ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన కడప జిల్లాలోని జనరల్ ఆస్పత్రిలో పలు పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ (Notification) విడుదల చేసింది. అందులో భాగంగా కడప జిల్లాలో ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో ఫిజిషియనిస్ట్, రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్, ఫార్మసిస్ట్ తదితర ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల వయసు 42 ఏళ్లు మించి ఉండకూడదు. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆఫ్‌లైన్ పద్ధతిలోనే ఉంటుంది. నోటిఫికేషన్ వివరాలు, దరఖాస్తు ప్రక్రియ కోసం అధికారిక వెబ్‌సైట్ https://kadapa.ap.gov.in/notice_category/recruitment/ ను సందర్శించాల్సి ఉంటుంది. దరఖాస్తుకు జూన్ 15, 2022 వరకు అవకాశం ఉంది.
పోస్టుల వివరాలు..
పోస్టు పేరు | వేతనం | ఖాళీలు |
రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్ | రూ. 37,100 | 01 |
ఫిజిసిస్ట్ | రూ. 37,100 | 01 |
ఈసీజీ టెక్నిషియన్ | రూ. 17,500 | 01 |
ఫార్మసిస్ట్ | రూ. 28,000 | 01 |
ల్యాబ్ టెక్నిషియన్ | రూ. 28,000 | 01 |
డీఆర్ఏ | రూ. 12,000 | 01 |
ఎంపిక విధానం..
- ముందుగా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు.
- అభ్యర్థుల మెరిట్, అనుభవం, రిజర్వేషన్ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం..
Step 1 - దరఖాస్తు ప్రక్రియ ఆఫ్‌లైన్ పద్ధతిలో ఉంటుంది.
Step 2 - ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://kadapa.ap.gov.in/notice_category/recruitment/ ను సందర్శించాలి.
Step 3 - నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవాలి.
Step 4 - అనంతరం నోటిఫికేషన్ చివర అప్లికేషన్ ఫాంను డౌన్లోడ్ చేసుకోవాలి.
Step 5 - తప్పులు లేకుండా ఫాం నింపాలి.
Step 6 - అవసరమైన దరఖాస్తులను జత చేయాలి.
Step 7 - రూ. 300 దరఖాస్తు రుసం నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా చెల్లించాలి.
Step 8 - దరఖాస్తు కాపీని
సూపరింటెండెంట్ కార్యాలయం, కడప, జనరల్ ఆస్పత్రి, ఆంధ్రప్రదేశ్.
అడ్రస్‌కు సరైన సమయంలో పంపాలి.
Step 9 - దరఖాస్తుకు జూన్ 15, 2022 వరకు అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Govt Jobs 2022, Health department jobs, Job notification, JOBS