ఏపీ హైకోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇలా దరఖాస్తు చేసుకోండి
ప్రతీకాత్మక చిత్రం
Jobs in AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హై కోర్టు(AP High Court) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 55 సివిల్ జడ్జి పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హై కోర్టు పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 55 సివిల్ జడ్జి పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 55 పోస్టులను భర్తీ చేయనుండగా అందులో 18 పోస్టులను మహిళలకు కేటాయించారు. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 2, 2021గా అధికారులు నిర్ణయించారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
అభ్యర్థులు ఇతర వివరాల కోసం http://hc.ap.nic.in/ వెబ్సైట్ ను సందర్శించాలి. అభ్యర్థులకు డిసెంబర్ 1 నాటికి 35 ఏళ్లు మించకూడదని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. దరఖాస్తు ఫీజును రూ. 800గా నిర్ణయించారు. గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, వైజాగ్ లో పరీక్షను నిర్వహించనున్నారు. Official Website
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.