Apna App: దినసరి కూలీలకు ఉద్యోగాల కోసం అప్నా యాప్

Apna App: దినసరి కూలీలకు ఉద్యోగాల కోసం అప్నా యాప్ (ప్రతీకాత్మక చిత్రం)

Apna App | వలస కూలీలు, దినసరి కూలీలకు ఉద్యోగావకాశాలు అందించేందుకు జాబ్ ప్లాట్‌ఫామ్ అయిన అప్నా యాప్ భారీగా ఫండ్స్ సేకరించింది.

  • Share this:
కరోనా మహమ్మారి చాలా మంది జీవితాల్లో చీకటిని మిగిల్చింది. ముఖ్యంగా గ్రామాల నుంచి పట్టణాలకు వలస వచ్చే రోజువారీ కూలీలు, తక్కువ నైపుణ్యం కలిగిన కార్మికులపై కోవిడ్ ప్రభావం తీప్రంగా పడింది. పనులు తగ్గిపోవడంతో అసంఘటిత రంగంలో ఉన్నవారి పరిస్థితి దారుణంగా మారింది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని, వలస కూలీల సహాయార్థం నిధులు సేకరించింది అప్నా అనే స్టార్టప్. ఈ క్రమంలో 70 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.515 కోట్లు) సమీకరించినట్లు తెలిపింది. ఈ కార్యక్రమంలో టైగర్ గ్లోబల్ పాటు లైట్ స్పీడ్ ఇండియా, సీక్యోవా క్యాపిటల్ ఇండియా, గ్రీనోక్స్ క్యాపిటల్, రాకెట్ షిప్ విసి కూడా భాగస్వాములయ్యాయి. ఈ సంస్థ కార్మికుల నెట్‌వర్క్ గ్యాప్ సమస్యను పరిష్కరిస్తుంది.

ఉద్యోగావిష్కరణ, ఉద్యోగ భద్రత


అప్నా ప్లాట్‌ఫాం అసంఘటిత రంగ కార్మికులకు మౌలిక సదుపాయాలను నిర్మిస్తుంది. కార్మికులకు సరైన యజమానుల కింద నియమించి ఉద్యోగ భద్రతను పెంచేలా ఈ సంస్థ పనిచేస్తుంది. ఉద్యోగావిష్కరణ ప్రక్రియను డిజిటలైజ్ చేయడం, అభ్యర్థుల ఇంటరాక్షన్ ప్రక్రియలో విప్లవాత్మక మార్పులను కలిగి ఉంది అని టైగర్ గ్లోబల్ భాగస్వామి గ్రిఫిన్ ప్రోడర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

SBI Alert: ఇలాంటి న‌కిలీ యాప్‌ల‌తో జ‌ర జాగ్ర‌త్త‌... ఎస్‌బీఐ హెచ్చ‌రిక

IBPS RRB Jobs 2021: తెలుగు రాష్ట్రాల్లో భారీగా బ్యాంకు ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే

కెరీర్ కౌన్సెలింగ్ కోసం అప్నా యాప్


ఈ స్టార్టప్ పేరులేని ఓ ఆండ్రాయిడ్ యాప్. ఇది పలు బాషలు, వివిధ ఫీచర్లతో లభిస్తుంది. ఇందులో చిత్రకారులు, వడ్రంగి, అనేక ఇతర చేతివృత్తుల నిపుణుల కోసం 70 కమ్యూనిటీలు ఉంటాయి. ఈ యాప్ లో వినియోగదారులు ఒకరికొకరు కనెక్ట్ అవుతారు. ఉద్యోగాల్లో తమను తాము మెరుగుపరచుకోవడానికి లీడ్స్, షేర్ చిట్కాలను పొందుపరుస్తారు. ఇంటర్వ్యూలో మెరుగైన ప్రదర్శన కనబర్చి ఉద్యోగాలకు అర్హత సాధించే అవకాశాన్ని కూడా ఈ యాప్ అందిస్తుంది. కెరీర్ కౌన్సెలింగ్, రెజ్యూమ్ బిల్డింగ్, ఇతర పనుల్లో సాయపడుతుంది. ప్రస్తుతం ఈ యాప్‌ను 10 మిలియన్ల మంది యూజర్లు వినియోగిస్తున్నారు. గత నెలలో 15 మిలియన్ల ఉద్యోగ ఇంటర్వ్యూలను సంస్థ నిర్వహించింది.

IBPS RRB 2021: రీజనల్ రూరల్ బ్యాంకుల్లో 10,676 ఉద్యోగాలు... పరీక్ష సిలబస్ ఇదే

Railway Jobs 2021: రైల్వేలో 3378 ఉద్యోగాలు... ఆంధ్రప్రదేశ్‌లోని ఆ రెండు జిల్లా అభ్యర్థులకు అవకాశం

ఈ యాప్ లో కొన్ని పబ్లిక్, ప్రైవేట్ సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయి. అంతేకాకుండా భారత మైనార్టీ మంత్రిత్వ శాఖ మద్దతు కూడా ఉంది. దీంతో పాటు జాతీయ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, యూనిసెఫ్ యువా సంస్థలు అభ్యర్థులకు ఉద్యోగావకాశాలు, నైపుణ్యాలను అందిస్తున్నాయి. దాదాపు లక్ష నియామక సంస్థలు ఈ యాప్ లో రిజిస్టరై ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో బైజూస్, అన్ అకాడమీ, ఫ్లిప్ కార్ట్, జొమాటో, లిసియస్, బర్గర్ కింగ్, డుంజో, భారతీ ఏఎక్స్ఏ, డిల్హీవెరీ, టీమ్ లీజ్, జీ4ఎస్ గ్లోబల్, షాడో ఫాక్స్ లాంటి బహుళ జాతీయ కంపెనీలు అప్నా ప్లాట్ ఫాంను ఉపయోగిస్తున్నాయి.

ఈ యాప్‌లో ఉద్యోగ పోస్టులను పోస్ట్ చేయడానికి ఐదు నిమిషాల కంటే తక్కువ సమయం పడుతుంది. రెండు రోజుల్లో సంబంధిత నైపుణ్యాలు కలిగిన హైపర్ లోకల్ అభ్యర్థులు దీంట్లో అనుసంధానం అవుతారు. డిజిటల్ ప్రొఫెషనల్ ఐడెంటిటీ నెట్వర్క్, యాక్సెస్ స్కిల్స్ ట్రైనింగ్, అధిక నాణ్యత కలిగిన గల ఉద్యోగాలను స్థాపించడానికి భారత్ లో శ్రామిక శక్తికి మార్కెట్ ప్రముఖ ప్లాట్ ఫాంను నిర్మించిందని ఇన్ సైట్ పార్టనర్స్ ఎండీ నిఖిల్ సచ్ దేవ్ తెలిపారు.
Published by:Santhosh Kumar S
First published: