JOBS IN AP VARIOUS POSTS IN ANANTAPUR DISTRICT SALARY RS 37000 SELECTED THROUGH INTERVIEW ONLY EVK
Jobs in Andhra Pradesh: అనంతపురం జిల్లాలో ఉద్యోగాలు.. వేతనం రూ.37,000.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక!
అనంతరపురంలో ఉద్యోగాలు
Jobs in Andhra Pradesh | అనంతపురంజిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (Notification)విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వేర్వేరు విభాగాల్లో పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలను ఔట్సోర్సింగ్ పద్ధతిలో తీసుకోనున్నారు.
అనంతపురం (Ananthapuram) జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (Notification)విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వేర్వేరు విభాగాల్లో పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలను ఔట్సోర్సింగ్ (Outsourcing ) పద్ధతిలో తీసుకోనున్నారు. అర్హతలకు సంబంధించిన పూర్తి వివరాలను నోటిఫికేషన్లో పొందు పరిచారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొవాల్సిన అవసరం లేదు. నేరుగా వాక్ ఇన్ ఇంటర్వ్యూకు వెళ్ల వచ్చు. వాక్ ఇన్ మార్చ్ 19, 2022న ఉంటుంది. ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు సమాచారం కోసం ముందుగా అధికారిక వెబ్సైట్ https://ananthapuramu.ap.gov.in/ ను సందర్శించాలి. ఈ నోటిఫికేషన్ ద్వారా అన్ని విభాగాల్లో కలిపి 18 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
ఎంపిక విధానం..
- అభ్యర్థులు నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా ధ్రువపత్రాలతో ఇంటర్వ్యూకి హాజరు కావాలి.
- ఇంటర్వ్యూ అనంతరం అభ్యర్థులను ఎంపిక చేసి పోస్టింగ్ ఇస్తారు.
ముఖ్యమైన సమాచారం..
- పోస్టులకు ఎటువంటి దరఖాస్తు అక్కర్లేదు
- ఎంపికైన అభ్యర్థులకు కాంట్రాక్టు ప్రాతిపదికన పోస్టింగ్ ఇస్తారు.
- అభ్యర్థుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
- నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అధికారిక వెబ్సైట్ https://ananthapuramu.ap.gov.in/notice_category/recruitment/ ను సందర్శించాలి.
- ఇంటర్వ్యూ తేదీ మార్చ్ 19, 2022
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.