JOBS IN ANDHRA PRADESH OBS IN NELLORE GGH SLECTION WITHOUT EXAMINATION KNOW ELIGIBILITY AND APPLICATION PROCESS EVK
Jobs in Andhra Pradesh: నెల్లూరు జీజీహెచ్లో ఉద్యోగాలు.. పరీక్ష లేకుండానే ఎంపిక.. అర్హతలు అప్లికేషన్ విధానం
(ప్రతీకాత్మక చిత్రం)
Jobs in Andhra Pradesh | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. నెల్లూరు జిల్లాలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో కాంట్రాక్టు ప్రాతిపదినక పలు విభాగాల పోస్టులను ఈ నోటిఫికేషన్ (Notification) ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. నెల్లూరు జిల్లాలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో కాంట్రాక్టు ప్రాతిపదినక పలు విభాగాల పోస్టులను ఈ నోటిఫికేషన్ (Notification) ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అన్ని విభాగాల్లో కలిపి మొత్తం 20 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థికి గరిష్ట వయసు 42 ఏళ్లు మించి ఉండకూడదు. దరఖాస్తు ప్రక్రియ పూర్తి ఆఫ్లైన్లో ఉంటుంది. ఎటువంటి పరీక్ష లేకుండా మెరిట్, అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ప్రక్రియ, నోటిఫికేషన్ వివరాల కోసం అధికారిక వెబ్సైట్ https://spsnellore.ap.gov.in/ ను సందర్శించాల్సి ఉంటుంది. దరఖాస్తుకు ఏప్రిల్ 13, 2022 వరకు అవకాశం ఉంది.
అర్హతలు..
ఆయా పోస్టులను అనుసరించి పదో తరగతి నుంచి సంబంధి పోస్టులకు అవసరమైన విభాగాల్లో డిప్లొమా, బీఎస్సీ చేసి ఉండాలి. కొన్ని పోస్టులకు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. కచ్చితంగా ఏపీ పారా మెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉండాలి. అభ్యర్థి వయసు 42 ఏళ్లు మించి ఉండకూడదు.
ఎంపిక విధానం..
- ముందుగా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు.
- మెరిట్, అర్హతలు, అనుభవ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
Ste[ 8 - దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ 13, 2022 వరకు అవకాశం ఉంది.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.