Home /News /jobs /

JOBS IN CREDR APPLICATIONS INVITING FOR MECHANIC JOB VACANCIES FROM TENTH PASSED CANDIDATES HERE DETAILS NS

Jobs in CREDR: నిరుద్యోగులకు అలర్ట్.. టెన్త్ అర్హతతో జాబ్స్.. ఇలా అప్లై చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రముఖ క్రెడార్ (CREDR) సంస్థ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఇప్పటికే పలు విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసిన సంస్థ తాజాగా మరో ప్రకటన విడుదల చేసింది.

    సెకండ్ హ్యాండ్ బైక్ ల కొనుగోలు, అమ్మకాలతో పాటు డోర్ స్టెప్ బైక్ సర్వీసులను అందించే ప్రముఖ క్రెడార్ (CREDR) సంస్థ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఇప్పటికే పలు విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు (Job Notification) విడుదల చేసిన సంస్థ తాజాగా మరో ప్రకటన విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు తమ Resume ను మెయిల్ కు పంపించాలని ప్రకటనలో పేర్కొంది క్రెడార్ సంస్థ. ఈ ప్రకటన ద్వారా మెకానిక్ (Mechanic) ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. Refurbishment డిపార్ట్మెంట్ లో ఈ ఖాళీలను (Jobs) భర్తీ చేస్తున్నారు. ఎంపికైన అభ్యర్థులు బెంగళూరు, ఢిల్లీ, పూణేలో పని చేయాల్సి ఉంటుంది. తమ డైనమిక్ లో చేరడానికి అనుభవం, టాలెంట్ కలిగిన అభ్యర్థుల కోసం ఎదురు చూస్తున్నట్లు సంస్థ తెలిపింది. వాహనాలను రిపేర్ చేయడం, మెయింటేన్ చేడం లాంటి విధులను ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు నిర్వర్తించాల్సి ఉంటుంది. మిషనరీని అసెంబ్లింగ్ చేయడం, వాహనాలను తనిఖీ చేయడం లాంటివి కూడా చేయాల్సి ఉంటుంది.

    Duties and Responsibilities:
    - ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు రెగ్యులర్ మెయింటెనెన్స్ టాస్క్ లు, స్పార్క్ ప్లగ్ లు, ఆయిల్ మార్చడం లాంటివి చేయాల్సి ఉంటుంది.
    - ఇంజిన్ మరియు ట్రాన్స్మిషన్ సిస్టమ్ ను కూడా రిపేర్ చేయాలి.
    - పనికిరాని పార్ట్స్ లను భర్తీ చేయాలి. రిపేర్ చేసిన పార్ట్స్ లను మళ్లీ ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది.
    - ఇంగ్లీష్, హిందీ, మరాఠీ భాషల్లో శిక్షణ ఉంటుంది. ఆ భాషలు తెలిసి ఉండాలి.
    - డైలీ సర్వీస్ రిపోర్ట్ ను క్రెడార్ సర్వీస్ హెడ్ కు పంపించాల్సి ఉంటుంది.
    - పని చేయాల్సిన వాహనాల కోసం ఖచ్చితమైన సమస్యను గుర్తించాల్సి ఉంటుంది.
    - రిపేర్ తర్వాత వాహనాలను తనిఖీ చేయాల్సి ఉంటుంది.
    CREDR Jobs: నిరుద్యోగులకు అలర్ట్.. CREDR సంస్థలో జాబ్స్.. ఇలా అప్లై చేసుకోండి

    విద్యార్హతలు:
    - అభ్యర్థులు టెన్త్ పాసై ఉండాలి.
    - కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి. ఒకేషనల్ లేదా ట్రేడ్ స్కూల్ సర్టిఫికేట్ ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
    - వాహనాల రిపైర్, సమస్య గుర్తించడంలో నాలెడ్జ్ ఉండాలి.
    - కస్టమర్లతో మంచి కమ్యూనికేషన్ మెయింటేన్ చేసే స్కిల్స్ ఉండాలి.



    ఎలా అప్లై చేయాలంటే..
    - అభ్యర్థులు తమ Resume ను hr@credr.com మెయిల్ కు పంపించాల్సి ఉంటుంది.
    - సబ్జెక్ట్ స్థానంలో "Role Name - Location Name" రాసి ఉండాలి.
    - అప్ డేట్ తో పాటు ఖచ్చిమైన సమాచారాన్ని కలిగిన Resume ను పంపించాలి.
    - ఈమెయిల్ అందుకున్న తర్వాత మీ అభ్యర్థిత్వాలను పరిశీలించి.. జాబ్ ప్రొఫైల్ కు మ్యాచ్ అయ్యే వారికి సమాచారం అందిస్తారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: CREDR, Job notification, JOBS, Private Jobs

    తదుపరి వార్తలు