హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Jobs in Andhra Pradesh: విశాఖ‌ప‌ట్నం ఏపీవీవీపీలో కాంట్రాక్టు ఉద్యోగాలు.. అర్హ‌త‌లు, అప్లికేష‌న్ ప్రాసెస్‌

Jobs in Andhra Pradesh: విశాఖ‌ప‌ట్నం ఏపీవీవీపీలో కాంట్రాక్టు ఉద్యోగాలు.. అర్హ‌త‌లు, అప్లికేష‌న్ ప్రాసెస్‌

ఏపీ - జాబ్స్

ఏపీ - జాబ్స్

Jobs in Andhra Pradesh | ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన ప‌రిష‌త్ విశాఖ‌ప‌ట్నం జిల్లాలోని వివిధ ఆస్ప‌త్రుల్లో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ప్రాతిప‌దిక‌న ప‌లు పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ నోటిఫికేష‌న్ ద్వారా ప‌ది విభాగాల్లో క‌లిపి 53 ఖాళీల‌ను భ‌ర్తీ చేస్తారు.

ఇంకా చదవండి ...

  ఆంధ్ర‌ప్ర‌దేశ్ (Andhra Pradesh)  ప్ర‌భుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన ప‌రిష‌త్ విశాఖ‌ప‌ట్నం జిల్లాలోని వివిధ ఆస్ప‌త్రుల్లో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ప్రాతిప‌దిక‌న ప‌లు పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ నోటిఫికేష‌న్ (Notification) ద్వారా ప‌ది విభాగాల్లో క‌లిపి 53 ఖాళీల‌ను భ‌ర్తీ చేస్తారు. ద‌ర‌ఖాస్తు చేసుకొనే అభ్య‌ర్థుల వ‌య‌సు 18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆఫ్‌లైన్ ప‌ద్ధ‌తిలో ఉంటుంది. ఎంపికైన అభ్య‌ర్థుల‌కు పోస్టుల‌ను అనుస‌రించి రూ.15,000 నుంచి రూ.52,000 వ‌ర‌కు వేత‌నం అందిస్తారు. నోటిఫికేష‌న్‌, ద‌ర‌ఖాస్తు స‌మాచారం తెలుసుకోవ‌డానికి అధికారిక వెబ్‌సైట్ https://visakhapatnam.ap.gov.in/ ను సంద‌ర్శించాల్సి ఉంటుంది. ద‌ర‌ఖాస్తులు అంద‌జేయ‌డానికి మార్చ్ 31, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

  ISRO Jobs: ఇస్రో-ఐఐఆర్ఎస్‌లో జాబ్స్‌.. వేత‌నం రూ. 56,100.. అర్హ‌త‌లు, అప్లికేష‌న్ ప్రాసెస్‌

  పోస్టుల వివ‌రాలు.. ఫేస్ 1

  పోస్టువేతనంఖాళీలు
  ఆడియోమెట్రిషియ‌న్‌రూ. 18,50002
  రేడియోగ్రాఫ‌ర్‌రూ. 21, 50003
  థియేట‌ర్ అసిస్టెంట్‌రూ. 15,00001
  ఫార్మాసిస్ట్ గ్రేడ్‌-2రూ. 28,00001

  పోస్టుల వివ‌రాలు.. ఫేస్ 2

  పోస్టువేతనంఖాళీలు
  థియేట‌ర్ అసిస్టెంట్‌రూ. 15,00016
  పోస్టు మార్టం అసిస్టెంట్రూ. 15,00006
  ల్యాబ్ టెక్నిషియన్రూ. 28,00002
  ల్యాబ్ అటెండెంట్రూ. 15,00006
  కౌన్సిలర్రూ. 21,50001
  బయో మెడికల్ ఇంజనీర్రూ. 52,00003
  జనరల్ డ్యూటీ అటెండెంట్రూ. 15,00005
  ప్లంబర్రూ. 18,50003
  ఎలక్ట్రిషియన్రూ. 18,50003
  ఆడియోమెట్రిషియన్రూ. 18,50001

  అర్హతలు

  పోస్టులను అనుసరించి పదోతరగతి, ఐటీఐ, ఇంట‌ర్మీడియ‌ట్‌, డిప్లొమా, బీఈ, బీటెక్‌లో ఉత్తీర్ణ‌త సాధించాలి. సంబంధిత విభాగాల్లో అనుభ‌వం ఉండాలి.

  Govt Jobs 2022: ఓఎన్జీసీలో ఉద్యోగాలు.. నెలకు రూ.1,80,000.. అర్హ‌త‌లు, అప్లికేష‌న్ విధానం

  ఎంపిక విధానం..

  - ముందుగా అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తారు.

  - అనంత‌రం రిజ‌ర్వేష‌న్‌, మెరిట్ మార్కుల ఆధారంగా అభ్య‌ర్థుల‌ను షార్ట్ లిస్ట్ చేస్తారు.

  - ఎంపికైన వారిని కాంట్రాక్ట్ ఆధారంగా పోస్టింగ్ ఇస్తారు.

  Govt Jobs 2022: సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీలో జాబ్స్‌.. నేరుగా ఇంట‌ర్వ్యూ ద్వారా ఎంపిక‌, అర్హ‌త‌లు!

  ద‌ర‌ఖాస్తు విధానం..

  Step 1 - ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆఫ్‌లైన్ ప‌ద్ధతిలో ఉంటుంది.

  Step 2 - ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://visakhapatnam.ap.gov.in/ ను సంద‌ర్శించాలి.

  Step3 - Message Boardలో నోటిఫికేష‌న్‌ను డౌన్‌లోడ్ చేసుకొని చ‌ద‌వాలి.

  Step 4 - అనంత‌రం అర్హ‌త ఉన్న పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు కోసం నోటిఫికేష‌న్ చివ‌ర‌న ఫాంను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

  Step 5 - ద‌ర‌ఖాస్తుకు అవ‌స‌ర‌మైన డాక్యుమెంట్ల‌ను జ‌త‌చేసి ఫాం నింపాలి.

  Army Jobs 2022: ఇండియ‌న్ ఆర్మీలో ఉద్యోగ అవ‌కాశాలు.. అర్హతలు, అప్లికేషన్ విధానం

  Step 6 - ఓసీ అభ్య‌ర్థులు రూ. 500, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్య‌ర్థులు రూ. 300 ఫీజు చెల్లించాలి. పీడబ్ల్యూడీ వారికి ఫీజు చెల్లింపులో మిన‌హాయింపు ఉంది.

  Step 7 - ద‌ర‌ఖాస్తు ఫాంల‌ను

  డిస్ట్రిక్ట్ కో ఆర్డినేట‌ర్ ఆఫ్ హాస్ప‌ట‌ల్ స‌ర్వీస్

  గ‌వ‌ర్న‌మెంట్ హాస్ప‌టల్‌,

  పెందుర్తి, విశాఖ‌ప‌ట్నం.

  అడ్ర‌స్‌కు పంపాలి.

  Step 8 - ద‌ర‌ఖాస్తుకు మార్చ్ 31, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

  Published by:Sharath Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Govt Jobs 2022, Health department jobs, Job notification, Visakhapatnam

  ఉత్తమ కథలు