JOBS IN AP 554 POSTS IN APVVP SALARY RS 53500 PER MONTH KNOW QUALIFICATIONS AND APPLICATION PROCESS EVK
Jobs in AP: ఏపీవీవీపీలో 554 పోస్టులు.. వేతనం నెలకు రూ. 53,500.. దరఖాస్తుకు ఒక్కరోజే చాన్స్!
(ప్రతీకాత్మక చిత్రం)
Jobs in Andhra Pradesh | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమశాఖ విభాగంలో ఏపీ వైద్య విధాన పరిషత్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఈ శాఖలో 554 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ ఖాళీలను భర్తీ చేస్తారు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమశాఖ (Department of Health and Family Welfare) విభాగంలో ఏపీ వైద్య విధాన పరిషత్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ (Notification) ద్వారా ఈ శాఖలో 554 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ (Civil Asst. Surgeon) ఖాళీలను భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థుల వయసు జూలై 1, 2021 నాటికి 42 ఏళ్లు మించకూడదు. దరఖాస్తు పక్రియ ఆన్లైన్ పద్ధతిలో ఉంటుంది. నోటిఫికేషన్ వివరాలు.. దరఖాస్తు విధానం కోసం అధికారిక వెబ్సైట్ http://hmfw.ap.gov.in/index.aspx ను సందర్శించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 12, 2022 వరకు అవకాశం ఉంది.
ఎంపిక విధానం..
- అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పిస్తారు.
- వాటిలో పీజీ డిప్లమాలో సాధించిన మెరిట్ మార్కులు, సర్వీస్ వెయిటేజ్, ఇతర వివరాల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం..
- దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లో ఉంటుంది.
- దరఖాస్తు హార్డ్ కాపీని భవిష్యత్ అవసరాల కోసం డౌన్లోడ్ చేసుకోవాలి.
- దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 12, 2022 వరకు అవకాశం ఉంది.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.