JOBS FOR FRESHERS FRESHERS GOOD CHANCE SALARY OF RS 29000 PER MONTH KNOW APPLICATION PROCESS AND DETAILS EVK
Jobs for Freshers: ఫ్రెషర్స్ గుడ్ చాన్స్.. నెలకు రూ.29,000 వేతనం.. అప్లికేషన్ ప్రాసెస్
(ప్రతీకాత్మక చిత్రం)
Jobs for Freshers | దేశంలో ప్రముఖ ఐటీ కంపెనీ దిగ్గజం విప్రో ఫ్రెషర్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది. ఎలైట్ నేషనల్ టాలెంట్ హంట్ (Wipro Elite National Talent Hunt) పేరుతో గ్రాడ్యుయేట్‌లను రిక్రూట్ చేసుకొంటుంది. ఈ ప్రొగ్రాం ద్వారా 2020, 2021, 2022 ఇంజనీరంగ్ పాసైన విద్యార్థులంతా అర్హులేనని తెలిపింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి జనవరి 31, 2022 వరకు అవకాశం ఉంది.
దేశంలో ప్రముఖ ఐటీ కంపెనీ దిగ్గజం విప్రో (Wipro) ఫ్రెషర్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది. ఎలైట్ నేషనల్ టాలెంట్ హంట్ (Wipro Elite National Talent Hunt) పేరుతో గ్రాడ్యుయేట్‌లను రిక్రూట్ చేసుకొంటుంది. ఈ ప్రొగ్రాం ద్వారా 2020, 2021, 2022 ఇంజనీరంగ్ పాసైన విద్యార్థులంతా అర్హులేనని తెలిపింది. అంటే ఫైనల్ ఇయర్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు సంవత్సరానికి రూ.3.5లక్షల వేతనం అందిస్తారు. అంతే కాకుండా ఒక సంవత్సరం అగ్రిమెంట్ బాండ్ ఉంటుంది. ఎంపికైన వారు 2022-23 సంవత్సరంలో ఉద్యోగాల్లో చేరాల్సి ఉంటుంది. ఇప్పటికే వేల సంఖ్యలో కొత్త వారిని రిక్రూట్ చేసుకొంటూ ఉపాధి కల్పనలో విప్రోదూసుకెళ్తుంది. ఫ్రెషర్స్‌కి ఇది సువర్ణ అవకాశం లాంటిది. ఈ పరీక్షకు దరఖాస్తుచేసు కోవడానికి జనవరి 31, 2022 వరకు అవకాశం ఉంది. పూర్తి వివరాలు తెలుసుకోవడానికి https://app.joinsuperset.com/company/wipro/elite-national-talent-hunt.html లింక్‌ను సందర్శించాలి.
అర్హతలు
- 2020, 2021, 2022లో గ్రాడ్యుయేట్ చేసి ఉండాలి.
- బీటెక్, బీఈ లేదా ఎంటెక్/ ఎంఈ చేసి ఉండాలి.
- పది, ఇంటర్ ఫుల్ టైం కోర్సులు చదివి ఉండాలి.
- పదిలో, ఇంటర్‌లో 60శాతం కంటే ఎక్కువ మార్కులు ఉండాలి.
- ఇంజనీరింగ్‌లో 60శాతం మార్కులు లేదా 6.0 సీజీపీఏ వచ్చి ఉండాలి.
- ఎంపిక సమయానికి ఒక సబ్జెక్ట్ బ్యాక్ లాగ్ ఉన్నా ఆఫర్ లెటర్ ఇస్తారు.
- మూడేళ్ల కన్నా ఎక్కువ ఎడ్యుకేషన్ గ్యాప్ ఉండకూడదు.
- ఆరునెలల వ్యవధిలో ఎటువంటి విప్రో పరీక్షలు రాసి ఉండకూడదు.
పోస్టు పేరు
ప్రాజెక్ట్ ఇంజనీర్
వేతనం
ఏడాదికి రూ.3,50,000
సర్వీస్ అగ్రిమెంట్
12 నెలలు
దరఖాస్తుకు గరిష్ట వయస్సు
25 ఏళ్ల లోపు
ఆన్‌లైన్ పరీక్ష విధానం..
Step 1 : ఆన్‌లైన్ అసెస్‌మెంట్‌లో మూడు సెక్షన్స్ ఉంటాయి.
Step 3 : అనంతరం Register now ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
Step 4 : కొత్త వెబ్ పేజీలో Elite National Talent Hunt అప్లికేషన్ ఫాం ఓపెన్ అవుతుంది.
Step 5 : తప్పులు లేకుండా అప్లికేషన్ నింపాలి.
Step 6 : ఇన్‌స్ట్రక్షన్‌లు పూర్తిగా చదివి అప్లే Apply Know ఆప్షన్ క్లిక్ చేయాలి.
Step 7 : దరఖాస్తుకు జనవరి 31, 2022 వరకు అవకాశం ఉంది.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.