అంగన్‌వాడీ (Anganwadi) కార్యకర్త , మినీ అంగన్‌వాడీ కార్యకర్త, అంగన్‌వాడీ సహాయకురాలు ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ (Application Process) పూర్తిగా ఆఫ్‌లైన్‌లో ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు పోస్టుల ఆధారంగా రూ.7,000, రూ. 11,500 నెలవారీ వేతనం చెల్లిస్తారు. దరఖాస్తు విధానం, నోటిఫికేషన్ కోసం అధికారిక వెబ్‌సైట్ https://ananthapuramu.ap.gov.in/ ను సందర్శించాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి డిసెంబర్ 16, 2021 వరకు అవకాశం ఉంది.
ముఖ్యమైన సమాచారం..
పోస్టుల సంఖ్య | 365 |
అర్హతలు | అంగన్‌వాడీ (Anganwadi) కార్యకర్త , మినీ అంగన్‌వాడీ కార్యకర్త, అంగన్‌వాడీ సహాయకురాలు పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి పదోతరగతి పాసై ఉండాలి. కచ్చితంగా వివాహిత అయి ఉండాలి. అభ్యర్థి స్థానికంగా ఉండాలి. |
వయోపరిమితి | జూలై 1, 2021 నాటికి అభ్యర్థి వయసు 21 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. |
వేతనం వివరాలు | అంగన్‌వాడీ కార్యకర్తకి నెలకు రూ.11,500మినీ అంగన్‌వాడీ కార్యకర్తకి నెలకు రూ.7,000అంగన్‌వాడీ సహాయకురాలికి రూ.7,000 |
అధికారిక వెబ్‌సైట్ | https://ananthapuramu.ap.gov.in/ |
CAT Cut-off: భారీగా తగ్గనున్న CAT- 2021 కటాఫ్.. 85+ పర్సంటైల్ స్కోర్‌తో IIM ఇంటర్వ్యూ కాల్స్?
ఎంపిక విధానం..
Step 1 : అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు.
Step 2 : సీడీపీఓలు నిర్వహించే డిక్టేషన్, ఇతర వివరాలను పరిగణనలోకి తీసుకొని ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం..
Step 1 : దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆఫ్‌లైన్‌లో ఉంటుంది.
Step 2 : ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://ananthapuramu.ap.gov.in/ ను సందర్శించాలి.
Step 3 : అనంతరం నోటిఫికేషన్ చదవాలి. (నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి)
Step 4 : నోటిఫికేషన్‌లో అర్హతలు.. అన్ని సరిగా చూసుకోవాలి.
Step 5 : నోటిఫికేషన్ చివరిలో దరఖాస్తు ఫాం ఉంటుంది. డౌన్‌లోడ్ చేసుకోవాలి.
Step 6 : తప్పులు లేకుండా దరఖాస్తు ఫాంను నింపాలి.
Step 7 : అనంతరం విద్యార్హతకు సంబంధించిన గజిటెడ్ అధికారిచే ధ్రువీకరించి మెమోలను జతపర్చాలి.
Step 8 : దరఖాస్తులను అందించేందుకు వివరాల కోసం సీడీపీఓ కార్యాలయాన్ని సందర్శించాలి.
Step 9 : దరఖాస్తుకు డిసెంబర్ 16, 2021 వరకు అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Anganwadi, Govt Jobs 2021, Job notification, JOBS