుకు గంటల తరబడి స్మార్ట్‌ఫోన్‌లు చూస్తూ గేమ్‌లు(Games) ఆడుతున్నారు. ఈ రోజుల్లో విద్యార్థులు(Students), నిరుద్యోగులు గేమింగ్‌లో(Gaming) ఎక్కువగా నిమగ్నమై ఉన్నారు. భారతదేశంలో ఆటలు ఆడే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ గేమింగ్‌ని ఉపయోగించడం ద్వారా భవిష్యత్తులో చాలా మంది ఉద్యోగాలు పొందవచ్చు. 2023 ఆర్థిక సంవత్సరంలో దేశ గేమింగ్ పరిశ్రమలో లక్ష ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉంది. ఈ మేరకు గురువారం ఒక నివేదికలో పేర్కొంది.

ఈ సమాచారం ప్రకారం.. ప్రోగ్రామింగ్, టెస్టింగ్ యానిమేషన్ , డిజైన్‌తో సహా అన్ని డొమైన్‌ల కోసం గేమింగ్ పరిశ్రమలో అనేక ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. టెక్ కంపెనీ టీమ్‌లీజ్ డిజిటల్ 'గేమింగ్: టుమారోస్ బ్లాక్‌బస్టర్' పేరుతో ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం గేమింగ్ రంగం 20 నుంచి 30 శాతం వృద్ధిని నమోదు చేయనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ రంగంలో దాదాపు లక్ష ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు సృష్టించబడతాయని పేర్కొంది. గేమింగ్ కమ్యూనిటీ పరంగా.. చైనా తర్వాత భారతదేశం ప్రపంచంలో రెండవ స్థానంలో ఉంది. భారతదేశంలో 48 కోట్ల మంది గేమింగ్ కమ్యూనిటీలు ఉన్నాయి. దీంతో ఈ రంగంలో డిమాండ్ పెరిగింది. ఫలితంగా కొత్త ఉపాధి అవకాశాలు ఏర్పడుతున్నాయి. గేమింగ్ ద్వారా వచ్చే ఆదాయంలో భారత్ ప్రపంచంలో ఆరో స్థానంలో ఉంది. గ్లోబల్ మార్కెట్ గేమింగ్ ద్వారా దాదాపు రూ.17.24 లక్షల కోట్ల ఆదాయాన్ని అందుకుంటుంది. 2023 ఆర్థిక సంవత్సరం నాటికి ఈ రంగంలో రూ.780 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డిఐ) వస్తాయని అంచనా.

Indian Railway Jobs: గుడ్ న్యూస్.. నాలుగు నెలల్లో 35,000 రైల్వే ఉద్యోగాల భర్తీ..

నివేదిక ప్రకారం.. ప్రస్తుతం ఈ రంగం నుండి 50 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి లభించింది. ఇందులో ప్రోగ్రామర్లు, డెవలపర్ల సంఖ్య 30 శాతం మేర ఉన్నారు. వచ్చే ఏడాది నాటికి.. గేమ్ డెవలపర్, యూనిటీ డెవలపర్, టెస్టింగ్, యానిమేషన్, డిజైన్, ఆర్టిస్ట్ మరియు ఇతర విభాగాల్లో కొత్త ఉద్యోగాలు అందుబాటులో ఉండనున్నాయి. జీతం విషయానికి వస్తే.. గేమ్ నిర్మాతలు గేమింగ్ రంగంలో అత్యధిక జీతాలు పొందుతున్నారు. వీరు ఏడాదికి రూ.10 లక్షల జీతం పొందుతున్నారు. ఆ తర్వాత గేమ్ డిజైనర్‌కు ఏడాదికి రూ.6 లక్షలు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు రూ.5.5 లక్షలు పొందుతున్నారు. వినియోగదారుల సంఖ్య పెరగడం , ఇతర అవకాశాల కారణంగా గేమింగ్ రంగం అభివృద్ధి చెందుతోంది. అందుకే ఈ రంగంలో కొత్త ఉపాధి అవకాశాలు ఏర్పడుతున్నాయి.

First published:

Tags: Gaming, JOBS, Private Jobs

ఉత్తమ కథలు