విశాఖపట్నం (Visakhapatnam) జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (Notification) విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఫార్మాసిస్ట్ గ్రేడ్-2 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలను ఔట్‌సోర్సింగ్ (Outsourcing ) పద్ధతిలో తీసుకోనున్నారు. అర్హతలకు సంబంధించిన పూర్తి వివరాలను నోటిఫికేషన్‌లో పొందు పరిచారు. దరఖాస్తు ఫాంలో పంపడానికి చివరి తేదీ. డిసెంబర్ 21, 2021 వరకు అవకాశం ఉంది. దరఖాస్తుకు అప్లై చేయాలనుకొన్న అభ్యర్థుల గరిష్ట వయసు 42 ఏళ్లు మించి ఉండ కూడదు. ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు సమాచారం కోసం ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://visakhapatnam.ap.gov.in/ ను సందర్శించాలి. ఈ నోటిఫికేషన్ ద్వారా అన్ని విభాగాల్లో కలిపి 59 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
పోస్టుల వివరాలు..
పోస్టు పేరు | ఖాళీలు |
ఫార్మాసిస్ట్ గ్రేడ్-2 | 59 |
అర్హతలు | ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలనుకొన్న అభ్యర్థులు ఇంటర్మీడియట్‌తోపాటు రెండేళ్ల డిప్లమా (ఫార్మసీ) కోర్సు చేసి ఉండాలి. లేదా బ్యాచ్‌లర్ ఫార్మసీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అంతే కాకుండా ఏపీ ఫార్మసీ కౌన్సిల్‌లో రిజిస్టరై ఉండాలి. |
Online Courses: జాబ్ ట్రయల్స్ చేస్తున్నారా..? రెజ్యూమె రైటింగ్‌పై ఉచిత ఆన్‌లైన్ కోర్స్
ఎంపిక విధానం..
- అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు.
- అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కులు, అనుభవం, ఇతర వివరాల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు చేసుకొనే విధానం..
Step 1 : అభ్యర్థులు కేవలం ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
Step 2 : దరఖాస్తు చేసుకొనే వారు ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ను https://visakhapatnam.ap.gov.in/ సందర్శించాలి.
Jobs in Andhra Pradesh: గుంటూరు జిల్లాలో 61 ఉద్యోగాలు.. అర్హతలు, అప్లికేషన్ వివరాలు తెలుసుకోండి
Step 3 : అనంతరం నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవాలి. (నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి)
Step 4 : వెబ్‌సైట్ నుంచి అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకొని, అనంతరం అప్లికేషన్ ఫాం నింపాలి.
Step 5 : పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి రూ.300 ఫీజు చెల్లించాలి.
Step 6 : దరఖాస్తులను
డీఎంహెచ్ఓ,
విశాఖపట్నం,
ఆంధ్రప్రదేశ్ కార్యాలయానికి పంపాలి
Step 7 : దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ డిసెంబర్ 21, 2021 వరకు అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Govt Jobs 2021, Job notification, JOBS