JOBS IN AP CONTRACT JOBS IN FOUR DISTRICTS ONLY TWO DAYS ARE THE CHANCE TO APPLY KNOW DETAILS EVK
Jobs in Andhra Pradesh: నాలుగు జిల్లాలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఈ రెండు రోజులే చాన్స్
ప్రతీకాత్మక చిత్రం
Jobs in Andhra Pradesh | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్ ప్రకాశం, కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాలోని వివిధ ఆస్పత్రుల్లో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన పలు పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్ ప్రకాశం, కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాలోని వివిధ ఆస్పత్రుల్లో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు సంబంధించి వివరాలు తెలుసుకోని దరఖాస్తు చేసుకోండి.
కడప జిల్లాలో..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్ కడప జిల్లాలోని వివిధ ఆస్పత్రుల్లో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ (Notification) ద్వారా పది విభాగాల్లో కలిపి 15 ఖాళీలను భర్తీ చేస్తారు. దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల వయసు 18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆఫ్లైన్ పద్ధతిలో ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.15,000 నుంచి రూ.52,000 వరకు వేతనం అందిస్తారు. నోటిఫికేషన్, దరఖాస్తు సమాచారం తెలుసుకోవడానికి అధికారిక వెబ్సైట్ https://kadapa.ap.gov.in/notice_category/recruitment/ ను సందర్శించాల్సి ఉంటుంది. దరఖాస్తులు అందజేయడానికి ఏప్రిల్ 7, 2022 సాయంత్రం 5 గంటల వరకు అవకాశం ఉంది. (మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి)
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్ నెల్లూరు జిల్లాలోని వివిధ ఆస్పత్రుల్లో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ (Notification) ద్వారా పది విభాగాల్లో కలిపి 20 ఖాళీలను భర్తీ చేస్తారు. దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల వయసు 18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆఫ్లైన్ పద్ధతిలో ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి వేతనం అందిస్తారు. నోటిఫికేషన్, దరఖాస్తు సమాచారం తెలుసుకోవడానికి అధికారిక వెబ్సైట్ https://spsnellore.ap.gov.in/notice_category/recruitment/ ను సందర్శించాల్సి ఉంటుంది. దరఖాస్తులు అందజేయడానికి ఏప్రిల్ 8, 2022 వరకు అవకాశం ఉంది. (మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.