Home /News /jobs /

JOBS IN AP CONTRACT JOBS IN KURNOOL DISTRICT KNOW ELIGIBILITY AND APPLICATION PROCESS EVK

Jobs in AP: క‌ర్నూలు జిల్లాలో కాంట్రాక్ట్ జాబ్స్‌.. అర్హ‌త‌లు, అప్లికేష‌న్ ప్రాసెస్‌

క‌ర్నూలు జిల్లాలో ఉద్యోగాలు

క‌ర్నూలు జిల్లాలో ఉద్యోగాలు

Jobs in Andhra Pradesh | ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన ప‌రిష‌త్ క‌ర్నూలు జిల్లాలోని వివిధ ఆస్ప‌త్రుల్లో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ప్రాతిప‌దిక‌న ప‌లు పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ నోటిఫికేష‌న్ (Notification) ద్వారా ప‌ది విభాగాల్లో క‌లిపి 17 ఖాళీల‌ను భ‌ర్తీ చేస్తారు. ద‌ర‌ఖాస్తు చేసుకొనే అభ్య‌ర్థుల వ‌య‌సు 18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

ఇంకా చదవండి ...
    ఆంధ్ర‌ప్ర‌దేశ్ (Andhra Pradesh) ప్ర‌భుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన ప‌రిష‌త్ క‌ర్నూలు జిల్లాలోని వివిధ ఆస్ప‌త్రుల్లో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ప్రాతిప‌దిక‌న ప‌లు పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ నోటిఫికేష‌న్ (Notification) ద్వారా ప‌ది విభాగాల్లో క‌లిపి 17 ఖాళీల‌ను భ‌ర్తీ చేస్తారు. ద‌ర‌ఖాస్తు చేసుకొనే అభ్య‌ర్థుల వ‌య‌సు 18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆఫ్‌లైన్ ప‌ద్ధ‌తిలో ఉంటుంది. ఎంపికైన అభ్య‌ర్థుల‌కు పోస్టుల‌ను అనుస‌రించి రూ.15,000 నుంచి రూ.52,000 వ‌ర‌కు వేత‌నం అందిస్తారు. నోటిఫికేష‌న్‌, ద‌ర‌ఖాస్తు స‌మాచారం తెలుసుకోవ‌డానికి అధికారిక వెబ్‌సైట్ https://kurnool.ap.gov.in/notice_category/recruitment/ ను సంద‌ర్శించాల్సి ఉంటుంది. ద‌ర‌ఖాస్తులు అంద‌జేయ‌డానికి ఏప్రిల్ 7, 2022 సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

    Jobs in AP: గుంటూరు జిల్లా ఏపీవీవీపీలో కాంట్రాక్టు ఉద్యోగాలు.. అర్హ‌త‌లు, అప్లికేష‌న్ ప్రాసెస్‌

    పోస్టుల వివ‌రాలు..  











































    పోస్టువేతనంఖాళీలు
    రేడియోగ్రాఫ‌ర్‌లురూ.2,1500 02
    థియేట‌ర్ అసిస్టెంట్‌లురూ.15,000 06
    కౌన్సెల‌ర్‌లురూ. 28,000 03
    ఆడియోమెట్రిషియ‌న్‌రూ. 21,500 01
    బ‌యో మెడిక‌ల్ ఇంజ‌నీర్‌రూ. 52,000 01
    ప్లంబ‌ర్‌రూ. 18,500 02
    ఎల‌క్ట్రిషియ‌న్‌రూ. 18,500 02

    Study Tips: ఎక్కువ సేపు చ‌దువ‌లేక‌పోతున్నారా.. అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!

    ఎంపిక విధానం..

    - ముందుగా అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తారు.



    - అనంత‌రం రిజ‌ర్వేష‌న్‌, మెరిట్ మార్కుల ఆధారంగా అభ్య‌ర్థుల‌ను షార్ట్ లిస్ట్ చేస్తారు.

    - ఎంపికైన వారిని కాంట్రాక్ట్ ఆధారంగా పోస్టింగ్ ఇస్తారు.

    ద‌ర‌ఖాస్తు విధానం..

    Step 1 - ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆఫ్‌లైన్ ప‌ద్ధతిలో ఉంటుంది.

    Jobs in Andhra Pradesh: అనంత‌పురం జిల్లాలో కాంట్రాక్టు ఉద్యోగాలు.. వేత‌నం 17,500.. అప్లికేష‌న్ విధానం

    Step 2 - ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://guntur.ap.gov.in/notice_category/recruitment/ ను సంద‌ర్శించాలి.

    Step3 - నోటిఫికేష‌న్‌ను డౌన్‌లోడ్ చేసుకొని చ‌ద‌వాలి.

    Step 4 - అనంత‌రం నోటిఫికేష‌న్ చివ‌ర‌న ఉన్న ద‌ర‌ఖాస్తు ఫాంను డౌన్‌లోడ్ చేసుకొని

    Step 5 - ద‌ర‌ఖాస్తుకు అవ‌స‌ర‌మైన డాక్యుమెంట్ల‌ను జ‌త‌చేసి ఫాం నింపాలి.

    Step 6 - ఓసీ అభ్య‌ర్థులు రూ. 500, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్య‌ర్థులు రూ. 300 ఫీజు చెల్లించాలి. పీడబ్ల్యూడీ వారికి ఫీజు చెల్లింపులో మిన‌హాయింపు ఉంది.

    Step 7 - ద‌ర‌ఖాస్తు ఫాంల‌ను

    డిస్ట్రిక్ట్ కో ఆర్డినేట‌ర్ ఆఫ్ హాస్ప‌ట‌ల్ స‌ర్వీస్

    జిల్లా ఆస్ప‌త్రి నంద్యాల, క‌ర్నూలు

    అడ్ర‌స్‌కు పంపాలి.

    Step 8 - ద‌ర‌ఖాస్తుకు ఏప్రిల్ 7 , 2022 సాయంత్ర 5 గంటల వ‌ర‌కు అవ‌కాశం ఉంది.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Govt Jobs 2022, Health department jobs, JOBS

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు