Home /News /jobs /

JOBS IN HYDERABAD 150 APPRENTICE POSTS IN HAL ONE DAY CHANCE TO APPLY KNOW DETAILS EVK

Jobs in Hyderabad: హెచ్ఏఎల్‌లో 150 ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తుకు ఒక్క రోజే చాన్స్‌!

హెచ్ఏఎల్ హైద‌రాబాద్‌లో ఉద్యోగాలు

హెచ్ఏఎల్ హైద‌రాబాద్‌లో ఉద్యోగాలు

Hindustan Aeronautics Limited Jobs | హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హైద‌రాబాద్‌లో ప‌లు పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తోంది. ద‌ర‌ఖాస్తు చేసుకొన్న అభ్య‌ర్థుల నుంచి టెక్నిషియ‌న్ అప్రెంటీస్ ట్రైనీ, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ట్రైనీల‌ను ఎంపిక చేస్తారు. ఈ పోస్టుల ద‌ర‌ఖాస్తుకు జ‌న‌వ‌రి 17, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

ఇంకా చదవండి ...
    హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(Hindustan Aeronautics Limited) హైద‌రాబాద్‌లో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేష‌న్ (Notification) ద్వారా టెక్నిషియ‌న్ అప్రెంటీస్ ట్రైనీ, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ట్రైనీ ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ పోస్టుకు సంబంధించిన నోటిఫికేష‌న్ వివ‌రాల‌ను అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్ట‌ర్ చేసుకొన్న త‌రువాత డౌన్‌లోడ్ (Download) చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి ప‌రీక్ష లేకుండా.. కేవ‌లం అక‌డామిక్ మెరిట్‌ (Academic Merit), రిజర్వేష‌న్ ఆధారంగా ఈ పోస్టుల‌ను HAL భ‌ర్తీ చేయ‌నుంది. ఎంపికైన అభ్య‌ర్థుల‌కు పోస్టు ఆధారంగా రూ.8,000 నుంచి రూ.9,000 వ‌ర‌కు స్టైఫండ్ అంద‌జేస్తారు. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆన్‌లైన్ ప‌ద్ధ‌తిలో ఉంటుంది.  ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ జ‌న‌వ‌రి 7, 2022 నుంచి జ‌న‌వ‌రి 17, 2022 వ‌ర‌కు ఉంటుంది. నోటిఫికేష‌న్‌, అప్లికేష‌న్ ప్రాసెస్‌కు అధికార‌క వెబ్‌సైట్ https://portal.mhrdnats.gov.in/ ను సంద‌ర్శించాల్సి ఉంటుంది.

    పోస్టుల వివ‌రాలు.. అర్హ‌త‌లు





















    పోస్టు పేరుఅర్హ‌త‌లుఖాళీలుస్టైఫండ్ నెల‌కు
    టెక్నిషియ‌న్ అప్రెంటీస్ ట్రైనీఎల‌క్ట్రానిక్స్ అండ్ క‌మ్యూనికేష‌న్‌, ఎల‌క్ట్రిక‌ల్ అండ్ ఎల‌క్ట్రానిక్స్, మెకానిక‌ల్‌, సివిల్‌, కంప్యూట‌ర్ సైన్స్‌, ఎయిరోనాటిక‌ల్ ఇంజ‌నీరింగ్ త‌దిత‌ర విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీ నుంచి ఇంజ‌నీరింగ్‌, ఇంజ‌నీరింగ్ డిప్ల‌మా చేసి ఉండాలి. ద‌ర‌ఖాస్తు చేసుకొనే అభ్య‌ర్థులు 2019, 2020, 2021 సంవ‌త్స‌రాల్లో ఉత్తీర్ణులై ఉండాలి.80రూ.8,000
    గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ట్రైనీఎల‌క్ట్రానిక్స్ అండ్ క‌మ్యూనికేష‌న్‌, ఎల‌క్ట్రిక‌ల్ అండ్ ఎల‌క్ట్రానిక్స్, మెకానిక‌ల్‌, సివిల్‌, కంప్యూట‌ర్ సైన్స్‌, ఎయిరోనాటిక‌ల్ ఇంజ‌నీరింగ్ త‌దిత‌ర విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీ నుంచి ఇంజ‌నీరింగ్‌, ఇంజ‌నీరింగ్ డిప్ల‌మా చేసి ఉండాలి. ద‌ర‌ఖాస్తు చేసుకొనే అభ్య‌ర్థులు 2019, 2020, 2021 సంవ‌త్స‌రాల్లో ఉత్తీర్ణులై ఉండాలి.70రూ.9,000

    Jobs for Freshers: ఫ్రెష‌ర్స్ గుడ్ చాన్స్‌.. నెల‌కు రూ.29,000 వేతనం.. అప్లికేష‌న్ ప్రాసెస్‌


    ఎంపిక విధానం..
    - ఎంపిక ప్ర‌క్రియ పూర్తిగా నోటిఫికేష‌న్ ఆధారంగా జ‌రుగుతుంది.
    - అభ్య‌ర్థుల నుంచి స‌కాలంలో ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తారు.
    - ద‌ర‌ఖాస్తు దారుల అక‌డ‌మిక్ మెరిట్‌, రిజ‌ర్వేష‌న్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు.
    - విద్యార్హ‌త‌ల డాక్యుమెంట్ల‌ను ప‌రిశీలించి తుది ఎంపిక చేస్తారు.
    - త‌ప్పుడు ధ్రువ‌ప‌త్రాల‌ను స‌మ‌ర్పించిన వారిపై చ‌ర్య‌లు తీసుకొంటారు.

    ద‌ర‌ఖాస్తు విధానం..

    Step 1: అభ్యర్థులు ముందుగా https://portal.mhrdnats.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

    Step 2: హోమ్ పేజీలో Register here పైన క్లిక్ చేయాలి.

    Step 3: అభ్యర్థులు తమ వివరాలతో రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.

     Step 4: ఎన్‌రోల్‌మెంట్ వెరిఫికేషన్, అప్రూవల్ కోసం ఒక రోజు వేచిచూడాలి.


    Step 5: వెరిఫికేషన్, అప్రూవల్ పూర్తైన తర్వాత మళ్లీ https://portal.mhrdnats.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

    Govt Jobs 2022: డిగ్రీ అర్హ‌త‌త‌లో నెల‌కు రూ.20,000 జీతం.. మూడు రోజులే చాన్స్‌!

    Step 6: లాగిన్ పైన క్లిక్ చేసి వివరాలతో లాగిన్ కావాలి.

    Step 7: ఆ తర్వాత ఎస్టాబ్లిష్‌మెంట్ రిక్వెస్ట్ మెనూ పైన క్లిక్ చేయాలి.

    Step 8: ఫైండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ పైన క్లిక్ చేయాలి.

    Step 9: హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అప్రెంటీస్ అని టైప్ చేసి సెర్చ్ చేయాలి.

    Step 10: ఆ తర్వాత అప్లై బటన్ పైన క్లిక్ చేసి దరఖాస్తు చేయాలి.

    Step 11: అంతే కాకుండా అప్లికేష‌న్ ఫాంకు సంబంధించిన ఫార్మెట్‌ను నోటిఫికేష‌న్‌లో ఉంచారు.

    Step 12: ద‌రాఖాస్తు చేసుకోవ‌డానికి జ‌న‌వ‌రి 17, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Govt Jobs 2022, Hyderabad, Job notification, JOBS, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు