Home /News /jobs /

JOBS IN ANDHRA PRADESH CONTRACT JOBS IN ANDHRA PRADESH SALARY RS 53500 PE MONTH KNOW APPLICATION PROCEDURE EVK

Jobs in Andhra Pradesh: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కాంట్రాక్టు ఉద్యోగాలు.. నెల‌కు రూ. 53,500 వేత‌నం.. ద‌ర‌ఖాస్తు విధానం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Jobs in AP | ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి చెందిన విజ‌య‌వాడ‌లోని ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ‌శాఖ లో ప‌లు పోస్టుల భ‌ర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తోంది. అప్లికేష‌న్‌ల ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి ఏప్రిల్ 11,2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

    ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి చెందిన విజ‌య‌వాడ‌లోని ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ‌శాఖ (Department of Health and Family Welfare)లో ప‌లు పోస్టుల భ‌ర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఈ నోటిఫికేష‌న్ (Notification) ద్వారా ఈ శాఖ‌లో 36 సివిల్ అసిస్టెంట్ స‌ర్జ‌న్ ఖాళీల‌ను భ‌ర్తీ చేస్తారు. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి అభ్య‌ర్థుల వ‌య‌సు జూలై 7, 2021 నాటికి 42 ఏళ్లు మించ‌కూడ‌దు. ద‌ర‌ఖాస్తు ప‌క్రియ ఆఫ్‌లైన్ ప‌ద్ధ‌తిలో ఉంటుంది. నోటిఫికేష‌న్ వివ‌రాలు.. ద‌ర‌ఖాస్తు విధానం కోసం అధికారిక వెబ్‌సైట్ http://hmfw.ap.gov.in/ ను సంద‌ర్శించాల్సి ఉంటుంది. ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి ఏప్రిల్ 11,2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

    Jobs in Hyderabad: కేంద్ర సంస్థ‌లో కాంట్రాక్టు జాబ్స్‌.. ప‌రీక్ష లేకుండా నేరుగా వాక్ ఇన్ వివ‌రాలు ఇవే

    పోస్టుల వివరాలు..















    పోస్టుఅర్హతలుఖాళీలువేతనం
    సివిల్ అసిస్టెంట్ స‌ర్జ‌న్పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టులలో ఎంబీబీఎస్ ఉత్తీర్ణత క‌లిగి ఉండాలి. అంతే కాకుండా ఏపీ మెడిక‌ల్ కౌన్సిల్‌లో రిజిస్ట‌ర్ అయి ఉండాలి. అభ్య‌ర్థి వ‌య‌సు 42 ఏళ్లు మించి ఉండ‌కూడదు.36రూ. 53,500/-

    ఎంపిక విధానం..
    - ముందుగా అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తారు.
    - అభ్య‌ర్థులు అందించిన స‌మాచారం ప్ర‌కారం మెరిట్‌, అనుభ‌వం ఆధారంగా అభ్య‌ర్థుల‌ను షార్ట్ లిస్ట్ చేస్తారు.
    - ద‌ర‌ఖాస్తుల‌ను ప‌రిశీలించి తుది ఎంపిక ఉంటుంది.

     Jobs in Hyderabad: ఐసీఎంఆర్‌-నిన్‌లో ఉద్యోగాలు.. వేత‌నం నెలకు రూ.44,450.. అర్హ‌త‌లు, అప్లికేష‌న్ ప్రాసెస్‌



    ద‌ర‌ఖాస్తు విధానం..

    Step 1 - ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ఆఫ్‌లైన్ ప‌ద్ధ‌తిలో ఉంటుంది.

    Step 2 - ముందుగా అధికారిక వెబ్‌సైట్ http://hmfw.ap.gov.in/ ను సంద‌ర్శించాల్సి ఉంటుంది.

     Step 3 - అక్క‌డ DPHFW - CAS LIMITED RECRUITMENT NOTIFICATION 2022 లింక్ క్లిక్ చేసి నోటిఫికేష‌న్ చ‌ద‌వాలి.

    Step 4 - అనంత‌రం INSTRUCTIONS TO CANDIDATES లింక్‌లో ద‌ర‌ఖాస్తు విధానం, ఎంపిక విధానం తెలుసుకోవాలి.

    Step 5 - త‌రువాత hmfw.ap.gov.in వెబ్‌సైట్‌లో ద‌ర‌ఖాస్తు ఫాం డౌన్‌లోడ్ చేసుకోవాలి.

    Job Openings: మెజారిటీ ఉద్యోగాలు.. ఆ కోర్సు చేసిన వారికే.. కంపెనీలో పెరుగుతున్న నియామ‌కాలు


    Step 6 - త‌ప్పులు లేకుండా ద‌ర‌ఖాస్తు ఫాం నింపి..
    The Director of Public Health & Family Welfare,
    Himagna Towers, 3rd Floor,
    Saipuram Colony, One Centre,
    Gollapudi,
    Vijayawada. Andhra Pradesh,
    PIN: 521 225. అడ్ర‌స్‌కు అప్లికేష‌న్‌ను పంపాలి.

    Step 7 - ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి ఏప్రిల్ 11, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Andhra Pradesh Government Jobs, Govt Jobs 2022, Job notification, JOBS

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు