Home /News /jobs /

JOBS IN AP CONTRACT JOBS IN GUNTUR DISTRICT APVVP KNOW QUALIFICATIONS APPLICATION PROCESS EVK

Jobs in AP: గుంటూరు జిల్లా ఏపీవీవీపీలో కాంట్రాక్టు ఉద్యోగాలు.. అర్హ‌త‌లు, అప్లికేష‌న్ ప్రాసెస్‌

గుంటూరులో ఉద్యోగాలు

గుంటూరులో ఉద్యోగాలు

Jobs in Andhra Pradesh: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన ప‌రిష‌త్ గుంటూరు జిల్లాలోని వివిధ ఆస్ప‌త్రుల్లో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ప్రాతిప‌దిక‌న ప‌లు పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ నోటిఫికేష‌న్ (Notification) ద్వారా ప‌ది విభాగాల్లో క‌లిపి 17 ఖాళీల‌ను భ‌ర్తీ చేస్తారు.

ఇంకా చదవండి ...
    ఆంధ్ర‌ప్ర‌దేశ్ (Andhra Pradesh) ప్ర‌భుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన ప‌రిష‌త్ గుంటూరు జిల్లాలోని వివిధ ఆస్ప‌త్రుల్లో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ప్రాతిప‌దిక‌న ప‌లు పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ నోటిఫికేష‌న్ (Notification) ద్వారా ప‌ది విభాగాల్లో క‌లిపి 17 ఖాళీల‌ను భ‌ర్తీ చేస్తారు. ద‌ర‌ఖాస్తు చేసుకొనే అభ్య‌ర్థుల వ‌య‌సు 18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆఫ్‌లైన్ ప‌ద్ధ‌తిలో ఉంటుంది. ఎంపికైన అభ్య‌ర్థుల‌కు పోస్టుల‌ను అనుస‌రించి రూ.15,000 నుంచి రూ.52,000 వ‌ర‌కు వేత‌నం అందిస్తారు. నోటిఫికేష‌న్‌, ద‌ర‌ఖాస్తు స‌మాచారం తెలుసుకోవ‌డానికి అధికారిక వెబ్‌సైట్ https://guntur.ap.gov.in/notice_category/recruitment/ ను సంద‌ర్శించాల్సి ఉంటుంది. ద‌ర‌ఖాస్తులు అంద‌జేయ‌డానికి ఏప్రిల్ 3, 2022 సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

    Study Tips: ఎక్కువ సేపు చ‌దువ‌లేక‌పోతున్నారా.. అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!

    పోస్టుల వివ‌రాలు..  











































    పోస్టువేతనంఖాళీలు
    థియేటర్ అసిస్టెంట్రూ.15,00005
    పోస్టుమార్టం అసిస్టెంట్రూ.15,00001
    ల్యాబ్ టెక్నిషియన్రూ. 28,00001
    ఆడియోమెట్రిషియ‌న్‌రూ. 18,50003
    బ‌యో మెడిక‌ల్ ఇంజ‌నీర్‌రూ. 52,00001
    ప్లంబ‌ర్‌రూ. 18,50003
    ఎల‌క్ట్రిషియ‌న్‌రూ. 18,50003

    ఎంపిక విధానం..
    - ముందుగా అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తారు.
    - అనంత‌రం రిజ‌ర్వేష‌న్‌, మెరిట్ మార్కుల ఆధారంగా అభ్య‌ర్థుల‌ను షార్ట్ లిస్ట్ చేస్తారు.
    - ఎంపికైన వారిని కాంట్రాక్ట్ ఆధారంగా పోస్టింగ్ ఇస్తారు.

    Jobs in Telangana: స‌న‌త్‌న‌గ‌ర్ ఈఎస్ఐసీలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు.. అర్హ‌త‌లు, అప్లికేష‌న్ ప్రాసెస్‌



    ద‌ర‌ఖాస్తు విధానం..

    Step 1 - ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆఫ్‌లైన్ ప‌ద్ధతిలో ఉంటుంది.

    Step 2 - ముందుగా అధికారిక వెబ్‌సైట్  https://guntur.ap.gov.in/notice_category/recruitment/ ను సంద‌ర్శించాలి.

    Step3 - Message Boardలో నోటిఫికేష‌న్‌ను డౌన్‌లోడ్ చేసుకొని చ‌ద‌వాలి.

    Step 4 - అనంత‌రం అర్హ‌త ఉన్న పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు కోసం నోటిఫికేష‌న్ చివ‌ర‌న ఫాంను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

    Step 5 - ద‌ర‌ఖాస్తుకు అవ‌స‌ర‌మైన డాక్యుమెంట్ల‌ను జ‌త‌చేసి ఫాం నింపాలి.

    Army Jobs 2022: ఇండియ‌న్ ఆర్మీలో ఉద్యోగ అవ‌కాశాలు.. అర్హతలు, అప్లికేషన్ విధానం

    Step 6 - ఓసీ అభ్య‌ర్థులు రూ. 500, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్య‌ర్థులు రూ. 300 ఫీజు చెల్లించాలి. పీడబ్ల్యూడీ వారికి ఫీజు చెల్లింపులో మిన‌హాయింపు ఉంది.

    Step 7 - ద‌ర‌ఖాస్తు ఫాంల‌ను
    డిస్ట్రిక్ట్ కో ఆర్డినేట‌ర్ ఆఫ్ హాస్ప‌ట‌ల్ స‌ర్వీస్
    గుంటూరు
    అడ్ర‌స్‌కు పంపాలి.

    Step 8 - ద‌ర‌ఖాస్తుకు ఏప్రిల్ 3 , 2022 సాయంత్ర 5 గంటల వ‌ర‌కు అవ‌కాశం ఉంది.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Govt Jobs 2022, Health department jobs, Job notification, JOBS

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు