JOBS IN ANDHRA PRADESH ONLY THREE DAYS TO APPLY FOR 356 POSTS IN WOMEN AND CHILD DEVELOPMENT DEPARTMENT KNOW DETAILS EVK
Jobs in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్లో 365 ఉద్యోగాలు.. దరఖాస్తుకు మూడు రోజులే అవకాశం
అనంతపురంలో ఉద్యోగాలు
Anganwadi Jobs: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మహిళా, శిశు అభివృద్ధి సంస్థ అనంతపురం (Anantapur) జిల్లాలో 16 ఐసీడీఎస్ ప్రాజెక్టులో పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. మొత్తం 365 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల దరఖాస్తుకు డిసెంబర్ 16, 2021 వరకు అవకాశం ఉంది.
అంగన్వాడీ (Anganwadi) కార్యకర్త , మినీ అంగన్వాడీ కార్యకర్త, అంగన్వాడీ సహాయకురాలు ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ (Application Process) పూర్తిగా ఆఫ్లైన్లో ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు పోస్టుల ఆధారంగా రూ.7,000, రూ. 11,500 నెలవారీ వేతనం చెల్లిస్తారు. దరఖాస్తు విధానం, నోటిఫికేషన్ కోసం అధికారిక వెబ్సైట్ https://ananthapuramu.ap.gov.in/ ను సందర్శించాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి డిసెంబర్ 16, 2021 వరకు అవకాశం ఉంది.
ముఖ్యమైన సమాచారం..
పోస్టుల సంఖ్య
365
అర్హతలు
అంగన్వాడీ (Anganwadi) కార్యకర్త , మినీ అంగన్వాడీ కార్యకర్త, అంగన్వాడీ సహాయకురాలు పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి పదోతరగతి పాసై ఉండాలి. కచ్చితంగా వివాహిత అయి ఉండాలి. అభ్యర్థి స్థానికంగా ఉండాలి.
వయోపరిమితి
జూలై 1, 2021 నాటికి అభ్యర్థి వయసు 21 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
Step 8 : దరఖాస్తులను అందించేందుకు వివరాల కోసం సీడీపీఓ కార్యాలయాన్ని సందర్శించాలి.
Step 9 : దరఖాస్తుకు డిసెంబర్ 16, 2021 వరకు అవకాశం ఉంది.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.