సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (Central Reserve Police Force)లో 2,439 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ పోస్టులకు ఎలాంటి పరీక్ష అవసరం లేకుండా కేవలం ఇంటర్వ్యూ ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. CRPF, ITBP, SSB, BSF విభాగాల్లో ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ CRPF రిక్రూట్మెంట్ నోటిఫికేషన్(Notification) విడుదల చేసింది. దరఖాస్తు దారులకు సెప్టెంబర్ 13 నుంచిసెప్టెంబర్ 15 వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి CAPF, సాయుధ దళాల రిటైర్డ్ సిబ్బంది అయి ఉండాలి.
ఈ పోస్టులకు పురుషులు, మహిళలు ఎవరైన దరఖాస్తు చేసుకోవచ్చు. (నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి)
ఖాళీ వివరాలు..
* ఏఆర్ (AR)- 156
* బీఎస్ఎఫ్ (BSF)- 365
* సీఆర్పీఎఫ్ (CRPF)- 1537
* ఐటీబీపీ (ITBP)- 130
* ఎస్ఎస్బీ (SSB)- 251
RRB Group D Jobs: త్వరలో ఆర్ఆర్బీ గ్రూప్-డీ అడ్మిట్ కార్డులు!
ఇంటర్వ్యూ తేదీలు
సెప్టెంబర్ 13, 2021 నుంచి సెప్టెంబర్ 15, 2021
అర్హతలు..
దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు CAPF, సాయుధ దళాల రిటైర్డ్ సిబ్బంది అయి ఉండాలి.
వయోపరిమితి
అభ్యర్థి వయసు 62 ఏళ్ల లోపు ఉండాలి.
దరఖాస్తుకు అవసరమైన డాక్యుమెంట్లు..
దరఖాస్తు చేసుకొనే అభ్యర్థి రిటైర్డ్ సర్టిఫికెట్, వయసు ధ్రువీకరణ సర్టిఫికెట్(Certificate), విద్యార్హత వివరాలు ఉండాలి. దరఖాస్తు చేసుకొనే వారు ఓ కాగితం మీద తమ అర్హతలతో పాటు ఏ పోస్టుకు దరఖాస్తు చేస్తున్నారో వివరాలు రాయాలి. అప్లికేషన్‌తోపాటు 3 పాస్‌పోర్టు(Passport) సైజ్ ఫోటోలు పంపాలి. ఇంటర్వ్యూ కొచ్చే అభ్యర్థులు అర్హతలకు సంబంధించిన ఒరిజినల్(Original) డాక్యుమెంట్లు తీసుకొని రావాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Govt Jobs 2021