హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Jobs in AP: ఒంగోలులో ఉద్యోగ అవ‌కాశాలు.. వేత‌నం రూ.28,000.. అర్హ‌త‌లు, అప్లికేష‌న్ విధానం

Jobs in AP: ఒంగోలులో ఉద్యోగ అవ‌కాశాలు.. వేత‌నం రూ.28,000.. అర్హ‌త‌లు, అప్లికేష‌న్ విధానం

ఒంగోలులో ఉద్యోగాలు

ఒంగోలులో ఉద్యోగాలు

Jobs in Andhra Pradesh | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఒంగోలు జ‌న‌ర‌ల్ ఆస్ప‌త్రిలో(GGH) ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల అయ్యింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా ప‌లు విభాగాల్లో ఖాళీల‌ల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ పోస్టుల ద‌ర‌ఖాస్తుకు ఏప్రిల్ 4, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

ఇంకా చదవండి ...

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వానికి చెందిన ఒంగోలు జ‌న‌ర‌ల్ ఆస్ప‌త్రిలో(GGH) ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల అయ్యింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా ఇందులో పర్ ఫ్యూజనిస్ట్, ఎంఆర్ఐ టెక్నీషిన్, సిటీ టెక్నీషియన్, డయాలసిస్ టెక్నీషియన్, కాథ్ లాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ పోస్టుల ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆఫ్‌లైన్ ప‌ద్ధ‌తిలో ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 4, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది. నోటిఫికేష‌న్ (Notification)  వివ‌రాలు, ద‌ర‌ఖాస్తు విధానం తెలుసుకోవ‌డానికి అధికారిక వెబ్‌సైట్ https://prakasam.ap.gov.in/ ను సంద‌ర్శించాల్సి ఉంటుంది.

TS EAMCET 2022: తెలంగాణ ఎంసెట్ నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. ప‌రీక్ష తేదీల వివ‌రాలు

పోస్టుల వివ‌రాలు..

పోస్టు పేరుఖాళీలువేతనం
ఫ్యూజనిస్ట్02రూ. 17,500
ఎంఆర్ఐ టెక్నీషిన్02రూ. 17,500
సిటీ టెక్నీషియన్02రూ. 17,500
డయాలసిస్ టెక్నీషియన్04రూ. 17,500
కాథ్ లాబ్ టెక్నీషియన్02రూ. 17,500
ఫార్మసిస్ట్02రూ. 28,000

అర్హ‌త‌లు..

సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లమా, బీఎస్సీ, ఉత్తీర్ణ‌త కోర్సుల స‌ర్టిఫికెట్ల‌తోపాటు అనుభ‌వం ఉండాలి. ద‌ర‌ఖాస్తు చేసుకొనే అభ్య‌ర్థి వ‌య‌సు 42 ఏళ్లు మించి ఉండ‌కూడదు. అంతే కాకుండా ఏపీ పారా మెడిక‌ల్ బోర్డులో రిజిస్ట‌ర్ అయి ఉండాలి.

ఎంపిక విధానం..

- ముందుగా అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తారు.

- సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, బీఎస్సీ పాసైన అర్హ‌త వివ‌రాలు ప‌రిశీలిస్తారు.

- రిజ‌ర్వేష‌న్ ప్ర‌క్రియ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం..

Step 1 - ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆఫ్‌లైన్ ప‌ద్ధ‌తిలో ఉంటుంది.

Aviation Career: పైల‌ట్ అవ్వాల‌నుకొంటున్న వారికి సూప‌ర్ చాన్స్‌.. స్కాల‌ర్‌షిప్ అవ‌కాశం కూడా..

Step 2 - ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://prakasam.ap.gov.in/ ను సంద‌ర్శించాల్సి ఉంటుంది.

Step 3 - అనంత‌రం నోటిఫికేష‌న్ వివ‌రాలు పూర్తిగా చ‌ద‌వాలి.

Step 4 - ద‌ర‌ఖాస్తు ఫాంను త‌ప్పులు లేకుండా నింపాలి.

Step 5 - సంబంధిత డాక్యుమెంట్ల‌ను జ‌త చేసి అప్లికేష‌న్‌ను

ది సూపరింటెండెంట్,

రూం నెం.124,

ప్రభుత్వ జ‌న‌ర‌ల్ హాస్ప‌ట‌ల్‌,

ఒంగోలు, ప్రకాశం అడ్ర‌స్‌కు పంపాలి.

Step 6 - ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి ఏప్రిల్ 4, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

First published:

Tags: Andhra Pradesh, Govt Jobs 2022, Health department jobs, JOBS, Ongole

ఉత్తమ కథలు