హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Isro Jobs: ప‌దోత‌ర‌గ‌తి అర్హ‌త‌తో ఇస్రోలో ఉద్యోగాలు.. సెప్టెంబ‌ర్ 6 వ‌ర‌కే ద‌ర‌ఖాస్తుకు అవ‌కాశం

Isro Jobs: ప‌దోత‌ర‌గ‌తి అర్హ‌త‌తో ఇస్రోలో ఉద్యోగాలు.. సెప్టెంబ‌ర్ 6 వ‌ర‌కే ద‌ర‌ఖాస్తుకు అవ‌కాశం

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్‌(Liquid Propulsion Systems Center)లో 8 ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌డానికి నోటిఫికేష‌న్(Notification) విడుద‌ల చేసింది. ఉద్యోగాలకు ప‌ది, ఇంట‌ర్(Inter)చ‌దివ‌ని ఆస‌క్తిగ విద్యార్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు

ఇంకా చదవండి ...

  భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (Indian Space Research Center ) లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్‌(Liquid Propulsion Systems Center)లో 8 ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌డానికి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఉద్యోగాలకు ప‌ది, ఇంట‌ర్ చ‌దివ‌ని ఆస‌క్తిగ విద్యార్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు

  భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్‌(Liquid Propulsion Systems Center)లో 8 ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌డానికి నోటిఫికేష‌న్(Notification) విడుద‌ల చేసింది. ఉద్యోగాలకు ప‌ది, ఇంట‌ర్ చ‌దివ‌ని ఆస‌క్తిగ విద్యార్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ (LPSC) ఇస్రోలో ఉంది. ఈ విభాగానికి రెండు యూనిట్లు ఉన్నాయి. కేర‌ళ(Kerala) తిరువ‌నంత‌పురంలోని వ‌లియ‌మాల, మ‌రొక‌టి క‌ర్ణాట‌క‌లోని బెంగుళూర్‌లో ఉంది. ప్ర‌స్తుతం ఎల్‌పీఎస్‌సీలో ప‌లు విభాగాల్లో 8 ఖాళీల‌ను గుర్తించింది. వీటి ఎంపిక‌కు ద‌ర‌ఖాస్తుల‌ను(Applications) ఆహ్వానించింది. ఎంపికైన వారికి అనుభ‌వం(Experience) ఆధారంగా రూ.63,000 జీతం అందించ‌నున్నారు.

  Jobs in Network18: మీడియాలో జాబ్ మీ కలా? నెట్వర్క్18 లో ఫ్రెషర్ ఉద్యోగాలకు అప్లై చేయండి ఇలా  నోటిఫికేష‌న్ ఆధారంగా తిరువ‌నంత‌ర‌పురం, బెంగుళూరు(Benglore) విభాగాల్లో ఎల్‌పీఎస్‌సీలో(LPSC) ఖాళీల‌ను భ‌ర్తీ చేస్తున్నారు. ప‌లు పోస్టుల‌కు 35 ఏళ్లు గ‌రిష్ట ప‌రిమితి ఉంది.. కొన్ని పోస్టుల‌కు 25 ఏళ్ల గ‌రిష్ట వ‌యో ప‌రిమితి ఉంది.

  అర్హ‌తలు, పోస్టుల వివ‌రాలు ఇవే..

  హెవీ వెహికిల్ డ్రైవ‌ర్(Heavy Vehicle Driver) - ఐదు సంవ‌త్స‌రాల హెవీ వెహికిల్ డ్రైవింగ్ అనుభ‌వంతో పాటు ప‌ది లేదా ఇంట‌ర్ పాసై ఉండాలి. పోస్టుల సంఖ్య -2

  లైట్ వెహికిల్ డ్రైవ‌ర్(Light Vehicle Driver) - ఐదు సంవ‌త్స‌రాలు లైట్ వెహికిల్ డ్రైవ‌ర్ అనుభ‌వంతోపాటు ప‌ది లేద ఇంట‌ర్ పాసై ఉండాలి. పోస్టుల సంఖ్య -2

  కుక్(Cook) - ప‌ది లేదా ఇంట‌ర్ పాసై ఐదు సంవ‌త్స‌రాలు అనుభవం ఉండాలి. పోస్టుల సంఖ్య -1

  ఫైర్‌మ్యాన్(Fireman) - ప‌దో త‌ర‌గ‌తి పాసై ఉండాలి. సంస్థ ఫిట్‌నెస్ ప‌రీక్ష‌లో పాస్ అవ్వాలి. పోస్టుల సంఖ్య -2

  క్యాటరింగ్ అటెండెంట్(Catering Attendant) - ప‌దోత‌ర‌గతి పాసై ఉండాలి. పోస్టుల సంఖ్య -1

  ద‌ర‌ఖాస్తు చేసుకొనే విధానం..

  ఆసక్తి ఉన్న మరియు అర్హత ఉన్న అభ్యర్థులు 24 ఆగష్టు 2021 నుంచి 6 సెప్టెంబర్ 2021 వరకు ఎల్‌సీపెస్‌సీ అధికారిక వెబ్‌సైట్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ఇత‌ర ప‌ద్ధ‌తుల్లో ద‌ర‌ఖాస్తులు స్వీక‌రించ‌ద‌రు. అధికారిక నోటిఫికేష‌న్ ద్వారా మాత్ర‌మే అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తామ‌ని ఇస్రో స్ప‌ష్టం చేసింది.

  ద‌ర‌ఖాస్తు చేసుకొవ‌డానికి క్లిక్ చేయండి

  ద‌ర‌ఖాస్తుకు ఆఖ‌రు తేదీ - సెప్టెంబ‌ర్ 6, 2021

  Published by:Sharath Chandra
  First published:

  Tags: Govt Jobs 2021, ISRO, Job notification

  ఉత్తమ కథలు