Home /News /jobs /

JOBS IN ANDHRA PRADESH JOBS IN NELLORE DISTRICT SELECTION THROUGH DIRECT SPEECH INTERVIEW KNOW QUALIFICATIONS EVK

Jobs in Andhra Pradesh: నెల్లూరు జిల్లాలో ఉద్యోగాలు.. ప‌రీక్ష లేకుండా ఇంటర్వ్యూలు.. అర్హ‌త‌లు ఇవే!

నెల్లూరు జిల్లాలో ఉద్యోగాలు

నెల్లూరు జిల్లాలో ఉద్యోగాలు

Jobs in Andhra Pradesh | ఆంధ్ర‌ప్ర‌దేశ్ నెల్లూరు జిల్లా వైద్య ఆరోగ్య‌శాఖ కార్యాల‌యంలో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ (Notification)విడుద‌ల అయ్యింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా జిల్లా ఎపిడిమియాల‌జిస్ట్‌, ఓటీ టెక్నిషియ‌న్‌, డెంట‌ల్ హైజీనిస్ట్‌ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. కేవ‌లం వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూల ద్వారా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు.

ఇంకా చదవండి ...
    ఆంధ్ర‌ప్ర‌దేశ్ నెల్లూరు జిల్లా వైద్య ఆరోగ్య‌శాఖ కార్యాల‌యం (District Medical and Health Organization)లో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ (Notification)విడుద‌ల అయ్యింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా జిల్లా ఎపిడిమియాల‌జిస్ట్‌, ఓటీ టెక్నిషియ‌న్‌, డెంట‌ల్ హైజీనిస్ట్‌ పోస్టుల‌ను కాంట్రాక్టు ప‌ద్ధ‌తిలో భ‌ర్తీ చేయ‌నున్నారు. ఎటువంటి రాత ప‌రీక్ష లేకుండా కేవ‌లం వాక్ఇన్ ఇంట‌ర్వ్యూల ద్వారా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. . ఈ పోస్టుల ఇంట‌ర్వ్యూల‌కు వెళ్ల‌డానికి అభ్య‌ర్థి వ‌య‌సు 18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మ‌ధ్య ఉండాల‌ని నోటిఫికేష‌న్‌లో పేర్కొన్నారు. ఎంపికైన అభ్య‌ర్థుల‌కు పోస్టుల వారీగా నెల‌కు రూ.12,000 నుంచి రూ.70,000ల వేతనం అందిస్తారు. ఇంట‌ర్వ్యూ తేదీలు జ‌న‌వ‌రి 20, 2022 నుంచి జ‌న‌వ‌రి 27, 2022 వ‌ర‌కు ఉంటాయి. ప్ర‌తీ రోజు ఉద‌యం 10.30 నుంచి సాయంత్రం 5.00 మ‌ధ్య ఇంట‌ర్వ్యూలు (interviews) జ‌రుగుతాయి. నోటిఫికేష‌న్, సంబంధిత పూర్తి వివ‌రాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://spsnellore.ap.gov.in/ ను సంద‌ర్శించండి.

    Jobs in Andhra Pradesh: విజ‌య‌న‌గ‌రం జిల్లా డీఎంహెచ్ఓలో 55 ఉద్యోగాలు.. అర్హ‌త‌లు, అప్లికేష‌న్ ప్రాసెస్‌

    పోస్టుల వివ‌రాలు..























    పోస్టుఅర్హ‌త‌లువేత‌నం
    జిల్లా ఎపిడిమియాల‌జిస్ట్‌గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీలో ఎంబీబీఎస్‌, ఎండీ, డీఎస్‌లో ఉత్తీర్ణత క‌లిగి ఉండాలి.రూ.70,000
    ఓటీ టెక్నిషియ‌న్‌ఇంట‌ర్మీడియ‌ట్‌, ఆప‌రేష‌న్ థియేట‌ర్ టెక్నీషియ‌న్‌లో డిప్ల‌మా చేసి ఉండాలి. ఏపీ పారామెడిక‌ల్ బోర్డులో రిజిస్ట‌ర్ అయి ఉండాలి.రూ.12,000
    డెంట‌ల్ హైజీనిస్ట్‌ఇంట‌ర్మీడియ‌ట్, సంబంధిత రంగంలో డిప్ల‌మా చేసి ఉండాలి. స్టేట్ డెంట‌ల్ కౌన్సిల్‌లో రిజిస్ట‌ర్ అయి ఉండాలి.రూ.15,750

    RRB Group D Exam: రైల్వే జాబ్ మీ క‌ల‌నా.. సెల‌బ‌స్ అండ్ 30 డేస్ ప్రిప‌రేష‌న్ ప్లాన్!

    ఎంపిక విధానం..
    - ఎటువంటి ద‌ర‌ఖాస్తులు అవ‌స‌రం లేదు.
    - పోస్టుల‌కు సంబంధించిన ధ్రువ‌ప‌త్రాల‌తో ఇంట‌ర్వ్యూ తేదీల్లో స‌మ‌యానికి హాజ‌రు అవ్వాలి.
    - ఇంట‌ర్వ్యూలో ఉత్తీర్ణ‌త సాధించిన వారికి ఉద్యోగం ఇస్తారు.



    ద‌ర‌ఖాస్తు విధానం..

    Step 1: అభ్య‌ర్థి ఎటువంటి ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సిన అవ‌స‌రం లేదు.

    Step 2: ముందుగా అధికారిక జిల్లా వెబ్‌సైట్ https://spsnellore.ap.gov.in/ ను సంద‌ర్శించాలి.

    Step 3: అన‌త‌రం Notices ఆప్ష‌న్‌లోని Recruitment లోకి వెళ్లాలి.

    Step 4: నోటిఫికేష‌న్‌ను పూర్తిగా చ‌ద‌వాలి. (నోటిఫికేష‌న్ కోసం క్లిక్ చేయండి)

    Step 5: నోటిఫికేష‌న్‌లో ఇంట‌ర్వ్యూ తేదీలు స‌మ‌యం ఇస్తారు.

    Step 6: నోటిఫికేష‌న్‌లో ఇంట‌ర్వ్యూకి కావాల్సిన ధ్రువ‌ప‌త్రాల లిస్ట్‌ను స‌మ‌కూర్చుకోవాలి.

    Step 7: అన్ని ధ్రువ‌ప‌త్రాల‌తో నిర్దేషిత స‌మ‌యంలో ఇంట‌ర్వ్యూకి హాజ‌రు అవ్వాల్సి ఉంటుంది.

    GMRC Recruitment: మెట్రోలో 118 కాంట్రాక్టు ఉద్యోగాలు.. అప్లికేష‌న్‌కు వారం రోజులు చాన్స్‌.. అర్హ‌త‌లు ఇవే!

    Step 8: ఇంట‌ర్వ్వూకి తీసుకెళ్లాల్సిన ప్ర‌ధాన స‌ర్టిఫికెట్లు.

    - ప‌ది, ఇంట‌ర్ స్ట‌డీ స‌ర్టిఫికెట్లు
    - పోస్టుకు అవ‌స‌ర‌మైన విద్యార్హ‌త అర్హ‌త ధ్రువ‌ప‌త్రాలు
    - అవ‌స‌రం అయిన వారికి కుల‌, పీహెచ్, స్పోర్ట్స్ కోటా ధ్రువీక‌ర‌ణ ప‌త్రాలు

    Step 9: ఇంట‌ర్వ్యూలు నెల్లూరు డీఎంహెచ్ఓ కార్యాల‌యంలో జ‌రుగుతాయి.

    Step 10: ఇంట‌ర్వ్యూ తేదీలు జ‌న‌వరి 20, 2022 నుంచి జ‌న‌వ‌రి 27, 2022 వ‌ర‌కు
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Govt Jobs 2022, Health department jobs, Job notification

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు