Home /News /jobs /

JOBS IN AP CONTRACT JOBS IN PRAKASAM DISTRICT KNOW ELIGIBILITY AND APPLICATION DETAILS EVK

Jobs in AP: ప్ర‌కాశం జిల్లాలో కాంట్రాక్టు ఉద్యోగాలు.. అర్హ‌త‌లు, అప్లికేష‌న్ వివ‌రాలు

ప్ర‌కాశం జిల్లాలో ఉద్యోగాలు

ప్ర‌కాశం జిల్లాలో ఉద్యోగాలు

Jobs in Andhra Pradesh | ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన ప‌రిష‌త్ ప్ర‌కాశం జిల్లాలోని వివిధ ఆస్ప‌త్రుల్లో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ప్రాతిప‌దిక‌న ప‌లు పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ నోటిఫికేష‌న్ (Notification) ద్వారా ప‌ది విభాగాల్లో క‌లిపి 12 ఖాళీల‌ను భ‌ర్తీ చేస్తారు.

ఇంకా చదవండి ...
    ఆంధ్ర‌ప్ర‌దేశ్ (Andhra Pradesh)ప్ర‌భుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన ప‌రిష‌త్ ప్ర‌కాశం జిల్లాలోని వివిధ ఆస్ప‌త్రుల్లో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ప్రాతిప‌దిక‌న ప‌లు పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ నోటిఫికేష‌న్ (Notification) ద్వారా ప‌ది విభాగాల్లో క‌లిపి 12 ఖాళీల‌ను భ‌ర్తీ చేస్తారు. ద‌ర‌ఖాస్తు చేసుకొనే అభ్య‌ర్థుల వ‌య‌సు 18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆఫ్‌లైన్ ప‌ద్ధ‌తిలో ఉంటుంది. ఎంపికైన అభ్య‌ర్థుల‌కు పోస్టుల‌ను అనుస‌రించి రూ.15,000 నుంచి రూ.52,000 వ‌ర‌కు వేత‌నం అందిస్తారు. నోటిఫికేష‌న్‌, ద‌ర‌ఖాస్తు స‌మాచారం తెలుసుకోవ‌డానికి అధికారిక వెబ్‌సైట్ https://prakasam.ap.gov.in/notice_category/recruitment/ ను సంద‌ర్శించాల్సి ఉంటుంది. ద‌ర‌ఖాస్తులు అంద‌జేయ‌డానికి  మే 26 , 2022 సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

    UGC NET 2022: యూజీసీ నెట్ అభ్య‌ర్థుల‌కు అల‌ర్ట్‌.. ద‌ర‌ఖాస్తు గ‌డువు పొడ‌గింపు.. ఈ విష‌యాలు గుర్తుంచుకోండి

    పోస్టుల వివరాలు..




























    పోస్టు పేరుఖాళీలువేతనం
    బయోమెడికల్  ఇంజినీర్01రూ. 52,000
    థియేటర్ అసిస్టెంట్01రూ. 15,000
    పోస్ట్ మార్టం అసిస్టెంట్07రూ. 15,000
    జనరల్ డ్యూటీ అటెండెంట్లు03రూ. 15,000

    ఎంపిక విధానం..

    - ముందుగా అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తారు.

    Study Tips: ఎక్కువ సేపు చ‌దువ‌లేక‌పోతున్నారా.. అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!

    - అనంత‌రం రిజ‌ర్వేష‌న్‌, మెరిట్ మార్కుల ఆధారంగా అభ్య‌ర్థుల‌ను షార్ట్ లిస్ట్ చేస్తారు.

    - ఎంపికైన వారిని కాంట్రాక్ట్ ఆధారంగా పోస్టింగ్ ఇస్తారు.



    ద‌ర‌ఖాస్తు విధానం..

    Step 1 - ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆఫ్‌లైన్ ప‌ద్ధతిలో ఉంటుంది.

    Step 2 - ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://prakasam.ap.gov.in/notice_category/recruitment/ ను సంద‌ర్శించాలి.

    Step3 - నోటిఫికేష‌న్‌ను డౌన్‌లోడ్ చేసుకొని చ‌ద‌వాలి.

    TS Constable Jobs: కానిస్టేబుల్ ఉద్యోగార్థుల‌కు గుడ్ న్యూస్‌.. రిక్రూట్‌మెంట్‌లో కొత్త అప్‌డేట్‌

     Step 4 - అనంత‌రం నోటిఫికేష‌న్ చివ‌ర‌న ఉన్న ద‌ర‌ఖాస్తు ఫాంను డౌన్‌లోడ్ చేసుకొవాలి.

    Step 5 - ద‌ర‌ఖాస్తుకు అవ‌స‌ర‌మైన డాక్యుమెంట్ల‌ను జ‌త‌చేసి ఫాం నింపాలి.

    Step 6 - ఓసీ అభ్య‌ర్థులు రూ. 500, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్య‌ర్థులు రూ. 300 ఫీజు చెల్లించాలి. పీడబ్ల్యూడీ వారికి ఫీజు చెల్లింపులో మిన‌హాయింపు ఉంది.

    Railway Jobs: రైల్వేలో 2077 ఉద్యోగాలు.. ప‌దోత‌ర‌గ‌తి పాస్ అయితే చాలు.. ఎటువంటి ప‌రీక్ష లేకుండా ఎంపిక‌

     Step 7 - ద‌ర‌ఖాస్తు ఫాంల‌ను

    డిస్ట్రిక్ట్ కో ఆర్డినేట‌ర్ ఆఫ్ హాస్ప‌ట‌ల్ స‌ర్వీస్

    ప్ర‌కాశం జిల్లా, ఏపీ

    అడ్ర‌స్‌కు పంపాలి.

    Step 8 - ద‌ర‌ఖాస్తుకు  మే 26 , 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Govt Jobs 2022, Health department jobs, Job notification

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు