Home /News /jobs /

JOBS IN HYDERABAD NIPER KNOW QUALIFICATIONS AND APPLICATION PROCESS EVK

Jobs in Hyderabad: హైద‌రాబాద్ ఎన్ఐపీఈఆర్‌లో ఉద్యోగాలు.. అర్హ‌త‌లు, ద‌ర‌ఖాస్తు విధానం

ఎన్ఐపీఈఆర్‌లో ఉద్యోగాలు

ఎన్ఐపీఈఆర్‌లో ఉద్యోగాలు

Jobs in Hyderabad | భార‌త ప్ర‌భుత్వ రంగ సంస్థ అయిన నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసూటిక‌ల్ ఎడ్యుకేష‌న్ అండ్ రీసెర్చ్ హైద‌రాబాద్‌లో ఉంది. ఈ సంస్థ‌లో ప‌లు నాన్ టీచింగ్ ఫ్యాక‌ల్టీ పోస్ట‌ల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుదల అయ్యింది. పోస్టుల ద‌ర‌ఖాస్తుకు మార్చ్ 3, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

ఇంకా చదవండి ...
    భార‌త ప్ర‌భుత్వ రంగ సంస్థ అయిన నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసూటిక‌ల్ ఎడ్యుకేష‌న్ అండ్ రీసెర్చ్ (National Institute of Pharmaceutical Education and Research) హైద‌రాబాద్‌లో ఉంది. ఈ సంస్థ‌లో ప‌లు నాన్ టీచింగ్ ఫ్యాక‌ల్టీ పోస్ట‌ల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేష‌న్ (Notification) ద్వారా సైంటిస్ట్‌, టెక్నిక‌ల్ అసిస్టెంట్‌, స్టోర్ కీప‌ర్ వంటి ప‌లు పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సిన అభ్య‌ర్థుల వ‌య‌సు 27 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. అభ్య‌ర్థును స్కిల్ టెస్ట్‌, ఇంట‌ర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆన్‌లైన్ ప‌ద్ధతిలో ఉంటుంది. నోటిఫికేష‌న్ అప్లికేష‌న్ ప్రాసెస్ కోసం అధికారిక వెబ్‌సైట్ http://www.niperhyd.ac.in/index.html ను సంద‌ర్శించాలి. పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి మార్చ్ 3, 2022 వ‌రకు అవ‌కాశం ఉంది.

    Jobs in Andhra Pradesh: నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. రెవెన్యూశాఖ‌లో 670 పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు గ‌డువు పొడ‌గింపు































































    పోస్టు పేరుఅర్హ‌తలుఖాళీలు
    సైంటిస్ట్/టెక్నికల్
    సూపర్‌వైజర్ గ్రేడ్-I
    గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీలో ఎమ్మెస్సీ, ఎంఫార్మా చేసి ఉండాలి. సంబంధిత రంగంలో ప‌ని అనుభ‌వం ఉండాలి.03
    సైంటిస్ట్/టెక్నికల్
    సూపర్‌వైజర్ గ్రేడ్-II
    గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీలో ఎమ్మెస్సీ, ఎంఫార్మా చేసి ఉండాలి. సంబంధిత రంగంలో ప‌ని అనుభ‌వం ఉండాలి.02
    అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గుర్తింపు పొందిన బ్యాచ్‌ల‌ర్ డిగ్రీ చేసి ఉండాలి. సంబంధిత రంగంలో ప‌ని అనుభ‌వం ఉండాలి.01
    టెక్నిక‌ల్ అసిస్టెంట్‌గుర్తిపు పొందిన యూనివ‌ర్సిటీలో కంప్యూట‌ర్ సైన్స్ డిగ్రీ క‌లిగి ఉండాలి. సంబంధిత రంగంలో ప‌ని అనుభ‌వం అవ‌స‌రం01
    అకౌంటెంట్గుర్తిపు పొందిన యూనివ‌ర్సిటీలో బీకాం చేసి ఉండాలి. సంబంధిత రంగంలో ప‌ని అనుభ‌వం అవ‌స‌రం02
    రిసెప్షనిస్ట్ కమ్ టెలిఫోన్ ఆపరేటర్గుర్తిపు పొందిన యూనివ‌ర్సిటీలో ఏదైనా డిగ్రీ చేసి ఉండాలి. సంబంధిత రంగంలో ప‌ని అనుభ‌వం అవ‌స‌రం01
    స్టోర్ కీపర్గుర్తిపు పొందిన యూనివ‌ర్సిటీలో ఏదైనా డిగ్రీ చేసి ఉండాలి. సంబంధిత రంగంలో ప‌ని అనుభ‌వం అవ‌స‌రం01
    జూనియర్ హిందీ అనువాదకుడుగుర్తిపు పొందిన యూనివ‌ర్సిటీలో హిందీ, ఇంగ్లీష్‌లో మాస్ట‌ర్ డిగ్రీ చేసి ఉండాలి. సంబంధిత రంగంలో ప‌ని అనుభ‌వం అవ‌స‌రం01
    అసిస్టెంట్ గ్రేడ్-Iగుర్తిపు పొందిన యూనివ‌ర్సిటీలో ఏదైనా డిగ్రీ చేసి ఉండాలి. సంబంధిత రంగంలో ప‌ని అనుభ‌వం అవ‌స‌రం01
    అసిస్టెంట్ గ్రేడ్-IIగుర్తిపు పొందిన యూనివ‌ర్సిటీలో ఏదైనా డిగ్రీ చేసి ఉండాలి.03
    జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్గుర్తిపు పొందిన బోర్డులో ఇంట‌ర్ పూర్తి చేసి ఉండాలి.04

    NEET 2022 Study Plan: నీట్-2022 బ‌యాల‌జీ స్ట‌డీ ప్లాన్‌: ఇలా చ‌దివితే 360 మార్కులు ఎక్క‌డికీ పోవు..

    ఎంపిక విధానం..
    - ద‌ర‌ఖాస్తు చేసుకొన్న అభ్య‌ర్థుల‌క స్కిల్ టెస్ట్ నిర్వ‌హిస్తారు.
    - పరీక్ష‌లో పాసైన అభ్య‌ర్థుల‌కు ఇంట‌ర్వ్యూలు నిర్వ‌హిస్తారు.
    - ఉత్తీర్ణులైన వారిని తుది ఎంపిక చేస్తారు.



    ద‌ర‌ఖాస్తు విధానం..

    Step 1 :- ద‌ర‌ఖాస్తు పూర్తిగా ఆన్‌లైన్ ప‌ద్ధ‌తిలో ఉంటుంది.

    Step 2 :- ముందుగా అధికారిక వెబ్‌సైట్ http://www.niperhyd.ac.in/Careers_of_NIPER_Hyderabad.html లోకి వెళ్లాలి.

    Step 3 :- అనంత‌రం నోటిఫికేష‌న్ చ‌ద‌వాలి. (నోటిఫికేష‌న్ కోసం క్లిక్ చేయండి)

    Step 4 :- త‌రువాత Online Applicationలోకి వెళ్లాలి.

    Shaheena Attarwala: ముంబై స్లమ్​ నుంచి మైక్రోసాఫ్ట్ మేనేజర్​గా ఎదిగిన యువతి.. ఆమె జీవితం ఎంతో మందికి ఆదర్శం

    Step 5 :- Online Application లింక్ ఫిబ్ర‌వ‌రి 1, 2022 నుంచి ప్రారంభం అవుతుంది.

    Step 6 :-లింక్ ఓపెన్ చేసిన త‌ర్వాత విద్యార్హ‌త‌లు, అనుభ‌వం వివ‌రాలు పొందుప‌ర్చాలి.

    Step 7 :- ద‌ర‌ఖాస్తు పూర్త‌యిన త‌రువాత రూ.500 ప‌రీక్ష ఫీజు చెల్లించాలి.

    Step 8 :- ఫిజు చెల్లించ‌న త‌ర్వాత స‌బ్‌మిట్ చేయాలి.

    Step 9 :- ద‌ర‌ఖాస్తుకు మార్చ్ 2, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Central Government Jobs, Hyderabad, Job notification, JOBS, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు