Home /News /jobs /

JOBS IN ANDHRA PRADESH JOBS IN KADAPA DISTRICT SALARY RS 15000 ELIGIBILITY AND APPLICATION PROCESS EVK

Jobs in Andhra Pradesh: క‌డ‌ప జిల్లాలో ఉద్యోగాలు.. వేత‌నం రూ.15,000, అర్హ‌త‌లు అప్లికేష‌న్ ప్రాసెస్‌

క‌డ‌ప జిల్లాలో ఉద్యోగాలు

క‌డ‌ప జిల్లాలో ఉద్యోగాలు

Jobs in Andhra Pradesh | ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన ప‌రిష‌త్ (ఏపీవీవీపీ)కు చెందిన క‌డ‌ప జిల్లాలోని వివిధ ఆస్ప‌త్రుల్లో ఒప్పంద ప్రాతిప‌దిక‌న ప‌లు పోస్టులు భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ పోస్టుల ద‌ర‌ఖాస్తుకు జ‌న‌వ‌రి 31, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

ఇంకా చదవండి ...
    ఆంధ్ర‌ప్ర‌దేశ్ (Andhra Pradesh) ప్ర‌భుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన ప‌రిష‌త్ (ఏపీవీవీపీ)కు చెందిన క‌డ‌ప జిల్లాలోని వివిధ ఆస్ప‌త్రుల్లో ఒప్పంద ప్రాతిప‌దిక‌న ప‌లు పోస్టులు భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ నోటిఫికేష‌న్ (Notification)  ద్వారా ఫార్మాసిస్ట్‌, ల్యాబ్ టెక్నీషియ‌న్ (Lab Technician), రేడియోగ్రాఫ‌ర్‌, థియేట‌ర్ అసిస్టెంట్లు, ఆప్తాల్మిక్ అసిస్టెంట్లు, డెంట‌ల్ టెక్నిషియ‌న్‌లు వంటి ప‌లు పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ పోస్టుకు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి గ‌రిష్ట వ‌య‌సు 42 ఏళ్లుగా నోటిఫికేష‌న్‌లో పేర్కొన్నారు. ఎంపికైన అభ్య‌ర్థుల‌కు పోస్టుల ఆధారంగా నెల‌కు రూ12,000 నుంచి రూ.28,000 వ‌ర‌కు వేత‌నం అందిస్తారు. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆఫ్‌లైన్ ప‌ద్ధ‌తిలో ఉంటుంది. ఈ పోస్టుల‌కు ద‌రఖాస్తు చేసుకోవ‌డానికి జ‌న‌వ‌రి 31, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది. నోటిఫికేష‌న్ వివ‌రాలు, ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ కోసం అధికారిక వెబ్‌సైట్ https://kadapa.ap.gov.in/ ను సంద‌ర్శించాల్సి ఉంటుంది.

    Jobs in Andhra Pradesh: నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. రెవెన్యూశాఖ‌లో 670 పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు గ‌డువు పొడ‌గింపు

    పోస్టుల వివ‌రాలు.. వేత‌నాలు


























































    పోస్టు పేరుఖాళీలువేత‌నం
    ఫార్మాసిస్ట్‌01రూ.28,000
    ల్యాబ్ టెక్నిషియ‌న్‌01రూ.28,000
    రేడియో గ్రాఫర్‌01రూ.17,500
    థియేట‌ర్ అసిస్టెంట్లు07రూ.12,000
    ఆప్తాల్మిక్ అసిస్టెంట్లు02రూ.17,500
    డెంట‌ల్ టెక్నిషియ‌న్‌లు01రూ.15,000
    ఆడియో మెట్రిషియ‌న్‌02రూ.15,000
    జూనియ‌ర్ అసిస్టెంట్‌01రూ.15,000
    ఆఫీస్ స‌బార్డినేట్02రూ.12,000
    ఎల‌క్ట్రిషియ‌న్‌01రూ.12,000

    అర్హ‌త‌లు

    పోస్టుల ఆధారంగా అభ్య‌ర్థులు ప‌దోత‌ర‌గ‌తి, ఇంట‌ర్మీడియ‌ట్‌, డిప్లొమా (ఎంఎల్‌టీ), బీఫార్మ‌సీ, డీఫార్మ‌సీ ఏదైనా డిగ్రీ, ఎమ్మెస్సీ ఎండీ చేసి ఉండాలి. కొన్ని పోస్టుల‌కు అభ్య‌ర్థుల అనుభ‌వాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకొంటారు.

    Jobs in Hyderabad: హైద‌రాబాద్ ఎన్ఐపీఈఆర్‌లో ఉద్యోగాలు.. అర్హ‌త‌లు, ద‌ర‌ఖాస్తు విధానం

    ఎంపిక విధానం..

    Step 1 :  ముందుగా అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తారు.



    Step 2 :  ద‌ర‌ఖాస్తు చేసుకొన్న అభ్య‌ర్థుల అర్హ‌త‌లు, అనుభ‌వాన్ని ప‌రిశీలించి అభ్య‌ర్థుల‌ను షార్ట్‌లిస్ట్ చేస్తారు.

    Step 3 :  అనంత‌రం రిజ‌ర్వేష‌న్‌, డాక్యుమెంట్ వెరిఫికేష‌న్ పూర్తి చేస్తారు.

    Step 4 :  ఎంపికైన అభ్య‌ర్థుల‌కు పోస్టింగ్ ఇస్తారు.

    ద‌ర‌ఖాస్తు విధానం..

    Step 1 : ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆఫ్‌లైన్ ప‌ద్ధ‌తిలో ఉంటుంది.



    Jobs in Andhra Pradesh: శ్రీ‌కాకుళం డీఎంహెచ్ఓలో ఉద్యోగాలు.. అర్హ‌త‌లు, అప్లికేష‌న్ ప్రాసెస్‌.

    NEET 2022 Study Plan: నీట్-2022 బ‌యాల‌జీ స్ట‌డీ ప్లాన్‌: ఇలా చ‌దివితే 360 మార్కులు ఎక్క‌డికీ పోవు..

    Step 2 : ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://kadapa.ap.gov.in/ ను సంద‌ర్శించాలి.

    Step 3 : అనంత‌రం Notices ఆప్ష‌న్‌లో Recruitment లోకి వెళ్లాలి.

    Step 4 : రిక్రూట్‌మెంట్‌లో నోటిఫికేష‌న్‌చ‌ద‌వాలి. (నోటిఫికేష‌న్ కోసం క్లిక్ చేయండి)

    Step 5 : అర్హ‌త‌లు ప‌రిశీలించుకొని సంబంధిత పోస్టుకు సంబంధించిన అప్లికేష‌న్ ఫాంను https://kadapa.ap.gov.in/notice_category/recruitment/ లింక్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి.

    Step 6 : అప్లికేష‌న్ ఫాంను త‌ప్పులు లేకుండా నింపాలి.

    Step 7 : స‌ంబంధిత అర్హ‌త‌ల డాక్యుమెంట్ల‌ను జ‌త చేయాలి.

    Step 8 : ద‌ర‌ఖాస్తును

    డిస్టిక్ కోఆర్డినేట్ ఆఫ్ హాస్పిట‌ల్ స‌ర్వీసెస్‌,

    ఏపీవీవీపీ, న్యూ క‌లెక్ట‌రేట్‌, క‌డ‌ప

    ఆంధ్ర‌ప్ర‌దేశ్ చిరునామాకు పంపాలి.

    Step 9 : ద‌ర‌ఖాస్తుకు జ‌న‌వ‌రి 31, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Health department jobs, Job notification, JOBS, Kadapa

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు