కృష్ణా (Krishna) జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (Notification) విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ల్యాబ్ టెక్నీషియన్స్, నర్సులు (Nurse), ఫిజియో థెరపీస్టు తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలను ఒప్పంద ప్రాతిపదికన తీసుకోనున్నారు. అర్హతలకు సంబంధించిన పూర్తి వివరాలను నోటిఫికేషన్లో పొందు పరిచారు. అభ్యర్థులు దరఖాస్తుతోపాటు పోస్టుల వారీగా రూ.300 పరీక్ష ఫీజు చెల్లించాలి. దరఖాస్తు ఫాంలో పంపడానికి చివరి తేదీ. డిసెంబర్ 15, 2021 వరకు అవకాశం ఉంది. ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు సమాచారం కోసం ముందుగా అధికారిక వెబ్సైట్ https://krishna.ap.gov.in/ ను సందర్శించాలి. ఈ నోటిఫికేషన్ ద్వారా అన్ని విభాగాల్లో కలిపి 117 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
ఖాళీల వివరాలు
పోస్టు పేరు | ఖాళీలు |
ల్యాబ్ టెక్ గ్రేడ్-2 | 18 |
ఫార్మాసిస్ట్ గ్రేడ్-2 | 11 |
ఆడియో టెక్నిషియన్ | 01 |
డార్క్ రూం అసిస్టెంట్ | 02 |
ల్యాబ్ అటెండెంట్ | 01 |
మేల్ నర్సింగ్ | 31 |
స్ట్రేచ్చర్ బాయ్ | 03 |
అటెండర్ | 02 |
ఎంపీహెచ్ఏ | 03 |
ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ | 09 |
ఎక్స్-రే | 01 |
ఫిజిస్ట్/ న్యూక్లియర్ ఫిజిస్ట్ | 02 |
రేడియాలజికల్ ఫిజిస్ట్ | 02 |
డేటా ఎంట్రీ ఆపరేటర్ | 05 |
బయో మెడికల్ ఇంజనీర్ | 02 |
ఆప్టోమెట్రిస్ట్ | 01 |
ఆడియో మెట్రిక్ టెక్నిషియన్ | 01 |
ఈసీజీ టెక్నిషియన్ | 05 |
రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్ | 01 |
స్పీచ్ థెరపిస్ట్ | 02 |
పర్ఫ్యూసినిస్ట్ | 01 |
ఎమ్మారై టెక్నిషియన్ | 04 |
సీటీ టెక్నీషియన్ | 04 |
డయాలసిస్ టెక్నీషియన్ | 05 |
అర్హతలు..
పోస్టులను అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ, ఫార్మాసీ/ బీ ఫార్మసీ/ ఎం ఫార్మసీ/ ఉత్తీర్ణత సాధించాలి. ఏపీ పారా మెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉండాలి.
ఎంపిక విధానం..
- అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు.
- అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కులు, అనుభవం, ఇతర వివరాల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
Jobs in Andhra Pradesh: అనంతపురం జిల్లాలో 365 ఉద్యోగాలు.. అర్హతలు, దరఖాస్తు విధానం
దరఖాస్తు చేసుకొనే విధానం..
Step 1 : అభ్యర్థులు కేవలం ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
Step 2 : దరఖాస్తు చేసుకొనే వారు ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ను https://krishna.ap.gov.in/ సందర్శించాలి.
Step 3 : అనంతరం నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవాలి. (నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి)
Step 4 : వెబ్సైట్ నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని, అనంతరం అప్లికేషన్ ఫాం నింపాలి.
Step 5 : పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి రూ.300 ఫీజు చెల్లించాలి.
Step 6 : దరఖాస్తులను
సూపరింటెండెంట్,
గవర్నమెంట్ ఆస్పత్రి,
విజయవాడ, కృష్ణ జిల్లా, ఏపీ అడ్రస్‌కు పంపాలి.
Step 7 : దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ డిసెంబర్ 15, 2021 వరకు అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Govt Jobs 2021, Health department jobs, Krishna District, Vijayawada