Home /News /jobs /

మూడేళ్లలో ఈ 9 జాబ్స్‌కు ఫుల్ డిమాండ్... చేయాల్సిన కోర్సులివే

మూడేళ్లలో ఈ 9 జాబ్స్‌కు ఫుల్ డిమాండ్... చేయాల్సిన కోర్సులివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కొత్తగా కెరీర్ ఎంచుకునేవాళ్లు, ఆయా రంగాలపై ఆసక్తి ఉన్నవాళ్లు ఇప్పటి నుంచే అందుకు సంబంధించిన కోర్సులు చేయడం మంచిది. ఇప్పటికే ఉద్యోగాల్లో స్థిరపడ్డవాళ్లు కొత్త స్కిల్స్‌పై దృష్టిపెట్టాలి.

  వాల్డ్ ఎకనమిక్ ఫోరమ్ 'ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్' పేరుతో ఇటీవల అధ్యయనం జరిపింది. 2022 నాటికి మంచి అవకాశాలు ఉండే ఉద్యోగాలేవో అంచనా వేసింది. మరి మూడేళ్లలో ఫుల్ డిమాండ్ ఉండే ఆ 9 ఉద్యోగాలు ఏంటీ? ఆ ఉద్యోగాల్లో స్థిరపడాలంటే ఏఏ కోర్సులు చేయాలి? ఇప్పట్నుంచే ఏఏ అంశాలపై దృష్టి పెట్టాలి? తెలుసుకోండి.

  1. డేటా అనలిస్ట్స్ అండ్ సైంటిస్ట్స్


  జాబ్ ప్రొఫైల్: సరికొత్త వ్యూహాలతో వ్యాపారాన్ని మరింత పుంజుకునేందుకు ఉపయోగపడేవాళ్లే డేటా అనలిస్టులు. అంతేకాదు విజువల్ ప్రజెంటేషన్స్‌ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. డేటాను విశ్లేషించి ట్రెండ్స్‌ని గుర్తించగలగాలి. ప్రోటోటైప్స్, ఆల్గరిథమ్స్, ప్రెడిక్టీవ్ మోడల్స్, కస్టమ్ అనాలిసిస్‌లో పట్టు సాధించాలి.
  ముఖ్యమైన స్కిల్స్: పైథాన్ కోడింగ్, హడూప్ ప్లాట్‌ఫామ్, ఆర్ ప్రోగ్రామింగ్, ఎస్‌క్యూఎల్ డేటాబేస్/కోడింగ్, అపాచీ స్పార్క్, మెషీన్ లెర్నింగ్ అండ్ ఏఐ, డేటా విజువలైజేషన్.

  2. ఏఐ, మెషీన్ లెర్నింగ్ స్పెషలిస్ట్స్


  జాబ్ ప్రొఫైల్: డేటాను బట్టి ఆల్గరిథమ్స్ రూపొందించి ప్రెడిక్షన్స్ చేయడం.
  ముఖ్యమైన స్కిల్స్: పైథాన్/సీ++/ఆర్/జావా లాంటి ప్రోగ్రామింగ్ స్కిల్స్, ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్, డేటా మోడలింగ్ అండ్ ఎవాల్యూషన్, మెషీన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్, డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్, అడ్వాన్స్‌డ్ సిగ్నల్ ప్రాసెసింగ్ టెక్నిక్స్.

  Read This: Facebook Tips: మీ ఫేస్‌బుక్‌లో చేయకూడని 9 అంశాలివే...

  jobs, future jobs, Jobs in india, software jobs, technology jobs, parttime jobs, online jobs, work from home jobs, data entry jobs, new jobs, ఉద్యోగాలు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు, ఆన్‌లైన్ ఉద్యోగాలు, డేటా ఎంట్రీ, వర్క్ ఫ్రమ్ హోమ్3. జనరల్ అండ్ ఆపరేషన్స్ మేనేజర్


  జాబ్ ప్రొఫైల్: కంపెనీకి సంబంధించి విధానాలు రూపొందించడం, రోజువారీ కార్యకలాపాలను నిర్వహించడం, మానవ వనరులు, మెటీరియల్స్‌ని సమర్థవంతంగా ఉపయోగించడం.
  ముఖ్యమైన స్కిల్స్: సాంకేతికంగా, నిర్వహణాపరంగా నైపుణ్యం, వ్యాపార కార్యకలాపాలను అర్థం చేసుకోవడం, ఫలితాలను సాధించడం, కస్టమర్లకు సేవలు అందించడం, టీమ్ వర్క్, ఇంటర్‌పర్సనల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్‌షిప్, పర్సనల్ ఎఫెక్టీవ్‌నెస్.

  4. సాఫ్ట్‌వేర్ అండ్ అప్లికేషన్స్ డెవలపర్స్, అనలిస్ట్స్


  జాబ్ ప్రొఫైల్: సాఫ్ట్‌వేర్ రూపొందించడం, డిజైన్ చేయడం, విశ్లేషించడం, పరీక్షించడం. క్లైంట్లకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ అందించడం.
  ముఖ్యమైన స్కిల్స్: ఆండ్రాయిడ్ ప్రోగ్రామింగ్, సీ++, ఎస్‌క్యూఎల్, జావా, జావా స్క్రిప్ట్, యూజర్ ఇంటర్‌ఫేస్/యూజర్ ఎక్స్‌పీరియన్స్, సాఫ్ట్‌వేర్ రూపొందించి నిర్వహించడం, ఎక్స్ఎంఎల్, వెబ్‌ సర్వీసెస్‌ నైపుణ్యాలు.

  Read This: Alert: కేవైసీ పూర్తి కాలేదా? మీ ఇ-వ్యాలెట్ బ్లాక్ అవుతుంది జాగ్రత్త

  jobs, future jobs, Jobs in india, software jobs, technology jobs, parttime jobs, online jobs, work from home jobs, data entry jobs, new jobs, ఉద్యోగాలు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు, ఆన్‌లైన్ ఉద్యోగాలు, డేటా ఎంట్రీ, వర్క్ ఫ్రమ్ హోమ్5. సేల్స్ అండ్ మార్కెటింగ్ ప్రొఫెషనల్స్


  జాబ్ ప్రొఫైల్: మార్కెట్‌ను అధ్యయనం చేయడంతో పాటు కస్టమర్లకు ఉత్పత్తులు, సేవల్ని అమ్మడం. ప్రస్తుతం మార్కెట్‌లో ఉపయోగపడే సరికొత్త ఆలోచనలు చేయడం.
  ముఖ్యమైన స్కిల్స్: కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్నాలజీపై ఆసక్తి, మార్కెట్‌పై లోతైన అవగాహన, ఒప్పించగలిగే సామర్థ్యం.

  6. బిగ్ డేటా స్పెషలిస్ట్స్


  జాబ్ ప్రొఫైల్: సంస్థ ప్రదర్శనను విశ్లేషించడానికి డేటా ఎనాలిసిస్‌ని ఉపయోగించుకోవడం. సంస్థ అభివృద్ధి కోసం సిఫార్సులు చేయడం.
  ముఖ్యమైన స్కిల్స్: అపాచీ హడూప్, అపాచీ స్పార్క్, నోఎస్‌క్యూఎల్, మెషీన్ లెర్నింగ్, డేటా మైనింగ్, స్టాటిస్టికల్ అండ్ క్వాంటిటేటీవ్ అనాలిసిస్, ఎస్‌క్యూఎల్, డేటా విజువలైజేషన్, జెనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్.

  Read This: Honor View 20: అదిరిపోయే ఫీచర్లతో హానర్ వ్యూ 20... విశేషాలివే

  jobs, future jobs, Jobs in india, software jobs, technology jobs, parttime jobs, online jobs, work from home jobs, data entry jobs, new jobs, ఉద్యోగాలు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు, ఆన్‌లైన్ ఉద్యోగాలు, డేటా ఎంట్రీ, వర్క్ ఫ్రమ్ హోమ్7. డిజిటల్ ట్రాన్ఫర్మేషన్ స్పెషలిస్ట్స్


  జాబ్ ప్రొఫైల్: కంపెనీ టెక్నికల్ పెర్ఫామెన్స్‌ని పెంచడం. కంపెనీ మౌలిక సదుపాయాలను విశ్లేషించి సేవల్ని పెంచడం.
  ముఖ్యమైన స్కిల్స్: టెక్నికల్ యాప్టిట్యూడ్, క్రిటికల్ థింకింగ్ ఎబిలిటీస్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఎస్‌క్యూఎల్, సీ++, హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్.

  8. ఆర్గనైజేషనల్ స్పెషలిస్ట్స్


  జాబ్ ప్రొఫైల్: బిజినెస్ గోల్స్ సాధఇంచేందుకు ఉద్యోగులకు ఉపయోగపడే ప్రోగ్రామ్స్ రూపొందించడం. బిజినెస్ ప్రాసెస్‌లో భాగంగా మేనేజ్‌మెంట్‌కు, లీడర్‌షిప్‌కు మధ్య వారధులుగా నిలవడం. కంపెనీ లక్ష్యాలను చేరుకోవడానికి వ్యాపార కార్యక్రమాలను విశ్లేషించడం.
  ముఖ్యమైన స్కిల్స్: డయాగ్నస్టిక్ టూల్స్ ఉపయోగించడం, ఇతరులపై ప్రభావం చూపేలా కలిసిమెలిసి పనిచేయడం.

  Read This: గెలాక్సీ ఎం10, ఎం20 రిలీజ్ చేసిన సాంసంగ్

  jobs, future jobs, Jobs in india, software jobs, technology jobs, parttime jobs, online jobs, work from home jobs, data entry jobs, new jobs, ఉద్యోగాలు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు, ఆన్‌లైన్ ఉద్యోగాలు, డేటా ఎంట్రీ, వర్క్ ఫ్రమ్ హోమ్9. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, న్యూ టెక్నాలజీ స్పెషలిస్ట్స్


  జాబ్ ప్రొఫైల్: టెక్నాలజీ ప్రొడక్ట్స్‌ని డిజైన్ చేయడం, నిర్వహించడం. పలు సంస్థలు, ఏజెన్సీలు, వ్యాపారులకు టెక్నాలజీ సేవలు అందించడం.
  ముఖ్యమైన స్కిల్స్: ఒరాకిల్, సిస్కో, మైక్రోసాఫ్ట్.

  కొత్తగా కెరీర్ ఎంచుకునేవాళ్లు, ఆయా రంగాలపై ఆసక్తి ఉన్నవాళ్లు ఇప్పటి నుంచే అందుకు సంబంధించిన కోర్సులు చేయడం మంచిది. ఇప్పటికే ఉద్యోగాల్లో స్థిరపడ్డవాళ్లు కొత్త స్కిల్స్‌పై దృష్టిపెట్టాలి.

  Photos: మహాత్మాగాంధీ వర్ధంతి... మీరు చూడని జాతిపిత అరుదైన 100 చిత్రాలు ఇవే...

  ఇవి కూడా చదవండి:

  Will you marry me?: వాయిస్ అసిస్టెంట్‌కు యూజర్ల ప్రశ్నలు... గూగుల్ ఫన్నీ రిప్లై

  మొబైల్ యాప్స్‌తో లోన్... తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  Discount on Gold: బంగారంపై 10% డిస్కౌంట్... కొనేందుకు మీరు రెడీనా?

   
  First published:

  Tags: CAREER, EDUCATION, Exams, JOBS

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు