హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Jobs in Andhra Pradesh: నెల్లూరు జిల్లాలో ప్ర‌భుత్వ ఉద్యోగాలు.. అర్హ‌త‌లు, అప్లికేష‌న్ ప్రాసెస్‌

Jobs in Andhra Pradesh: నెల్లూరు జిల్లాలో ప్ర‌భుత్వ ఉద్యోగాలు.. అర్హ‌త‌లు, అప్లికేష‌న్ ప్రాసెస్‌

నెల్లూరు జిల్లాలో ఉద్యోగాలు

నెల్లూరు జిల్లాలో ఉద్యోగాలు

Jobs In Andhra Pradesh | ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి చెందిన నెల్లూరు జిల్లా గూడూరు ఏరియా ఆస్ప‌త్రిలో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల అయ్యింది. ఈ పోస్టుకు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి గ‌రిష్ట వ‌య‌సు 42 ఏళ్లుగా నోటిఫికేష‌న్‌ (Notification) లో పేర్కొన్నారు. ద‌ర‌ఖాస్తుకు డిసెంబ‌ర్ 27, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

ఇంకా చదవండి ...

ఆంధ్ర‌ప్ర‌దేశ్ (Andhra Pradesh) ప్ర‌భుత్వానికి చెందిన నెల్లూరు జిల్లా గూడూరు ఏరియా ఆస్ప‌త్రిలో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల అయ్యింది. ఈ నోటిఫికేష‌న్ (Notification) ద్వారా ఆస్ప‌త్రిలో ల్యాబ్‌లో రీసెర్చ్ అసిస్టెంట్‌, రీసెర్చ్ సైంటిస్ట్, ల్యాబ్ టెక్నీషియ‌న్, డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్‌, మ‌ల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ పోస్టుకు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి గ‌రిష్ట వ‌య‌సు 42 ఏళ్లుగా నోటిఫికేష‌న్‌లో పేర్కొన్నారు. ఎంపికైన అభ్య‌ర్థుల‌కు పోస్టుల ఆధారంగా నెల‌కు రూ12,000 నుంచి రూ.65,000 వ‌ర‌కు వేత‌నం అందిస్తారు. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆఫ్‌లైన్ ప‌ద్ధ‌తిలో ఉంటుంది. ఈ పోస్టుల‌కు ద‌రఖాస్తు చేసుకోవ‌డానికి డిసెంబ‌ర్ 27, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది. నోటిఫికేష‌న్ వివ‌రాలు, ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ కోసం అధికారిక వెబ్‌సైట్ https://spsnellore.ap.gov.in/ ను సంద‌ర్శించాల్సి ఉంటుంది.

పోస్టుల వివ‌రాలు.. అర్హ‌త‌లు

పోస్టు పేరుపోస్టుల సంఖ్య
రీసెర్చ్ సైంటిస్ట్01
రీసెర్చ్ అసిస్టెంట్‌02
ల్యాబ్ టెక్నీషియ‌న్06
డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్‌03
మ‌ల్టీ టాస్కింగ్ స్టాఫ్03


అర్హ‌త‌లు

పోస్టుల ఆధారంగా అభ్య‌ర్థులు ప‌దోత‌ర‌గ‌తి, ఇంట‌ర్మీడియ‌ట్‌, డిప్లొమా (ఎంఎల్‌టీ), ఏదైనా డిగ్రీ, ఎమ్మెస్సీ ఎండీ చేసి ఉండాలి. కొన్ని పోస్టుల‌కు అభ్య‌ర్థుల అనుభ‌వాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకొంటారు.

Jobs in Andhra Pradesh: అనంత‌పురంలో ఉద్యోగాలు.. జీతం రూ. 19,019.. అప్లికేష‌న్‌కు రెండు రోజులే చాన్స్‌!


ఎంపిక విధానం..

Step 1 :  ముందుగా అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తారు.

Step 2 :  ద‌ర‌ఖాస్తు చేసుకొన్న అభ్య‌ర్థుల అర్హ‌త‌లు, అనుభ‌వాన్ని ప‌రిశీలించి అభ్య‌ర్థుల‌ను షార్ట్‌లిస్ట్ చేస్తారు.

Step 3 :  అనంత‌రం రిజ‌ర్వేష‌న్‌, డాక్యుమెంట్ వెరిఫికేష‌న్ పూర్తి చేస్తారు.

Step 4 :  ఎంపికైన అభ్య‌ర్థుల‌కు పోస్టింగ్ ఇస్తారు.

Visakhapatnam: విశాఖ‌ప‌ట్నంలో 59 ఫార్మాసిస్ట్ ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తుకు రెండు రోజులే చాన్స్‌


ద‌ర‌ఖాస్తు విధానం..

Step 1 : ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆఫ్‌లైన్ ప‌ద్ధ‌తిలో ఉంటుంది.

Step 2 : ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://spsnellore.ap.gov.in/ ను సంద‌ర్శించాలి.

Step 3 : అనంత‌రం Notices ఆప్ష‌న్‌లో Recruitment లోకి వెళ్లాలి.

Bisleri Mobile App: బిస్లెరీ నుంచి సరికొత్త మొబైల్ యాప్ లాంచ్.. వాటర్​ క్యాన్​ బుక్ చేసుకున్న 24 గంటల్లోపు డోర్​​ డెలివరీ


Step 4 : రిక్రూట్‌మెంట్‌లో నోటిఫికేష‌న్‌చ‌ద‌వాలి. (నోటిఫికేష‌న్ కోసం క్లిక్ చేయండి)

Step 5 : అర్హ‌త‌లు ప‌రిశీలించుకొని సంబంధిత పోస్టుకు సంబంధించిన అప్లికేష‌న్ ఫాంను https://spsnellore.ap.gov.in/notice_category/recruitment/ లింక్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి.

Step 6 : అప్లికేష‌న్ ఫాంను త‌ప్పులు లేకుండా నింపాలి.

Step 7 : స‌ంబంధిత అర్హ‌త‌ల డాక్యుమెంట్ల‌ను జ‌త చేయాలి.

Step 8 : ద‌ర‌ఖాస్తును

The Medical Superintendent,

Area Hospital, Gudur,

S.P.S.R. Nellore District,

C/o. Beside Old APSRTC Bus Stand,

Hospital road,

Gudur, S.P.S.R. Nellore District. చిరునామాకు పంపాలి.

Step 9 : ద‌ర‌ఖాస్తుకు డిసెంబ‌ర్ 27, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

First published:

Tags: Andhra Pradesh, Govt Jobs 2021, Health department jobs, Job notification, JOBS

ఉత్తమ కథలు