JOBS IN HYDERABAD RS 50000 SALARY WITH DEGREE QUALIFICATION TWO DAYS CHANCE TO APPLY EVK
Jobs in Hyderabad: డిగ్రీ అర్హతతో రూ.50,000 వేతనం.. దరఖాస్తుకు రెండురోజే చాన్స్
(ప్రతీకాత్మక చిత్రం)
Jobs in Hyderabad | భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వ శాఖకి చెందిన నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో పలు పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ ఇప్పటికే మొదలైంది. ఈ పోస్టులకు సంబంధింఇ డిగ్రీ అర్హతతో రూ.50,000 వేతనం అందిస్తున్నారు.
భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వ శాఖకి చెందిన నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (National Mineral Development Corporation) లో పలు పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ ఇప్పటికే మొదలైంది. ఈ పోస్టులకు సంబంధింఇ డిగ్రీ అర్హతతో రూ.50,000 వేతనం అందిస్తున్నారు. ఈ సంస్థ ప్రధాన కేంద్రం హైదరాబాద్‌లోనే ఉంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 22 ఎగ్జిక్యూటీవ్ ట్రైనీ (పర్సనల్) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల గరిష్ట వయసు 27 ఏళ్లు మించి ఉండకూడదు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లోనే ఉంటుంది. నోటిఫికేషన్ సమాచారం, దరఖాస్తు సందేహాల కోసం అధికారికి వెబ్సైట్ https://jobapply.in/NMDC2022ugcnet/ ను సందర్శించాల్సి ఉంటుంది. ఈ పోస్టుల దరఖాస్తుకు మార్చ్ 17, 2022 వరకు అవకాశం ఉంది.
గ్రాడ్యుయేషన్‌తోపాటు సంబంధి సబ్జెక్టుల్లో పీజీ డిగ్రీ, పీజీడిప్లమా, ఎంబీఏ, తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి. అంతే కాకుండా యూజీసీ నెట్ డిసెంబర్ 2022, జూన్ 2021 స్కోర్ కలిగి ఉండాలి.
ఎంపిక విధానం..
- ముందుగా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు.
- యూజీసీనెట్ 2022, జూన్ 2021, మెరిట్ స్కోర్ పరిగణలోకి తీసుకొంటారు.
- గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం..
Step 1: దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్ పద్ధతిలో ఉంటుంది.
Step 7: అనంతరం సబ్మిట్ బటన్‌తో అప్లికేషన్ పూర్తి చేయాలి.
Step 8: మీ దరఖాస్తు ఫాంను ప్రింట్ తీసుకొని భవిష్యత్ అవసరాల కోసం భద్ర పరుచుకోవాలి.
Step 1: దరఖాస్తుకు మార్చ్ 17, 2022 వరకు అవకాశం ఉంది.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.