Home /News /jobs /

JOBS IN ANDHRA PRADESH 61 JOBS IN GUNTUR DISTRICT TWO DAYS CHANCE TO APPLY KNOW DETAILS EVK

Jobs in Andhra Pradesh: గుంటూరు జిల్లాలో 61 ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తుకు రెండు రోజులే చాన్స్‌!

గుంటూరు జిల్లాలో ఉద్యోగాలు

గుంటూరు జిల్లాలో ఉద్యోగాలు

Jobs in Andhra Pradesh: గుంటూరు (Guntur) జిల్లా ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో ప‌లు పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తోంది. ద‌ర‌ఖాస్తు చేసుకొన్న అభ్య‌ర్థుల‌ను ల్యాబ్ టెక్నీషియ‌న్స్‌, ఫార్మాసిస్ట్ గ్రేడ్‌-2 న‌ర్సులు (Nurse), ఫిజియో థెర‌పీస్టు పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తారు. ఈ పోస్టుల ద‌ర‌ఖాస్తుకు డిసెంబ‌ర్ 15, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

ఇంకా చదవండి ...
    గుంటూరు (Guntur) జిల్లా ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ (Notification) విడుద‌ల అయ్యింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా ల్యాబ్ టెక్నీషియ‌న్స్‌, ఫార్మాసిస్ట్ గ్రేడ్‌-2 న‌ర్సులు (Nurse), ఫిజియో థెర‌పీస్టు త‌దిత‌ర పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ ఉద్యోగాల‌ను ఒప్పంద ప్రాతిప‌దికన తీసుకోనున్నారు. అర్హ‌త‌ల‌కు సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను నోటిఫికేష‌న్‌లో పొందు ప‌రిచారు. అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తుతోపాటు పోస్టుల వారీగా రూ.400 ప‌రీక్ష ఫీజు చెల్లించాలి. ద‌ర‌ఖాస్తు ఫాంలో పంప‌డానికి చివ‌రి తేదీ. డిసెంబ‌ర్ 21, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది. ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివ‌రాలు స‌మాచారం కోసం ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://guntur.ap.gov.in/ ను సంద‌ర్శించాలి. ఈ నోటిఫికేష‌న్ ద్వారా అన్ని విభాగాల్లో క‌లిపి 61 పోస్టులు భ‌ర్తీ చేస్తున్నారు.

    పోస్టుల వివ‌రాలు..



















































































































    పోస్టు పేరుఖాళీలు
    ల్యాబ్ టెక్ గ్రేడ్‌-219
    ఫార్మాసిస్ట్ గ్రేడ్‌-213
    బ‌యో మెడిక‌ల్ ఇంజ‌నీర్01
    ఫిజిస్ట్‌/ న్యూక్లియ‌ర్ ఫిజిస్ట్‌01
    రేడియాల‌జిక‌ల్ ఫిజిస్ట్‌01
    ల్యాబ్ అటెండెంట్‌02
    ఆప్టోమెట్రిస్ట్03
    రీఫ్రాక్ష‌నిస్ట్02
    ఫిజియోథెర‌పిస్ట్01
    డెంట‌ర్ హైజినిస్ట్01
    లేడీ హెల్త్ విజిట‌ర్02
    ఎంపీహెచ్ఏ01
    మార్చురీ మెకానిక్01
    ఆడియో టెక్నిషియ‌న్‌01
     స్పీచ్ థెర‌పిస్ట్02
    ఈసీజీ టెక్నిషియ‌న్10
    కార్డియాల‌జీ టెక్నిషియ‌న్01
    కాథ్‌లాబ్ టెక్నిషియ‌న్02
    ప‌ర్ఫ్యూసినిస్ట్02
    రేడియోగ్రాఫ‌ర్07
    డార్క్ రూం అసిస్టెంట్02
    ఎమ్మారై టెక్నిషియ‌న్02
    డ‌యాల‌సిస్ టెక్నిషియ‌న్05
    డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్06
    ఆపరేష‌న్ థియేట‌ర్ అసిస్టెంట్04
    మేల్ న‌ర్సింగ్22
    ఫిమేల్ న‌ర్సింగ్12

    అర్హ‌త‌లు..
    పోస్టుల‌ను అనుస‌రించి ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్మీడియ‌ట్‌, ఏదైనా డిగ్రీ, ఫార్మాసీ/ బీ ఫార్మ‌సీ/ ఎం ఫార్మ‌సీ/ ఉత్తీర్ణ‌త సాధించాలి. ఏపీ పారా మెడిక‌ల్ బోర్డులో రిజిస్ట‌ర్ అయి ఉండాలి.

    Visakhapatnam: విశాఖ‌ప‌ట్నంలో 59 ఫార్మాసిస్ట్ ఉద్యోగాలు.. అర్హ‌త‌లు, అప్లికేష‌న్ విధానం


    ఎంపిక విధానం..
    - అర్హ‌త గ‌ల అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తారు.
    - అర్హ‌త ప‌రీక్ష‌లో సాధించిన మెరిట్ మార్కులు, అనుభ‌వం, ఇత‌ర వివ‌రాల ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ నిర్వ‌హిస్తారు.

    UPSC Preparation Tips: యూపీఎస్సీ సివిల్స్​ పరీక్షకు ప్రిపేర్​ అవుతున్నారా?.. అయితే ఈ చిట్కాలతో విజయం సాధించండి


    దరఖాస్తు చేసుకొనే విధానం..
    Step 1 :  అభ్య‌ర్థులు కేవ‌లం ఆఫ్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

    Step 2 :  ద‌ర‌ఖాస్తు చేసుకొనే వారు ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ను  https://guntur.ap.gov.in/  సంద‌ర్శించాలి.

    Step 3 :  అనంత‌రం నోటిఫికేష‌న్‌ను పూర్తిగా చ‌ద‌వాలి. (నోటిఫికేష‌న్ కోసం క్లిక్ చేయండి)

    Step 4 :  వెబ్‌సైట్ నుంచి అప్లికేష‌న్ డౌన్‌లోడ్ చేసుకొని, అనంత‌రం అప్లికేష‌న్ ఫాం నింపాలి.

    CTET 2021: సీటెట్ అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ కావ‌డం లేదా.. అయితే ఇలా చేయండి!


    Step 5 :  పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి రూ.300 ఫీజు చెల్లించాలి.

    Step 6 : ద‌ర‌ఖాస్తుల‌ను
    సూప‌రింటెండెంట్,
    గ‌వ‌ర్న‌మెంట్ ఆస్ప‌త్రి,
    గుంటూరు జిల్లా, ఏపీ అడ్ర‌స్‌కు పంపాలి.

    Step 7 :  ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి చివ‌రి తేదీ డిసెంబ‌ర్ 15, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Govt Jobs 2021, Guntur, Job notification, JOBS

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు