JOBS IN ANDHRA PRADESH JOBS IN PRAKASHAM DISTRICT MEDICAL AND HEALTH DEPARTMENT KNOW QUALIFICATIONS EVK
Jobs in Andhra Pradesh: ప్రకాశం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖలో ఉద్యోగాలు..అర్హతలు ఇవే!
ప్రకాశం జిల్లా ఉద్యోగాలు
Jobs in Andhra Pradesh | ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్యశాఖ విభాగం ప్రకాశం జిల్లాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ (Notification) ద్వారా ఫిజియోథెరపిస్ట్, ఆపరేషన్ థియేటర్ టెక్నిషియన్ (ఓటీ టెక్నిషియన్) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి జనవరి 28, 2022 వరకు అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) వైద్య, ఆరోగ్యశాఖ విభాగం ప్రకాశం జిల్లాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ (Notification) ద్వారా ఫిజియోథెరపిస్ట్, ఆపరేషన్ థియేటర్ టెక్నిషియన్ (ఓటీ టెక్నిషియన్) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల దరఖాస్తుకు అభ్యర్థి వయసు 18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు పోస్టు ఆధారంగా నెలకు రూ. 12,000 నుంచి రూ.19,101 వేతనం చెల్లిస్తారు. దరఖాస్తు చేసుకొన్న వారికి ఎటువంటి రాత పరీక్ష లేకుండా అకాడమిక్ మెరిట్ (Academic Merit), రిజర్వేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. ఈ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ ఆఫ్లైన్లో ఉంటుంది. దరఖాస్తు (Application) చేసుకోవడానికి జనవరి 28, 2022 వరకు అవకాశం ఉంది. ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ https://prakasam.ap.gov.in/ ను సందర్శించాల్సి ఉంటుంది.
గుర్తింపు పొందిన యూనివర్సిటీలో ఫిజియోథెరపీలో బ్యాచ్లర్ డిగ్రీ చేసి ఉండాలి.
రూ.19,101
ఓటీ టెక్నిషియన్
05
ఇంటర్మీడియట్, డిప్లమా ఇన్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీలో ఉత్తీర్ణత సాధించాలి. అంతే కాకుండా ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉండాలి.
రూ. 12,000
ఎంపిక విధానం..
- అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు.
- అకాడమిక్ మెరిట్ ఆధారంగా దరఖాస్తులను ఎంపిక చేస్తారు.
- రిజర్వేషన్ విధానం ఆధారంగా అభ్యర్థులను తుది ఎంపిక చేస్తారు.
Step 10: దరఖాస్తు చేసుకోవడానికి జనవరి 28, 2022 వరకు అవకాశం ఉంది.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.