Home /News /jobs /

JOBS IN HYDERABAD THE DEADLINE FOR APPLICATIONS IS ONE WEEK KNOW ELIGIBILITY EVK

Jobs in Hyderabad: హైదరాబాద్‌లో ఉద్యోగ అవ‌కాశాలు.. ద‌ర‌ఖాస్తుకు వారం రోజులే గడువు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Jobs in Hyderabad | ప్రభుత్వ  ఉద్యోగానికి ప్ర‌య‌త్నం చేసే అభ్య‌ర్థులు.. జాబ్ అప్లికేష‌న్‌ (Job Applications)ల‌ను త్వ‌ర‌గా పూర్తి చేయాలి. ఎందుకుంటే చివ‌రి నిమిషంలో స‌ర్వ‌ర్ స‌మ‌స్య‌ల వ‌ల్ల ద‌ర‌ఖాస్తు క‌ష్టం అవ్వొచ్చు. కావున వారం ప‌ది రోజుల ముందే నోటిఫికేషన్ ప్రకారం ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ (Application Process) పూర్తి చేస్తే మంచింది.

ఇంకా చదవండి ...
    ప్రభుత్వ  ఉద్యోగానికి ప్ర‌య‌త్నం చేసే అభ్య‌ర్థులు.. జాబ్ అప్లికేష‌న్‌ (Job Applications)ల‌ను త్వ‌ర‌గా పూర్తి చేయాలి. ఎందుకుంటే చివ‌రి నిమిషంలో స‌ర్వ‌ర్ స‌మ‌స్య‌ల వ‌ల్ల ద‌ర‌ఖాస్తు క‌ష్టం అవ్వొచ్చు. కావున వారం ప‌ది రోజుల ముందే నోటిఫికేషన్ ప్రకారం ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ (Application Process) పూర్తి చేస్తే మంచింది. దీని ద్వారా ప్రిప‌రేష‌న్‌ఫై దృష్టిపెట్ట‌వ‌చ్చు. ఈ వారం హైదరాబాద్ లో కేంద్రంగా ద‌ర‌ఖాస్తు చేయాల్సిన ప‌లు ప్ర‌భుత్వ ఉద్యోగ ప్ర‌క‌ట‌నల అర్హ‌త‌ల‌ను గ‌మ‌నించుకొని త్వ‌ర‌గా ద‌ర‌ఖాస్తు చేసుకోండి.

    ఎన్ఎమ్‌డీసీలో ఉద్యోగాలు..

    భార‌త ప్ర‌భుత్వ ఉక్కు మంత్రిత్వ శాఖకి చెందిన నేష‌న‌ల్ మిన‌ర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్‌ (National Mineral Development Corporation) లో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ (Notification) విడుద‌ల అయ్యింది. ఈ సంస్థ ప్ర‌ధాన కేంద్రం హైద‌రాబాద్‌లోనే ఉంది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 22 ఎగ్జిక్యూటీవ్ ట్రైనీ (ప‌ర్స‌న‌ల్‌) పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకొనే అభ్య‌ర్థుల గ‌రిష్ట వ‌య‌సు 27 ఏళ్లు మించి ఉండ‌కూడ‌దు. ఈ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియపూర్తిగా ఆన్‌లైన్‌లోనే ఉంటుంది. నోటిఫికేష‌న్ స‌మాచారం, ద‌ర‌ఖాస్తు సందేహాల కోసం అధికారికి వెబ్‌సైట్ https://jobapply.in/NMDC2022ugcnet/ ను సంద‌ర్శించాల్సి ఉంటుంది. ఈ పోస్టుల ద‌ర‌ఖాస్తుకు మార్చ్ 17, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది. (మ‌రింత స‌మాచారం కోసం క్లిక్ చేయండి)

    హైదరాబాద్ పోలీస్ అకాడమీలో జాబ్స్..

    కేంద్ర హోం శాఖకు చెందిన హైదరాబాద్ లోని నేషన్ పోలీస్ అకాడమీ(SVPNPA) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను(Jobs) భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు సంస్థ నుంచి తాజాగాజాబ్ నోటిఫికేషన్(Job Notification) విడుదలైంది. మొత్తం 19 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. అయితే ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఈ ఖాళీలను(Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో వెల్లడించారు. (మ‌రింత స‌మాచారం కోసం క్లిక్ చేయండి)

    ఎన్ఐఆర్‌డీపీఆర్‌లో ఉద్యోగాలు..

    హైద‌రాబాద్ (Hyderabad)రాజేంద్ర న‌గ‌ర్‌లోని భార‌త ప్ర‌భుత్వ గ్రామీణాభివృద్ధికి మంత్రిత్వ శాఖ‌కు చెందిన నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ అండ్ పంచాయ‌తీ రాజ్ (National Institute of Rural Development and Panchayati Raj)లో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ఈ ఉద్యోగాల‌ను ఒప్పంద ప్రాతిప‌దిక‌న నియ‌మిస్తున్న‌ట్టు నోటిఫికేష‌న్‌లో పేర్కొన్నారు. ఈ పోస్టుల ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆన్‌లైన్ ప‌ద్ధ‌తిలో ఉంటుంది. పోస్టుల ఆధారంగా ద‌ర‌ఖాస్తు చేసుకొనే అభ్య‌ర్థి గ‌రిష్ట వ‌య‌సు 30 ఏళ్లు మించి ఉండ‌కూడదు. నోటిఫికేష‌న్ (Notification) స‌మాచారం, ద‌ర‌ఖాస్తు విధానం కోసం అధికారిక వెబ్‌సైట్ http://nirdpr.org.in/index.aspx ను సంద‌ర్శించాల్సి ఉంటుంది. ద‌ర‌ఖాస్తుకు మార్చ్ 27, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.  (మ‌రింత స‌మాచారం కోసం క్లిక్ చేయండి)

    హైద‌రాబాద్ ఎన్‌జీఆర్ఐలో ఉద్యోగాలు..

    హైద‌రాబాద్‌ (Hyderabad) లోని భార‌త ప్ర‌భుత్వానికి చెందిన సీఎస్ఐఆర్ - నేష‌న‌ల్ జియోఫిజిక‌ల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్‌జీఆర్ఐ)లో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ (Notification) విడుద‌ల అయ్యింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా ప్రాజెక్ట్ అసిస్టెంట్‌, ప్రాజెక్ట్ అసోసియేట్లు (Project Associates), సీనియ‌ర్ ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులను భ‌ర్తీ చేయ‌నున్నారు. పోస్టుల‌ను అనుస‌రించి ద‌ర‌ఖాస్తు చేసుకోనే అభ్య‌ర్థుల గ‌రిష్ఠ వ‌య‌సు 35 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వ‌య‌సు ఉండాలి. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆన్‌లైన్‌ (Online)లో ఉంటుంది. అభ్య‌ర్థుల‌కు ఎటువంటి రాత ప‌రీక్ష లేకుండా కేవ‌లం షార్ట్ లిస్టింగ్‌, ఆన్‌లైన్ ఇంట‌ర్వ్యూ ద్వారా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేయ‌నున్నారు. నోటిఫికేష‌న్ వివ‌రాలు, ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ గురించి పూర్తి వివ‌రాల కోసం అధికారిక వెబ‌సైట్ https://www.ngri.res.in/openings-at-ngri.php ను సంద‌ర్శించాల్సి ఉంటుంది. పోస్టుల ద‌ర‌ఖాస్తుకు మార్చ్ 13, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.  (మ‌రింత స‌మాచారం కోసం క్లిక్ చేయండి)
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Govt Jobs 2022, Hyderabad, Job notification, Telangana jobs

    తదుపరి వార్తలు