ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (Employees' State Insurance Corporation) లో పలు రీజియన్‌లలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (Notification) విడుదల అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రీజియన్‌కు సంబంధించి అప్రర్ డివిజన్ క్లర్క్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, స్టనోగ్రఫర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి గరిష్ట వయసు 27 సంవత్సరాలుగా నోటిఫికేషన్‌లో తెలిపారు. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్ పద్ధతిలో ఉంటుంది. దరఖాస్తులు జనవరి 15, 2022న ప్రారంభమై ఫిబ్రవరి 15, 2022న ముగుస్తుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.25,000 నుంచి రూ.56,000 వరకు వేతనం అందిస్తారు. నోటఫికేషన్ వివరాలు, దరఖాస్తు ప్రక్రియ కోసం అధికారిక వెబ్‌సైట్ https://www.esic.nic.in/recruitments ను సందర్శించాల్సి ఉంటుంది.
పోస్టుల వివరాలు.. అర్హతలు
పోస్టు | అర్హతలు | ఖాళీలు |
స్టనోగ్రఫర్ | పదోతరగతి చదివి ఉండాలి. ఇంగ్లీష్ హిందీఓ టైపింగ్ వచ్చి ఉండాలి. | 02 |
అప్పర్ డివిజన్ క్లర్క్ | గుర్తింపు పొందిన యూనివర్సిటీలో డిగ్రీచేసి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. | 07 |
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ | గుర్తింపు పొందిన బోర్డులో పదోతరగతి చదవి ఉండాలి. | 26 |
Jobs in IPR: ఐపీఆర్‌లో అసిస్టెంట్ ఉద్యోగాలు.. జీతం రూ.20,000.. అప్లికేషన్ ప్రాసెస్
ఎంపిక విధానం..
Step 1: ముందగా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు.
Step 2: అనంతరం రాత పరీక్ష నిర్వహిస్తారు.
Step 3: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు.
Step 4: వీటిలో ఉత్తీర్ణులైన వారికి పోస్టింగ్ ఇస్తారు.
ESIC Recruitment 2021: ఈఎస్ఐసీలో 1,120 ఉద్యోగాలు.. జీతం రూ.56,100.. అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్
దరఖాస్తు విధానం..
Step 1: దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్ పద్ధతిలో జరుగుతుంది.
Step 2: ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://www.esic.nic.in/recruitments ను సందర్శించాలి.
Step 3: అనంతరం RO Hyderabad విభాగంలో నోటిఫికేషన్ చదవాలి. (నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి)
Step 4: అర్హతలు ఉన్నవారు అనంతరం అప్లై ఆన్‌లైన్‌లోకి వెళ్లి దరఖాస్తుకు అవసరమైన సమాచారం అందించాలి.
RRB Group D Exam: రైల్వే గ్రూప్-డీ ప్రిపేర్ అవుతున్నారా.. సెలబస్ అండ్ స్టడీ ప్లాన్ వివరాలు!
Step 5: దరఖాస్తు పూర్తయిన అనంతరం రూ.500 పరీక్ష ఫీజు చెల్లించాలి.
Step 6: అప్లికేషన్ పూర్తయిన తరువాత సబ్‌మిట్ (Submit) చేయాలి.
Step 7: దరఖాస్తు ఫాం ఒక కాపీని ప్రింట్ తీసుకొని దాచుకోవాలి.
Step 8: దరఖాస్తులు జనవరి 15, 2022న ప్రారంభం అవుతాయి.
Step 9: దరఖాస్తుకు ఫిబ్రవరి 15, 2022 వరకు అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Govt Jobs 2021, Job notification, JOBS