హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(Hindustan Aeronautics Limited) హైదరాబాద్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ (Notification) ద్వారా టెక్నిషియన్ అప్రెంటీస్ ట్రైనీ, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ట్రైనీ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుకు సంబంధించిన నోటిఫికేషన్ వివరాలను అధికారిక వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకొన్న తరువాత డౌన్లోడ్ (Download) చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి పరీక్ష లేకుండా.. కేవలం అకడామిక్ మెరిట్ (Academic Merit), రిజర్వేషన్ ఆధారంగా ఈ పోస్టులను HAL భర్తీ చేయనుంది. ఎంపికైన అభ్యర్థులకు పోస్టు ఆధారంగా రూ.8,000 నుంచి రూ.9,000 వరకు స్టైఫండ్ అందజేస్తారు. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్ పద్ధతిలో ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ జనవరి 7, 2022 నుంచి జనవరి 17, 2022 వరకు ఉంటుంది. నోటిఫికేషన్, అప్లికేషన్ ప్రాసెస్‌కు అధికారక వెబ్సైట్ https://portal.mhrdnats.gov.in/ ను సందర్శించాల్సి ఉంటుంది.
పోస్టుల వివరాలు.. అర్హతలు
పోస్టు పేరు
అర్హతలు
ఖాళీలు
స్టైఫండ్ నెలకు
టెక్నిషియన్ అప్రెంటీస్ ట్రైనీ
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, మెకానికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎయిరోనాటికల్ ఇంజనీరింగ్ తదితర విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్, ఇంజనీరింగ్ డిప్లమా చేసి ఉండాలి. దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు 2019, 2020, 2021 సంవత్సరాల్లో ఉత్తీర్ణులై ఉండాలి.
80
రూ.8,000
గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ట్రైనీ
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, మెకానికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎయిరోనాటికల్ ఇంజనీరింగ్ తదితర విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్, ఇంజనీరింగ్ డిప్లమా చేసి ఉండాలి. దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు 2019, 2020, 2021 సంవత్సరాల్లో ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక విధానం..
- ఎంపిక ప్రక్రియ పూర్తిగా నోటిఫికేషన్ ఆధారంగా జరుగుతుంది.
- అభ్యర్థుల నుంచి సకాలంలో దరఖాస్తులు స్వీకరిస్తారు.
- దరఖాస్తు దారుల అకడమిక్ మెరిట్, రిజర్వేషన్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు.
- విద్యార్హతల డాక్యుమెంట్లను పరిశీలించి తుది ఎంపిక చేస్తారు.
- తప్పుడు ధ్రువపత్రాలను సమర్పించిన వారిపై చర్యలు తీసుకొంటారు.
Step 6: లాగిన్ పైన క్లిక్ చేసి వివరాలతో లాగిన్ కావాలి.
Step 7: ఆ తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ రిక్వెస్ట్ మెనూ పైన క్లిక్ చేయాలి.
Step 8: ఫైండ్ ఎస్టాబ్లిష్మెంట్ పైన క్లిక్ చేయాలి.
Step 9: హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అప్రెంటీస్ అని టైప్ చేసి సెర్చ్ చేయాలి.
Step 10: ఆ తర్వాత అప్లై బటన్ పైన క్లిక్ చేసి దరఖాస్తు చేయాలి.
Step 11: అంతే కాకుండా అప్లికేషన్ ఫాంకు సంబంధించిన ఫార్మెట్‌ను నోటిఫికేషన్లో ఉంచారు.
Step 12: దరాఖాస్తు చేసుకోవడానికి జనవరి 17, 2022 వరకు అవకాశం ఉంది.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.