అన్ని అర్హతలు ఉన్నా మంచి ఉద్యోగం లేదని బాధపడుతున్నారా? మంచి ఉద్యోగానికి అప్లై చేయాలనుకుంటున్నారా? అయితే మీకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వ సంస్థలతో పాటు ఇతర సంస్థలు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తున్నాయి. వాటిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్, భారతీయ రైల్వే, లోక్‌సభ లాంటి నోటిఫికేషన్లు ఉన్నాయి. చాలావరకు నోటిఫికేషన్లకు దరఖాస్తు చేయడానికి జనవరి 20 చివరి తేదీ. మరి ఆ నోటిఫికేషన్లు ఏంటో, మీ అర్హతలకు తగ్గ ఉద్యోగాలేంటో తెలుసుకోండి.
1. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగం మీ కలా? ఎయిర్‌మెన్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది ఇండియన్ ఎయిర్‌ఫోర్స్. గ్రూప్ ఎక్స్, గ్రూప్ వై ట్రేడ్స్ 01/2021 బ్యాచ్ ఎయిర్‌మెన్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. దరఖాస్తుకు 2020 జనవరి 20 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం
ఇక్కడ క్లిక్ చేయండి.2. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్-DMRC మొత్తం 1493 ఖాళీలను ప్రకటించింది. ఎగ్జిక్యూటీవ్ కేటగిరీలో 166, నాన్ ఎగ్జిక్యూటీవ్ కేటగిరీలో 1327 ఖాళీలను భర్తీ చేస్తోంది. దరఖాస్తు గడువును జనవరి 20 వరకు పొడిగించింది. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. మరిన్ని వివరాల కోసం
ఇక్కడ క్లిక్ చేయండి.
3. నార్త్ సెంట్రల్ రైల్వేలో గ్రూప్ సీ పోస్టుల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 21 ఖాళీలున్నాయి. స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేస్తున్న పోస్టులు ఇవి. మరిన్ని వివరాల కోసం
ఇక్కడ క్లిక్ చేయండి.
4. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్-BHEL ట్రేడ్ అప్రెంటీస్, టెక్నీషియన్ అప్రెంటీస్, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 300 పోస్టుల్ని ప్రకటించింది. దరఖాస్తుకు 2020 జనవరి 20 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం https://jhs.bhel.com/ వెబ్సైట్ చూడొచ్చు. మరిన్ని వివరాల కోసం
ఇక్కడ క్లిక్ చేయండి.
5. లోక్‌సభ సెక్రటేరియట్ ఉద్యోగాల భర్తీ చేయపట్టింది. పార్లమెంటరీ రిపోర్టర్ గ్రేడ్ 2 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది. మొత్తం 21 ఖాళీలున్నాయి. రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాల కోసం
ఇక్కడ క్లిక్ చేయండి.
6. పుదుచ్చెరిలోని జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్-JIPMER ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసేంది. గ్రూప్ బీ, గ్రూప్ సీ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 107 ఖాళీలను ప్రకటించింది. పూర్తి వివరాల కోసం
ఇక్కడ క్లిక్ చేయండి.7. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్-SAIL భిలాల్ స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 358 ఖాళీలను ప్రకటించింది. అందులో గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టులు 154, టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టులు 204 ఉన్నాయి. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. మరిన్ని వివరాల కోసం
ఇక్కడ క్లిక్ చేయండి.
8. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్ పోస్టుల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల చేసింది ఆర్బీఐ. మొత్తం 17 పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి 2020 జనవరి 20 చివరి తేదీ. మరిన్ని వివరాల కోసం
ఇక్కడ క్లిక్ చేయండి.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే ముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి తగిన అర్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి.
Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి:
Bank Jobs: నాబార్డ్‌లో 150 అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు... మొదలైన దరఖాస్తు ప్రక్రియ
Vizag Steel Jobs: వైజాగ్ స్టీల్‌లో 188 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
Jobs: భారతీయ రైల్వే సంస్థలో 100 జాబ్స్... మొదలైన దరఖాస్తులు