Home /News /jobs /

JOBS IN ANDHRA PRADESH LAST CHANCE FOR THOSE FROM THESE DISTRICTS APPLY FOR JOBS KNOW QUALIFICATIONS EVK

Jobs in Andhra Pradesh: ఈ జిల్లాల వారికి లాస్ట్ చాన్స్‌.. ఉద్యోగాల‌కు అప్లే చేసుకోండి.. అర్హ‌త‌లు ఇవే!

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Jobs in Andhra Pradesh | ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ప‌లు జిల్లాలో ప‌లు విభాగాల్లో పోస్టు భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌లు విడుద‌ల చేసింది. ఈ ఉద్యోగాల‌కు సంబంధించిన అప్లికేష‌న్ ప్రాసెస్ (Application Process)  ఒక‌టి, రెండు రోజుల్లో ముగియ‌నుంది.

ఇంకా చదవండి ...
    ఆంధ్ర‌ప్ర‌దేశ్ (Andhra Pradesh) ప్ర‌భుత్వం ప‌లు జిల్లాలో ప‌లు విభాగాల్లో పోస్టు భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌లు విడుద‌ల చేసింది. ఈ ఉద్యోగాల‌కు సంబంధించిన అప్లికేష‌న్ ప్రాసెస్ (Application Process)  ఒక‌టి, రెండు రోజుల్లో ముగియ‌నుంది. ఈ నేప‌థ్యంలో అర్హ‌త‌లు, ఆస‌క్తిగ‌ల అభ్య‌ర్థులు ఈ పోస్టుకు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆఫ్‌లైన్ ప‌ద్ధ‌తిలో ఉంటుంది. అప్లికేష‌న్ ప్రాసెస్‌, అధికారిక వెబ్‌సైట్ సంబంధిత స‌మ‌చారం కోసం చ‌ద‌వండి.

    శ్రీ‌కాకుళం జిల్లాలో..


    ఆంధ్ర‌ప్ర‌దేశ్ (Andhra Pradesh)  ప్ర‌భుత్వం శ్రీ‌కాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాల‌యం (District Medical and Health Officer)లో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల అయ్యింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్ ప‌ద్ధ‌తిలో ప‌లు పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. లాస్ట్ గ్రేడ్ స‌ర్వీస్ పోస్టుల‌కు అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తున్నారు. ఈ పోస్టుల ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆఫ్‌లైన్ ప‌ద్ధ‌తిలో ఉంటుంది. ఈ పోస్టులకు ద‌ర‌ఖాస్తు ప‌ద్ధ‌తి, నోటిఫికేష‌న్ (Notification) వివ‌రాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://srikakulam.ap.gov.in/ ను సంద‌ర్శించాల్సి ఉంటుంది. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి జ‌న‌వ‌రి 5, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.   (పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి)

    DSSSB Recruitment: డీఎస్ఎస్ఎస్‌బీలో 691 ఉద్యోగాలు.. అర్హ‌త‌లు, అప్లికేష‌న్ ప్రాసెస్‌!



    కృష్ణ జిల్లాలో ఉద్యోగాలు..


    ఆంధ్ర‌ప్ర‌దేశ్ (Andhra Pradesh) ప్ర‌భుత్వం కృష్ణ జిల్లా విజ‌య‌వాడలోని జ‌న‌ర‌ల్ ఆస్ప‌త్రి (General Hospital) లో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల అయ్యింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్ ప‌ద్ధ‌తిలో ప‌లు పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఆప్తాల్మిక్ టెక్నీషియ‌న్‌, ఆక్యుపేష‌న‌ల్ థెర‌పిస్ట్‌, ఆడియో టెక్నిషియ‌న్‌ పోస్టుల‌కు అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తున్నారు. ఈ పోస్టుల ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆఫ్‌లైన్ ప‌ద్ధ‌తిలో ఉంటుంది. ఈ పోస్టులకు ద‌ర‌ఖాస్తు ప‌ద్ధ‌తి, నోటిఫికేష‌న్ (Notification) వివ‌రాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://krishna.ap.gov.in/ ను సంద‌ర్శించాల్సి ఉంటుంది. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి జ‌న‌వ‌రి 4, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.  (పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి)

    New Course: ఎలక్ట్రిక్ వెహికల్స్‌లో మాస్టర్స్ డిగ్రీ.. కొత్త కోర్సు ప్రారంభించిన ఐఐటీ మ‌ద్రాస్‌!



    విజ‌య‌న‌గ‌రం జిల్లాలో..


    ఆంధ్ర‌ప్ర‌దేశ్ (Andhra Pradesh) ప్ర‌భుత్వం విజ‌య‌నగ‌రం జిల్లా  పార్వ‌తీపురం ఆర్‌టీపీసీఆర్ ల్యాబ్‌లో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల అయ్యింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా రీసెర్చ్ అసిస్టెంట్‌, రిసెర్చ్ అసిస్టెంట్‌, ల్యాబ్ టెక్నిషియ‌న్‌, డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్‌, మ‌ల్టీ టాస్కింగ్ స్టాఫ్‌, పోస్టుల‌కు అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తున్నారు. ఈ పోస్టుల ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆఫ్‌లైన్ ప‌ద్ధ‌తిలో ఉంటుంది. ఈ పోస్టులకు ద‌ర‌ఖాస్తు ప‌ద్ధ‌తి, నోటిఫికేష‌న్ (Notification) వివ‌రాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://vizianagaram.ap.gov.in/ ను సంద‌ర్శించాల్సి ఉంటుంది. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి జ‌న‌వ‌రి 4, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది. (పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి)
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Job notification, Krishna District, Srikakulam, Vijayanagaram

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు