JOBS IN ANDHRA PRADESH JOBS IN HP COMPANY IN VISAKHAPATNAM SALARY RS 55000 PER MONTH ELIGIBILITY APPLICATION PROCESS EVK
Jobs in Andhra Pradesh: విశాఖపట్నంలో హెచ్‌పీ కంపెనీలో ఉద్యోగాలు.. వేతనం నెలకు రూ.55,000.. అర్హతలు అప్లికేషన్ ప్రాసెస్
(ప్రతీకాత్మక చిత్రం)
Jobs in Andhra Pradesh | ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ విశాఖ రిఫైనరి కింద వివిధ విభాగాల్లో టెక్నిషియన్ పోస్టులను భర్తీ చేస్తుంది.
ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (Hindustan Petroleum Corporation Limited)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ విశాఖ రిఫైనరి కింద వివిధ విభాగాల్లో టెక్నిషియన్ పోస్టులను భర్తీ చేస్తుంది. అన్ని విభాగాల్లో కలిపి 186 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల వయసు ఏప్రిల్ 1, 2022 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లో ఉంటుంది. నోటిఫికేషన్ సమాచారం, అప్లికేషన్ విధానం కోసం అధికారికి వెబ్సైట్ https://www.hindustanpetroleum.com/job-openings ను సందర్శించాల్సి ఉంటుంది. దరఖాస్తుకు మే 21, 2022 వరకు అవకాశం ఉంది.
అర్హతలు..
ఆయా విభాగాల్లో పోస్టులకు సంబంధించిన సబ్జెక్టుల్లో డిప్లొమా, బీఎస్సీ, సైన్స్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత, బాయిలర్ కాంపిటెన్సీ సర్టిఫికెట్, వాలిడ్ హెచ్ఎంవీ లైసెన్స్ కలిగి ఉండాలి.
ఎంపిక విధానం..
- దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థులకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తారు.
- అనంతరం ఎంప్లాయిమెంట్ మెడికల్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
పరీక్ష విధానం..
కంప్యూటర్ బేస్డ్ పరీక్షలో జనరల్ ఆప్టిట్యూడ్/ టెక్నికల్/ ప్రొఫెషనల్ నాలెడ్జ్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. సీబీటీలో అర్హులైన అభ్యర్థులను స్కిల్ టెస్ట్‌కు ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం..
Step 1 - దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లో ఉంటుంది.
Step 7 - దరఖాస్తు చేసుకోవడానికి మే 21, 2022 వరకు అవకాశం ఉంది.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.