ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం పోర్టులో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా పోర్ట్‌కు సంబంధించి సూపర్‌వైజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎటువంటి దరఖాస్తు లేకుండా.. పరీక్ష లేకుండా నేరుగా ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. సంబంధిత రంగంలో అనుభవం ఉన్నవారు ఈ ఇంటర్వ్యూకి అర్హులు. నోటిఫికేషన్ వివరాల కోసం అధికారి వెబ్‌సైట్ https://vizagport.com/ ను సందర్శించాల్సి ఉంటుంది.
పోస్టుల వివరాలు..
పోస్టు | అర్హతలు | వేతనం | ఖాళీలు |
ఇంజినీరింగ్ సూపర్ వైజర్ (సివిల్) | సివిల్ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్/ డీసీఈ ఉత్తీర్ణత సాధించాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. | రూ.35,000 | 10 |
ఎంపిక విధానం..
- అభ్యర్థులు నేరుగా వాక్ ఇన్ ఇంటర్వ్యూకి హాజరు అవ్వాలి.
- మెరిట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ముఖ్యమైన సమాచారం
- నోటిఫికేషన్ కోసం అధికారిక వెబ్‌సైట్ https://vizagport.com/ ను సందర్శించాలి.
- నోటిఫికేషన్ చివరన అప్లికేషన్ ఫాం నింపి ఇంటర్వ్యూకి తీసుకెళ్లాలి.
- వాక్ ఇన్ తేదీ - ఏప్రిల్ 20, 2022
విశాఖపట్నంలో కాంట్రాక్టు జాబ్స్..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్ విశాఖపట్నం జిల్లాలోని వివిధ ఆస్పత్రుల్లో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ (Notification) ద్వారా పది విభాగాల్లో కలిపి 25 ఖాళీలను భర్తీ చేస్తారు. దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల వయసు 18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆఫ్‌లైన్ పద్ధతిలో ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి వేతనం అందిస్తారు. నోటిఫికేషన్, దరఖాస్తు సమాచారం తెలుసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ https://visakhapatnam.ap.gov.in/ ను సందర్శించాల్సి ఉంటుంది. దరఖాస్తులు అందజేయడానికి ఏప్రిల్ 18, 2022 వరకు అవకాశం ఉంది.
దరఖాస్తు విధానం..
Step 1 - దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆఫ్‌లైన్ పద్ధతిలో ఉంటుంది.
Step 2 - ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://visakhapatnam.ap.gov.in/ ను సందర్శించాలి.
Step3 - నోటిఫికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకొని చదవాలి.
Step 4 - అనంతరం నోటిఫికేషన్ చివరన ఉన్న దరఖాస్తు ఫాంను డౌన్‌లోడ్ చేసుకొవాలి.
Step 5 - దరఖాస్తుకు అవసరమైన డాక్యుమెంట్లను జతచేసి ఫాం నింపాలి.
Step 6 - ఓసీ అభ్యర్థులు రూ. 500, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ. 300 ఫీజు చెల్లించాలి. పీడబ్ల్యూడీ వారికి ఫీజు చెల్లింపులో మినహాయింపు ఉంది.
Step 7 - దరఖాస్తు ఫాంలను
డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్ ఆఫ్ హాస్పటల్ సర్వీస్
విశాఖపట్నం జిల్లా, ఏపీ
అడ్రస్‌కు పంపాలి.
Step 8 - దరఖాస్తుకు ఏప్రిల్ 18 , 2022 వరకు అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Central Government Jobs, Govt Jobs 2022, Job notification