హైదరాబాద్ (Hyderabad) రాజేంద్ర నగర్‌లోని భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధికి మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీ రాజ్ (National Institute of Rural Development and Panchayati Raj)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలను ఒప్పంద ప్రాతిపదికన నియమిస్తున్నట్టు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఈ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్ పద్ధతిలో ఉంటుంది. పోస్టుల ఆధారంగా దరఖాస్తు చేసుకొనే అభ్యర్థి గరిష్ట వయసు 30 ఏళ్లు మించి ఉండకూడదు. నోటిఫికేషన్ (Notification) సమాచారం, దరఖాస్తు విధానం కోసం అధికారిక వెబ్‌సైట్ http://nirdpr.org.in/index.aspx ను సందర్శించాల్సి ఉంటుంది. దరఖాస్తుకు మార్చ్ 27, 2022 వరకు అవకాశం ఉంది.
GATE Exam Jobs: "గేట్" పరీక్ష క్లియర్ చేశారా.. అయితే దరఖాస్తు చేసుకోవాల్సిన జాబ్స్ ఇవే!
పోస్టుల వివరాలు..
పోస్ట పేరు | అర్హతలు | ఖాళీలు | వేతనం |
నెట్ డెవలపర్స్ | గుర్తింపు పొందిన యూనివర్సిటీలో సీఎస్ఈ, ఐటీలో బీటెక్, ఎంటెక్ చేసి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. | 02 | రూ. 40,000 |
ఐటీ సపోర్ట్ ఇంజనీర్ | ఐటీలో డిప్లమా లేదా డిగ్రీ సంబంధిత రంగంలో పని అనుభవం ఉండాలి. | 02 | రూ. 25,000 |
ఐటీ అసిస్టెంట్ | ఐటీలో డిప్లమా లేదా డిగ్రీ సంబంధిత రంగంలో పని అనుభవం ఉండాలి. | 01 | రూ. 20,000 |
ఎంపిక విధానం..
- ముందుగా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు.
- అనంతరం అభ్యర్థుల సాంకేతిక సామర్థ్యాను గుర్తించి అంచనా వేసి తుది ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం..
- దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్ పద్ధతిలో ఉంటుంది.
Govt Jobs 2022: ఈ వారం దరఖాస్తు చేసుకోవాల్సిన ప్రభుత్వ ఉద్యోగాలు, అర్హతలు, అప్లికేషన్ సమాచారం
- ముందుగా అధికారిక వెబ్‌సైట్ http://nirdpr.org.in/index.aspx ను సందర్శించాలి.
- అనంతరం నోటఫికేషన్ వివరాలను చదవాలి.
- తరువాత Apply Online ఆప్షన్‌లోకి వెళ్లి క్లిక్ చేయాలి.
- తప్పులు లేకుండా దరఖాస్తు ఫాంను నింపాలి.
- తరువాత భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ ఫాంను ప్రింట్ తీసుకోని భద్ర పరుచుకోండి.
- దరఖాస్తుకు మార్చ్ 27, 2022 వరకు అవకాశం ఉంది.
హైదరాబాద్ సీడాక్‌లో ఉద్యోగాలు..
సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్ కంప్యూటింగ్ (Centre for Development of Advanced Computing) హైదరాబాద్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (Notification) విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ఆధారంగా ప్రాజెక్ట్ మేనేజర్, ప్రాజెక్టు ఇంజనీర్ (Project Engineer), ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టును భర్తీ చేయనున్నారు. రాత పరీక్ష (Written Test), ఇంటర్వ్యూ (interview) ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. దరఖాస్తు చేయాలనుకొనే అభ్యర్థులు నోటిఫికేషన్ కోసం https://www.cdac.in/index.aspx?id=ca_advt_2022_01_Mar వెబ్‌సైట్‌ను సందర్శించాలి. సంబంధిత రంగాల్లో బీఈ, బీటెక్ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్ (Online) ఆధారంగా ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి మార్చ్ 30, 2022 వరకు అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.